ఎల్ మాంటే (యూఎస్) :యూఎస్ ఓపెన్ గ్రాండ్ ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్లు అజయ్ జయరామ్, ఆనంద్ పవర్లు క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. శుక్రవారం జరిగిన ప్రిక్వార్టర్స్లో జయరామ్ 21-11, 21-15 తేడాతో పెడ్రో మార్టిన్స్(పోర్చుగల్)పై గెలవగా, పవర్ 21-10, 21-13 తేడాతో భారత్ కే చెందిన ప్రతుల్ జోషిపై విజయం సాధించాడు. మరోవైపు పురుషుల డబుల్స్లో మను అత్రి- సుమీత్ రెడ్డిల జోడి, మహిళల డబుల్స్లో పూర్విషా రామ్-మేఘనా జక్కంపూడిలు క్వార్టర్స్లోకి చేరారు.
అత్రి సుమిత్ రెడ్డిల జోడి 23-21, 21-13 తేడాతో మిత్సాషి-వాటానాబి ద్వయంపై గెలవగా, పూర్విషా- మేఘన జంట 21-16, 21-6 తేడాతో ఏరియల్ లీ-సిడ్నీ లీ(అమెరికా) జోడిపై గెలిచింది.
క్వార్టర్స్కు జయరామ్, పవర్
Published Fri, Jul 8 2016 7:30 PM | Last Updated on Fri, Aug 24 2018 8:44 PM
Advertisement
Advertisement