ఎల్ మాంటే (యూఎస్):యూఎస్ ఓపెన్ గ్రాండ్ ప్రి బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్ అజయ్ జయరామ్ సెమీ ఫైనల్లోకి ప్రవేశించాడు. ఈ టోర్నీలో మిగతా భారత షట్లర్లు విఫలమైనా అజయ్ జయరామ్ అంచనాలను అందుకుంటూ సెమీస్లోకి చేరాడు. శనివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో జయరామ్ 21-11, 21-11 తేడాతో మరో భారత ఆటగాడు ఆనంద్ పవార్ను ఓడించి సెమీస్కు దూసుకెళ్లాడు. ఆది నుంచి పవార్పై పైచేయి సాధించిన జయరామ్ వరుస రెండు గేమ్లను గెలుచుకుని టైటిల్ వేటకు రెండు అడుగుల దూరంలో నిలిచాడు. తొలి గేమ్ను అవలీలగా గెలిచిన జయరామ్.. రెండో గేమ్లో కూడా అదే స్థాయి ఆట తీరును కనబరిచాడు.
మరోవైపు పురుషుల డబుల్స్లో మను అత్రి- సుమీత్ల జోడి 21-18, 7-21, 16-21 తేడాతో హోకీ-యూగో కాబాయాషి(జపాన్) చేతిలో ఓటమి పాలై టోర్నీ నిష్క్రమించారు. కేవలం 52 నిమిషాలపాటు జరిగిన పోరులో భారత డబుల్స్ జంట పరాజయం పొందింది. కాగా, మహిళల డబుల్స్ విభాగంలో పూర్విష-మేఘన జోడి లిన్ ఒబానానా-ఏవా లీ(అమెరికా) ద్వయం చేతిలో ఓటమి చెందింది.
సెమీస్ కు జయరామ్
Published Sat, Jul 9 2016 3:00 PM | Last Updated on Fri, Aug 24 2018 8:44 PM
Advertisement
Advertisement