సెమీస్‌లో సానియా జోడి | Sania Mirza and Martina Hingis reach China Open semis | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో సానియా జోడి

Published Thu, Oct 8 2015 11:44 PM | Last Updated on Sun, Sep 3 2017 10:39 AM

సెమీస్‌లో సానియా జోడి

సెమీస్‌లో సానియా జోడి

బీజింగ్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జోడి... చైనా ఓపెన్ టోర్నీలో సెమీస్‌లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన మహిళల డబుల్స్ క్వార్టర్‌ఫైనల్లో టాప్‌సీడ్ సానియా-హింగిస్ 7-6 (5), 6-4తో జూలియా జార్జెస్ (జర్మనీ)-కరోలినా ప్లిస్కోవా (చెక్)పై నెగ్గారు. గంటా 20 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఇండో-స్విస్ ద్వయం స్థాయికి తగ్గ ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఈ ఏడాది రెండు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో కలిపి ఇప్పటికే ఏడు ట్రోఫీలను ఈ జోడి సొంతం చేసుకుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement