
ఓర్లీన్స్ (ఫ్రాన్స్): భారత షట్లర్లు ఓర్లీన్స్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–100 బ్యాడ్మింటన్ టోర్నీలో నిరాశపరిచారు. గురువారం బరిలోకి దిగిన సింగిల్స్, డబుల్స్ ప్లేయర్లంతా పరాజయం చవిచూశారు. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో మిథున్ మంజునాథ్ 9–21, 18–21తో గత్రా ఫిలియంగ్ ఫిఖిహిలా కుపు (ఇండోనేసియా) చేతిలో ఓడిపోగా, అజయ్ జయరామ్‌కు 10–21, 17–21తో ఎనిమిదో సీడ్ థామస్ రూక్సెల్ (ఫ్రాన్స్) చేతిలో చుక్కెదురైంది.
మహిళల సింగిల్స్‌లో ముగ్దా ఆగ్రేను 10–21, 19–21తో ఆరో సీడ్ సబ్రినా జాకెట్ (స్విట్జర్లాండ్) ఇంటిదారి పట్టించింది. మహిళల డబుల్స్‌లో ఆరో సీడ్ యుల్ఫిరా బర్కాన్– జౌజా ఫధిలా సుగియార్తో (ఇండోనేసియా) జోడీ 21–14, 18–21, 21–19తో పూజ దండు–సంజన జంటపై గెలిచింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో ధ్రువ్ కపిల–కుహూ గార్గ్ జంట 21–23, 12–21తో నాలుగో సీడ్ ఎవెంజి డ్రిమిన్–ఎవ్‌జినియా దిమోవ (రష్యా) జోడీ చేతిలో ఓడింది.
Comments
Please login to add a commentAdd a comment