సింగపూర్ సిటీ: గతేడాది ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి ఏకంగా టైటిల్ నెగ్గిన భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ భమిడిపాటి సాయిప్రణీత్ ఈసారి సింగపూర్ ఓపెన్‌లో తొలి రౌండ్‌లోనే నిష్క్రమించాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో ప్రపంచ 24వ ర్యాంకర్ సాయిప్రణీత్ 21–16, 16–21, 18–21తో 59వ ర్యాంకర్ యు ఇగారషి (జపాన్) చేతిలో ఓడిపోయాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో స్కోరు 17–17తో సమంగా ఉన్న దశలో సాయిప్రణీత్ వరుసగా మూడు పాయింట్లు కోల్పోయి మూల్యం చెల్లించుకున్నాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో కశ్యప్ 15 నిమిషాల్లో 9–21, 6–21తో భారత్‌కే చెందిన సౌరభ్ వర్మ చేతిలో... క్వాలిఫయర్ గురుసాయిదత్ 14–21, 19–21తో కియావో బిన్ (చైనా) చేతిలో ఓడిపోయారు. శుభాంకర్ డే 14–21, 21–14, 21–16తో జేసన్ ఆంథోని (కెనడా)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరాడు.
రుత్విక శుభారంభం
మహిళల సింగిల్స్ విభాగంలో రుత్విక శివాని, రితూపర్ణ దాస్ ముందంజ వేయగా... జక్కా వైష్ణవి రెడ్డి, చుక్కా సాయి ఉత్తేజిత రావు తొలి రౌండ్‌లో ఓడిపోయారు. రుత్విక 21–15, 17–21, 21–16తో ప్రపంచ 44వ ర్యాంకర్ లిండా జెట్‌చిరి (బల్గేరియా)ను ఓడించింది. రితూపర్ణ 5–3తో ఆధిక్యంలో ఉన్నపుడు ఆమె ప్రత్యర్థి సబ్రీనా జాక్వెట్ (స్విట్జర్లాండ్) గాయంతో వైదొలిగింది. వైష్ణవి 19–21, 7–21తో మినత్సు మితాని (జపాన్) చేతిలో, ఉత్తేజిత 23–21, 4–21, 6–21తో బీట్‌రిజ్ కొరాలెస్ (స్పెయిన్) చేతిలో పరాజయం పాలయ్యారు. మిక్స్‌డ్ డబుల్స్ తొలి రౌండ్‌లో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా (భారత్) ద్వయం 21–19, 16–21, 21–12తో జోన్స్ జాన్సెన్–కార్లా నెల్టీ (జర్మనీ) జోడీపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప జంట 21–18, 13–21, 14–21తో ఎన్జీ సాజ్ యావు–యుయెన్ సిన్ యింగ్ (హాంకాంగ్) జోడీ చేతిలో ఓడిపోయింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జంట 21–16, 24–22తో రిజ్కీ హిదాయత్–లో కీన్ హీన్ (సింగపూర్) ద్వయంపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది.
సాయిప్రణీత్‌కు చుక్కెదురు
Published Thu, Jul 19 2018 12:42 AM | Last Updated on Thu, Jul 19 2018 12:42 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment