సెమీస్‌లో జయరామ్
ఎల్ మాంటె (అమెరికా): భారత షట్లర్ అజయ్ జయరామ్... యూఎస్ ఓపెన్ గ్రాండ్ ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నీలో సెమీస్‌లోకి ప్రవేశించాడు. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్లో నాలుగోసీడ్ జయరామ్ 21-11, 21-11తో సహచరుడు ఆనంద్ పవార్‌పై నెగ్గాడు. పురుషుల డబుల్స్‌లో మను అత్రి-సుమీత్ రెడ్డి 21-18, 7-21, 16-21తో టకురో హోకి-కోబాషి (జపాన్) చేతిలో ఓడారు. మహిళల డబుల్స్‌లో పూర్విషా-మేఘన ద్వయం 15-21, 12-21తో రెండోసీడ్ ఇవా లీ-లిన్ ఒబానా (అమెరికా) చేతిలో పరాజయం చూవిచూసింది.