
సాయి ప్రణీత్‌కు టైటిల్
కెనడా ఓపెన్ గ్రాండ్‌ప్రి టోర్నమెంట్‌లో తెలుగు కుర్రాడు సాయి ప్రణీత్ సత్తా చాటాడు. సింగిల్స్ విభాగంలో విజేతగా నిలిచి...
* కెనడా ఓపెన్ బ్యాడ్మింటన్
* డబుల్స్ టైటిల్ నెగ్గిన సుమిత్-మను
కాల్గరీ (కెనడా): కెనడా ఓపెన్ గ్రాండ్‌ప్రి టోర్నమెంట్‌లో తెలుగు కుర్రాడు సాయి ప్రణీత్ సత్తా చాటాడు. సింగిల్స్ విభాగంలో విజేతగా నిలిచి, కెరీర్‌లో తొలిసారి గ్రాండ్‌ప్రి టైటిల్‌ను సాధించాడు. పురుషుల డబుల్స్‌లో మను అత్రి- సుమిత్ రెడ్డి జోడి టైటిల్‌ను చేజిక్కించుకుంది. మార్టిన్ మ్యాక్ సెంటర్‌లో ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్‌లో నాలుగో సీడ్ సాయిప్రణీత్ 21- 12, 21- 10తో మూడో సీడ్ లీహ్యూన్ (కొరియా)పై నెగ్గగా...
డబుల్స్ విభాగంలో మను అత్రి-సుమిత్ రెడ్డి జోడి 21-8, 21-14తో అడ్రియన్ లియు- టాబీ (కెనడా) జంటపై విజయం సాధించింది. ఈ టోర్నీలో ఆద్యంతం అద్భుత ప్రదర్శనతో రాణించిన సాయి ప్రణీత్.. ఫైనల్లో కొరియన్ ప్రత్యర్థిని సులువుగా మట్టికరిపించాడు. ఏ దశలోనూ లీహ్యూన్, ప్రణీత్‌కు పోటీనివ్వలేకపోయాడు.