
అక్లాండ్: న్యూజిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్లకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఈ టోర్నమెంట్ క్వార్టర్స్‌లో సాయి ప్రణీత్ విజయం సాధించి సెమీఫైనల్‌కు చేరగా... బ్యాడ్మింటన్ దిగ్గజం లిన్ డాన్ చేతిలో ఓడి సమీర్ వర్మ క్వార్టర్స్‌లోనే నిష్క్రమించాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్స్ మ్యాచ్‌లో సాయి ప్రణీత్ 21–7, 21–9తో నీలుక కరుణరత్నే (శ్రీలంక)పై సునాయస విజయం సాధించాడు.
మరో క్వార్టర్స్‌లో సమీర్ వర్మ 19–21, 9–21తో టాప్ సీడ్ లిన్ డాన్ చేతిలో ఓటమి పాలయ్యాడు. సాయి ప్రణీత్ సెమీస్‌లో రెండో సీడ్ జొనాథన్ క్రైస్ట్ (ఇండోనేసియా)తో తలపడనున్నాడు. పురుషుల డబుల్స్‌లో మను అత్రి–సుమీత్ రెడ్డి జంట 10–21, 15–21తో నాలుగో సీడ్ బోడిన్ ఇసారా– నిపిట్‌ఫాన్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడింది.
Comments
Please login to add a commentAdd a comment