Canada Open Grand Prix tournament
-
సాయి ప్రణీత్‌కు టైటిల్
* కెనడా ఓపెన్ బ్యాడ్మింటన్ * డబుల్స్ టైటిల్ నెగ్గిన సుమిత్-మను కాల్గరీ (కెనడా): కెనడా ఓపెన్ గ్రాండ్‌ప్రి టోర్నమెంట్లో తెలుగు కుర్రాడు సాయి ప్రణీత్ సత్తా చాటాడు. సింగిల్స్ విభాగంలో విజేతగా నిలిచి, కెరీర్లో తొలిసారి గ్రాండ్‌ప్రి టైటిల్‌ను సాధించాడు. పురుషుల డబుల్స్‌లో మను అత్రి- సుమిత్ రెడ్డి జోడి టైటిల్‌ను చేజిక్కించుకుంది. మార్టిన్ మ్యాక్ సెంటర్లో ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్‌లో నాలుగో సీడ్ సాయిప్రణీత్ 21- 12, 21- 10తో మూడో సీడ్ లీహ్యూన్ (కొరియా)పై నెగ్గగా... డబుల్స్ విభాగంలో మను అత్రి-సుమిత్ రెడ్డి జోడి 21-8, 21-14తో అడ్రియన్ లియు- టాబీ (కెనడా) జంటపై విజయం సాధించింది. ఈ టోర్నీలో ఆద్యంతం అద్భుత ప్రదర్శనతో రాణించిన సాయి ప్రణీత్.. ఫైనల్లో కొరియన్ ప్రత్యర్థిని సులువుగా మట్టికరిపించాడు. ఏ దశలోనూ లీహ్యూన్, ప్రణీత్‌కు పోటీనివ్వలేకపోయాడు. -
ఫైనల్లో జ్వాల-అశ్విని జంట
కెనడా ఓపెన్ గ్రాండ్‌ప్రి టోర్నీ కాల్గారి (కెనడా): రెండేళ్ల నిరీక్షణ తర్వాత భారత బ్యాడ్మింటన్ డబుల్స్ జోడీ గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప ఓ అంతర్జాతీయ టోర్నమెంట్లో ఫైనల్లోకి ప్రవేశించింది. కెనడా ఓపెన్ గ్రాండ్‌ప్రి టోర్నమెంట్లో ఈ ద్వయం టైటిల్ పోరుకు అర్హత సాధించింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్లో మూడో సీడ్ జ్వాల-అశ్విని 21-17, 21-16తో షిహో తనకా-కోహర్ యోనెమిటో (జపాన్)లపై నెగ్గారు. ఫైనల్లో జ్వాల-అశ్విని... టాప్‌సీడ్ సెలెనా పీక్-ముస్కెన్స్ (నెదర్లాండ్స్)లతో తలపడతారు. 2013లో చివరిసారి టాటా ఓపెన్ ఇండియా ఇంటర్నేషనల్ చాలెంజ్ టోర్నీలో ఫైనల్‌కు చేరిన జ్వాల-అశ్విని జంట రన్నరప్‌తో సరిపెట్టుకుంది. 30 నిమిషాల పాటు జరిగిన సెమీస్‌లో భారత ద్వయం స్థాయికి తగ్గట్టుగా రాణించింది. తొలి గేమ్ ఆరంభంలో కాస్త వెనుకబడినా... 4-4, 6-6తో స్కోరు సమం చేసింది. తర్వాత వరుస పాయింట్లతో 9-6 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే జపాన్ జంట పుంజుకుని 14-14తో తమ అనుభవాన్ని రంగరించి వరుస పాయింట్లతో జ్వాల జంటకు కళ్లెం వేసింది. స్కోరు సమం చేసినా.. జ్వాల జోడీ వరుసగా నాలుగు పాయింట్లతో 18-14 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. -
క్వార్టర్స్‌లో సాయిప్రణీత్
న్యూఢిల్లీ : హైదరాబాద్ యువ షట్లర్ భమిడిపాటి సాయిప్రణీత్ కెనడా ఓపెన్ గ్రాండ్‌ప్రి బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సాయిప్రణీత్ 14-21, 21-15, 21-15తో నిలుక కరుణరత్నె (శ్రీలంక)పై విజయం సాధించాడు. క్వార్టర్ ఫైనల్లో లీ చోంగ్ వీ (మలేసియా)తో సాయిప్రణీత్ ఆడతాడు. అజయ్ జయరామ్ 21-12, 17-21, 21-12తో యులి ప్రాసెట్యో (ఇండోనేసియా)పై గెలి చి క్వార్టర్స్‌కు చేరాడు. మహిళల డబుల్స్ ప్రిక్వా ర్టర్స్‌లో జ్వాల-అశ్విని 16-21, 21-16, 21-17తో సమంత బార్నింగ్-ఐరిస్ తబెలింగ్ (నెదర్లాండ్స్)లపై, సిక్కి రెడ్డి-ప్రద్నా 21-15, 21-12తో జోహానా గొలిస్జెవ్స్కీ-కార్లా నెల్టె (జర్మనీ)లపై నెగ్గారు.