క్వార్టర్స్‌లో సాయిప్రణీత్ | Sai Praneeth in Quarters | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో సాయిప్రణీత్

Published Sat, Jun 20 2015 1:19 AM | Last Updated on Fri, Aug 24 2018 8:44 PM

క్వార్టర్స్‌లో సాయిప్రణీత్ - Sakshi

క్వార్టర్స్‌లో సాయిప్రణీత్

న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు లభించాయి. భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి తర్వాత జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో హైదరాబాద్ ప్లేయర్, 16వ సీడ్ సాయిప్రణీత్ 21-17, 16-21, 21-18తో హుయాంగ్ యుజియాండ్ (చైనా)పై నెగ్గి క్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. ఇతర మ్యాచ్‌ల్లో ఆర్‌ఎంవీ గురుసాయిదత్ 20-22, 21-13, 16-21తో 9వ సీడ్ టకుమా ఉయెడా (జపాన్) చేతిలో; 14వ సీడ్ అజయ్ జయరామ్ 18-21, 19-21తో టాప్‌సీడ్ టియాన్ చెన్ (చైనీస్ తైపీ) చేతిలో పరాజయం చవిచూశారు. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో నాలుగోసీడ్ జ్వాల-అశ్విని 21-10, 21-18తో బెరాక్-నిస్లిహన్ యిగిటి (టర్కీ)లపై నెగ్గి క్వార్టర్స్‌కు చేరారు. పురుషుల డబుల్స్‌లో మను అత్రి-సుమీత్ రెడ్డి ద్వయం 21-18, 14-21, 21-19తో రెండోసీడ్ హషిమోటో-హిరాటా (జపాన్) జోడీపై నెగ్గింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement