US Grand Prix Gold and Grand Prix
-
కశ్యప్‌పై ప్రణయ్ పైచేయి
యూఎస్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీ టైటిల్ సొంతం కాలిఫోర్నియా: భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ ప్లేయర్ హెచ్ఎస్ ప్రణయ్ తన కెరీర్లో నాలుగో అంతర్జాతీయ సింగిల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. యూఎస్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్లో ప్రణయ్ చాంపియన్‌గా నిలిచాడు. తన సహచరుడు పారుపల్లి కశ్యప్‌తో జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రణయ్ 21–15, 20–22, 21–12తో విజయం సాధించాడు. గతంలో ప్రణయ్ వియత్నాం ఓపెన్ గ్రాండ్‌ప్రి, ఇండోనేసియా మాస్టర్స్ గ్రాండ్‌ప్రి గోల్డ్ (2014లో), స్విస్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ (2016లో) టోర్నీలలో టైటిల్స్ సాధించాడు. రెండేళ్ల విరామం తర్వాత ఓ అంతర్జాతీయ టోర్నీలో ఫైనల్ ఆడిన 30 ఏళ్ల కశ్యప్ 65 నిమిషాలపాటు పోరాడినా తనకంటే మెరుగైన ఫిట్నెస్ ఉన్న ప్రణయ్ ధాటికి ఎదురు నిలువలేకపోయాడు. హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో శిక్షణ పొందుతున్న ఈ ఇద్దరూ మూడేళ్ల తర్వాత ముఖాముఖిగా తలపడ్డారు. తొలి గేమ్‌లో కశ్యప్ 7–1తో ముందంజ వేసినా ఆ తర్వాత ప్రణయ్ దూకుడుకు వెనుకబడ్డాడు. స్కోరును 15–15 వద్ద సమం చేసిన ప్రణయ్ ఈ దశలో వరుసగా ఆరు పాయింట్లు గెలిచి తొలి గేమ్‌ను దక్కించుకున్నాడు. రెండో గేమ్‌లో కశ్యప్ తేరుకొని మళ్లీ ఆధిక్యంలోకి వెళ్లాడు. ఒకదశలో స్కోరు 15–15తో సమంగా నిలిచినా... కశ్యప్ నిలకడగా పాయింట్లు గెలిచి 20–18తో పైచేయి సాధించాడు. ప్రణయ్ రెండు పాయింట్లు గెలిచి స్కోరును సమం చేసినా... కశ్యప్ మళ్లీ రెండు పాయింట్లు సాధించి రెండో గేమ్‌ను దక్కించుకున్నాడు. ఇక నిర్ణాయక మూడో గేమ్‌లో 24 ఏళ్ల ప్రణయ్ ఆరంభం నుంచే జోరు కనబరిచాడు. 13–7తో ఆధిక్యంలోకి వెళ్లిన ఈ కేరళ ఆటగాడు ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. విజేతగా నిలిచిన ప్రణయ్‌కు 9,000 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 5 లక్షల 79 వేలు)తోపాటు 7,000 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ కశ్యప్‌కు 4,560 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 2 లక్షల 93 వేలు)తోపాటు 5,950 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
ప్రణయ్‌దే యూఎస్ ఓపెన్
కాలిఫోర్నియా: యూఎస్ ఓపెన్ గ్రాండ్ ప్రి గోల్డ్ టోర్నీ లో భారత్ ఆటగాడు హెచ్ఎస్ ప్రణయ్ విజేతగా నిలిచాడు. మరో భారత ఆటగాడు పారుపల్లి కశ్యప్ తో తుది పోరులో ప్రణయ్ విజయం సాధించి టైటిల్ ను ఎగురేసుకుపోయాడు. తద్వారా తన కెరీర్లో మూడో గ్రాండ్ ప్రి గోల్డ్ టైటిల్ ను ప్రణయ్ సాధించాడు. దాదాపు గంటకుపైగా జరిగిన పోరులో ప్రణయ్ 21-15, 20-22, 20-12 తేడాతో కశ్యప్ పై గెలిచాడు. తొలి గేమ్ ను గెలిచిన ప్రణయ్.. రెండో గేమ్ లో పోరాడి ఓడాడు. ఇక నిర్ణయాత్మక మూడో గేమ్ లో ప్రణయ్ దాటిగా ఆడి కశ్యప్ కు షాకిచ్చాడు. గత ఏడాది స్విస్ ఓపెన్ గెలుచుకున్న తరువాత ప్రణయ్ ఓ అంతర్జాతీయ టోర్నీలో ఫైనల్ చేరడం ఇదే తొలిసారి కాగా, ఈ ఏడాది ఇద్దరు భారత ఆటగాళ్లు ఫైనల్ చేరడం రెండో సారి. సింగపూర్ ఓపెన్ ఫైనల్లో శ్రీకాంత్, సాయి ప్రణీత్‌లు తలపడిన సంగతి తెలిసిందే. -
సెమీస్‌లో జయరామ్ పరాజయం
ఎల్ మోంటి (అమెరికా): యూఎస్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. భారత్ నుంచి బరిలో మిగిలిన అజయ్ జయరామ్ సెమీఫైనల్లో నిష్ర్కమించాడు. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ 22వ ర్యాంకర్ జయరామ్ 10-21, 14-21తో కాంటా సునెయామ (జపాన్) చేతిలో ఓడిపోయాడు. తొలి గేమ్‌లో ఒకదశలో జయరామ్ వరుసగా పది పాయింట్లు కోల్పోయాడు. రెండో గేమ్‌లో జయరామ్ కాస్త పోటీనిచ్చినా ఫలితం లేకపోయింది. -
సెమీస్‌లో జయరామ్
ఎల్ మాంటె (అమెరికా): భారత షట్లర్ అజయ్ జయరామ్... యూఎస్ ఓపెన్ గ్రాండ్ ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నీలో సెమీస్‌లోకి ప్రవేశించాడు. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ఫైనల్లో నాలుగోసీడ్ జయరామ్ 21-11, 21-11తో సహచరుడు ఆనంద్ పవార్‌పై నెగ్గాడు. పురుషుల డబుల్స్‌లో మను అత్రి-సుమీత్ రెడ్డి 21-18, 7-21, 16-21తో టకురో హోకి-కోబాషి (జపాన్) చేతిలో ఓడారు. మహిళల డబుల్స్‌లో పూర్విషా-మేఘన ద్వయం 15-21, 12-21తో రెండోసీడ్ ఇవా లీ-లిన్ ఒబానా (అమెరికా) చేతిలో పరాజయం చూవిచూసింది. -
సెమీస్ కు జయరామ్
ఎల్ మాంటే (యూఎస్):యూఎస్ ఓపెన్ గ్రాండ్ ప్రి బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్ అజయ్ జయరామ్ సెమీ ఫైనల్లోకి ప్రవేశించాడు. ఈ టోర్నీలో మిగతా భారత షట్లర్లు విఫలమైనా అజయ్ జయరామ్ అంచనాలను అందుకుంటూ సెమీస్‌లోకి చేరాడు. శనివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో జయరామ్ 21-11, 21-11 తేడాతో మరో భారత ఆటగాడు ఆనంద్ పవార్‌ను ఓడించి సెమీస్‌కు దూసుకెళ్లాడు. ఆది నుంచి పవార్‌పై పైచేయి సాధించిన జయరామ్ వరుస రెండు గేమ్‌లను గెలుచుకుని టైటిల్ వేటకు రెండు అడుగుల దూరంలో నిలిచాడు. తొలి గేమ్‌ను అవలీలగా గెలిచిన జయరామ్.. రెండో గేమ్‌లో కూడా అదే స్థాయి ఆట తీరును కనబరిచాడు. మరోవైపు పురుషుల డబుల్స్‌లో మను అత్రి- సుమీత్ల జోడి 21-18, 7-21, 16-21 తేడాతో హోకీ-యూగో కాబాయాషి(జపాన్) చేతిలో ఓటమి పాలై టోర్నీ నిష్క్రమించారు. కేవలం 52 నిమిషాలపాటు జరిగిన పోరులో భారత డబుల్స్ జంట పరాజయం పొందింది. కాగా, మహిళల డబుల్స్ విభాగంలో పూర్విష-మేఘన జోడి లిన్ ఒబానానా-ఏవా లీ(అమెరికా) ద్వయం చేతిలో ఓటమి చెందింది. -
క్వార్టర్స్‌లో జయరామ్, ఆనంద్ పవార్
ఎల్ మాంటె (అమెరికా): భారత షట్లర్లు అజయ్ జయరామ్, ఆనంద్ పవార్ యూఎస్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నీలో క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు. గురువారం అర్ధరాత్రి జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో నాలుగోసీడ్ అజయ్ జయరామ్ 21-11, 21-15తో పెడ్రో మార్టిన్స్ (పోర్చుగల్)పై; ఆనంద్ 21-10, 21-13తో ప్రతుల్ జోషి (భారత్)పై నెగ్గారు. క్వార్టర్స్‌లో ఈ ఇద్దరు తలపడతారు. ఇతర మ్యాచ్‌ల్లో సాయి ప్రణీత్ 21-13, 17-21, 20-22తో కజుమాసా సకాయ్ (జపాన్) చేతిలో; ప్రణయ్ 23-25, 21-23తో లీ హున్ (కొరియా) చేతిలో ఓడారు. పురుషుల డబుల్స్‌లో రెండోసీడ్ మను అత్రి-సుమీత్ రెడ్డి 23-21, 21-13తో మిత్సుహసి-యుటా వాటాంబే (జపాన్)లపై నెగ్గి క్వార్టర్స్‌కు చేరారు. నాలుగోసీడ్ ప్రణయ్ చోప్రా-అక్షయ్ దివాల్కర్ ద్వయం... ప్రత్యర్థులకు వాకోవర్ ఇచ్చింది. మహిళల సింగిల్స్‌లో తన్వీలాడ్ 17-21, 15-21తో ఐదోసీడ్ బీవెన్ జాంగ్ (అమెరికా) చేతిలో ఓడింది. డబుల్స్‌లో పూర్విషా-మేఘన 21-16, 21-16తో ఆరెల లీ-సిడ్నీ లీ (అమెరికా)పై గెలిచి ముందంజ వేయగా, అనారోగ్యం కారణంగా టాప్‌సీడ్ జ్వాల-అశ్విని జోడి ప్రత్యర్థులకు వాకోవర్ ఇచ్చింది. -
క్వార్టర్స్‌కు జయరామ్, పవర్
ఎల్ మాంటే (యూఎస్) :యూఎస్ ఓపెన్ గ్రాండ్ ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్లు అజయ్ జయరామ్, ఆనంద్ పవర్లు క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. శుక్రవారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో జయరామ్ 21-11, 21-15 తేడాతో పెడ్రో మార్టిన్స్(పోర్చుగల్)పై గెలవగా, పవర్ 21-10, 21-13 తేడాతో భారత్ కే చెందిన ప్రతుల్ జోషిపై విజయం సాధించాడు. మరోవైపు పురుషుల డబుల్స్‌లో మను అత్రి- సుమీత్ రెడ్డిల జోడి, మహిళల డబుల్స్‌లో పూర్విషా రామ్-మేఘనా జక్కంపూడిలు క్వార్టర్స్‌లోకి చేరారు. అత్రి సుమిత్ రెడ్డిల జోడి 23-21, 21-13 తేడాతో మిత్సాషి-వాటానాబి ద్వయంపై గెలవగా, పూర్విషా- మేఘన జంట 21-16, 21-6 తేడాతో ఏరియల్ లీ-సిడ్నీ లీ(అమెరికా) జోడిపై గెలిచింది. -
ప్రిక్వార్టర్స్‌లో సాయి ప్రణీత్
ఎల్ మాంటే (యూఎస్): యూఎస్ ఓపెన్ గ్రాండ్ ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో సాయి ప్రణీత్ ప్రిక్వార్టర్స్‌లోకి దూసుకెళ్లాడు. గురువారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో సాయి ప్రణీత్ 21-15, 21-17తో సంకీర్త్ (కెనడా)పై విజయం సాధించాడు. పురుషుల ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో ఐదో సీడ్ హెచ్.ఎస్ ప్రణయ్ 21-9, 21-8తో జోషువా మ్యాగీ (ఐర్లాండ్)పై; ప్రతుల్ జోషి 21-18, 21-13తో మిలన్ లుధిక్ (చెక్ రిపబ్లిక్)పై, ఆనంద్ పవార్ 21-12, 21-9తో డేవిడ్ ఒబెర్నోస్టేర్పై; అజయ్ జయరామ్ 21-14, 21-9తో రాల్ మస్త్ (ఈస్టోనియా)పై గెలుపొందారు. మహిళల విభాగంలో తన్వి 21-6, 21-9తో నిక్తే అలేజండ్రా సోటోమయేర్ (గ్వాటేమలా) పై నెగ్గగా... రుత్విక శివాని 19-21, 21-15, 18-21తో ఆయుమి మినే (జపాన్) చేతిలో ఓడింది. -
ప్రిక్వార్టర్స్‌లో సాయి ప్రణీత్
ఎల్ మాంటే(యూఎస్):గతవారం కెనడా గ్రాండ్ ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టైటిల్‌ను సాధించిన భారత షట్లర్ సాయి ప్రణీత్ మరో టైటిల్ ను సాధించే దిశగా సాగుతున్నాడు. ఇక్కడ జరుగుతున్న యూఎస్ గ్రాండ్ ప్రి బ్యాడ్మింటన్ టోర్నీలో ప్రిక్వార్టర్స్‌కు చేరాడు. రెండో రౌండ్ మ్యాచ్‌లో సాయి ప్రణీత్ 21-15, 21-7 తేడాతో బీఆర్ సంకీర్త్(కెనడా)ను ఓడించి ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించాడు. ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో ప్రణీత్ అంచనాలకు అనుగుణంగా రాణించాడు. అతను ప్రిక్వార్టర్స్‌లో జపాన్ క్రీడాకారుడు కుజుమసా సాకై(జపాన్)తో తలపడనున్నాడు. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో హెఎస్ ప్రణయ్, ప్రతుల్ జోషి, అజయ్ జయరామ్లో ప్రిక్వార్టర్స్‌లోకి చేరగా, మహిళల సింగిల్స్ లో తన్వి లేడ్, రుత్విక శివానిలు ప్రిక్వార్టర్ రౌండ్ లో ప్రవేశించారు. -
సెమీస్‌లో సాయిప్రణీత్
బ్రెంట్వుడ్ (అమెరికా): యూఎస్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ సాయిప్రణీత్ సెమీఫైనల్‌కు చేరుకున్నాడు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి దాటాక జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సాయిప్రణీత్ 21-8, 21-14తో ఎన్జీ కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్)పై విజయం సాధించాడు. తద్వారా తన కెరీర్లో తొలిసారి గ్రాండ్‌ప్రి గోల్డ్ స్థాయి టోర్నీలో సెమీఫైనల్లోకి అడుగుపెట్టాడు. సెమీఫైనల్లో లీ చోంగ్ వీ (మలేసియా)తో సాయిప్రణీత్ తలపడతాడు. మరోవైపు మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప (భారత్) 21-17, 21-14తో జోనా -నెల్టె (జర్మనీ)లపై; పురుషుల డబుల్స్‌లో సుమీత్ రెడ్డి-మనూ అత్రి (భారత్) 22-20, 21-13తో ఎలిస్-లాంగ్రిడ్జ్ (ఇంగ్లండ్)లపై నెగ్గి సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. -
క్వార్టర్స్‌లో సాయిప్రణీత్
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు లభించాయి. భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి తర్వాత జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో హైదరాబాద్ ప్లేయర్, 16వ సీడ్ సాయిప్రణీత్ 21-17, 16-21, 21-18తో హుయాంగ్ యుజియాండ్ (చైనా)పై నెగ్గి క్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. ఇతర మ్యాచ్‌ల్లో ఆర్‌ఎంవీ గురుసాయిదత్ 20-22, 21-13, 16-21తో 9వ సీడ్ టకుమా ఉయెడా (జపాన్) చేతిలో; 14వ సీడ్ అజయ్ జయరామ్ 18-21, 19-21తో టాప్‌సీడ్ టియాన్ చెన్ (చైనీస్ తైపీ) చేతిలో పరాజయం చవిచూశారు. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో నాలుగోసీడ్ జ్వాల-అశ్విని 21-10, 21-18తో బెరాక్-నిస్లిహన్ యిగిటి (టర్కీ)లపై నెగ్గి క్వార్టర్స్‌కు చేరారు. పురుషుల డబుల్స్‌లో మను అత్రి-సుమీత్ రెడ్డి ద్వయం 21-18, 14-21, 21-19తో రెండోసీడ్ హషిమోటో-హిరాటా (జపాన్) జోడీపై నెగ్గింది.