new zealand open
-
ప్రణయ్ నిష్క్రమణ
ఆక్లాండ్: వరుసగా రెండో అంతర్జాతీయ టోర్నమెంట్లో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులెవరూ కనీసం క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని దాటలేకపోయారు. న్యూజిలాండ్ ఓపెన్ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్–300 టోర్నమెంట్లో హెచ్ఎస్ ప్రణయ్ నిష్క్రమణతో భారత పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 26వ ర్యాంకర్ ప్రణయ్ 21–17, 15–21, 14–21తో ప్రపంచ 11వ ర్యాంకర్ కాంటా సుయెయామ (జపాన్) చేతిలో పోరాడి ఓడిపోయాడు. 73 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రణయ్ తొలి గేమ్‌ను గెల్చుకున్నా... ఆ తర్వాత తడబడ్డాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో స్కోరు 14–16 వద్ద ప్రణయ్ వరుసగా ఐదు పాయింట్లు కోల్పోయి గేమ్‌తోపాటు మ్యాచ్‌ను సమర్పించుకున్నాడు. క్వార్టర్ ఫైనల్లో ఓడిన ప్రణయ్‌కు 900 డాలర్ల (రూ. 62 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. గతవారం ఆసియా చాంపియన్‌షిప్‌లోనూ ఏ విభాగంలోనూ భారత ఆటగాళ్లు క్వార్టర్ ఫైనల్ దాటి ముందుకెళ్లలేకపోయారు. -
ప్రణయ్ ముందుకు... సాయిప్రణీత్ ఇంటికి
ఆక్లాండ్: తనకంటే మెరుగైన ర్యాంకర్‌ను ఓడించి భారత అగ్రశ్రేణి క్రీడాకారుడు హెచ్ఎస్ ప్రణయ్ న్యూజిలాండ్ ఓపెన్ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ సూపర్–300 టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 26వ ర్యాంకర్ ప్రణయ్ 21–14, 21–12తో ప్రపంచ 13వ ర్యాంకర్ టామీ సుగియార్తో (ఇండోనేసియా)ను బోల్తా కొట్టించాడు. ఈ మ్యాచ్‌లో ప్రణయ్‌కు ఏదశలోనూ సుగియార్తో నుంచి పోటీ ఎదురుకాలేదు. రెండు గేముల్లోనూ ప్రణయ్ పూర్తి ఆధిపత్యం చలాయించాడు. మరోవైపు భారత మరో స్టార్ ప్లేయర్ భమిడిపాటి సాయిప్రణీత్ పోరాటం ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. చైనా దిగ్గజం, ఏడో సీడ్ లిన్ డాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సాయిప్రణీత్ 12–21, 12–21తో ఓడిపోయాడు. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సుమీత్ రెడ్డి–మను అత్రి (భారత్) ద్వయం 17–21, 19–21తో గో వి షెమ్–తాన్ వి కియోంగ్ (మలేసియా) జోడీ చేతిలో పరాజయం పాలైంది. -
సైనా సాధించేనా?
ఆక్లాండ్: భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ న్యూజిలాండ్ ఓపెన్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. గతవారం ఆసియా చాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్లో ఎదురైన పరాజయాన్ని మర్చిపోయి ఈ సీజన్లో మరో టైటిలే లక్ష్యంగా ఆమె బరిలో దిగుతోంది. తొలి రోజు మంగళవారం కేవలం క్వాలిఫయింగ్ విభాగంలో మ్యాచ్‌లు జరుగుతాయి. మెయిన్ ‘డ్రా’ మ్యాచ్‌లు బుధవారం మొదలవుతాయి. సింగిల్స్ తొలి రౌండ్లో వాంగ్ జియి (చైనా)తో సైనా ఆడుతుంది. ‘డ్రా’ ప్రకారమైతే సైనా తన స్థాయికి తగ్గట్టు ఆడితే ఫైనల్ చేరుకునే అవకాశముంది. మరో పార్శ్వంలో టాప్ సీడ్, ఆసియా చాంపియన్ అకానె యామగుచి (జపాన్) తుది పోరుకు చేరుకునే చాన్స్ ఉంది. ఈ ఏడాది భారత్ నుంచి సైనా నెహ్వాల్ మాత్రమే అంతర్జాతీయ టైటిల్‌ను సాధించింది. ఆమె ఇండోనేసియా మాస్టర్స్ టోర్నీలో విజేతగా నిలిచింది. పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్‌లో అజయ్ జయరామ్, లక్ష్య సేన్, పారుపల్లి కశ్యప్ బరిలో ఉన్నారు. మెయిన్ ‘డ్రా’లో హెచ్ఎస్ ప్రణయ్, సాయిప్రణీత్, శుభాంకర్ డేలకు చోటు లభించింది. పురుషుల డబుల్స్‌లో మను అత్రి–సుమీత్ రెడ్డి జోడీ... మహిళల డబుల్స్‌లో నేలకుర్తి సిక్కిరెడ్డి–అశ్విని పొన్నప్ప జంటలు పోటీపడనున్నాయి. -
న్యూజిలాండ్ ఓపెన్ సెమీస్‌లో సాయి ప్రణీత్
అక్లాండ్: న్యూజిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్లకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఈ టోర్నమెంట్ క్వార్టర్స్‌లో సాయి ప్రణీత్ విజయం సాధించి సెమీఫైనల్‌కు చేరగా... బ్యాడ్మింటన్ దిగ్గజం లిన్ డాన్ చేతిలో ఓడి సమీర్ వర్మ క్వార్టర్స్‌లోనే నిష్క్రమించాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్స్ మ్యాచ్‌లో సాయి ప్రణీత్ 21–7, 21–9తో నీలుక కరుణరత్నే (శ్రీలంక)పై సునాయస విజయం సాధించాడు. మరో క్వార్టర్స్‌లో సమీర్ వర్మ 19–21, 9–21తో టాప్ సీడ్ లిన్ డాన్ చేతిలో ఓటమి పాలయ్యాడు. సాయి ప్రణీత్ సెమీస్‌లో రెండో సీడ్ జొనాథన్ క్రైస్ట్ (ఇండోనేసియా)తో తలపడనున్నాడు. పురుషుల డబుల్స్‌లో మను అత్రి–సుమీత్ రెడ్డి జంట 10–21, 15–21తో నాలుగో సీడ్ బోడిన్ ఇసారా– నిపిట్‌ఫాన్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడింది. -
ప్రిక్వార్టర్స్ కు కశ్యప్, ప్రణయ్
ఆక్లాండ్:న్యూజిలాండ్ ఓపెన్ గ్రాండ్ ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో భారత ఆటగాళ్లు పారుపల్లి కశ్యప్, ప్రణయ్, సౌరవ్ వర్మ, సిరిల్ వర్మలు ప్రిక్వార్టర్స్ లోకి ప్రవేశించారు. బుధవారం జరిగిన రెండో రౌండ్ పోరులో వారు తమ ప్రత్యర్థులపై విజయం సాధించి ప్రిక్వార్టర్స్ కు చేరారు. తొలుత ప్రణయ్ 23-21, 21-18 తేడాతో అబ్దుల్లా కౌలిక్(ఇండోనేసియా)పై పోరాడి గెలిచి తదుపరి రౌండ్ కు అర్హత సాధించగా, కశ్యప్ 21-9, 21-8 తేడాతో ఒస్కార్ గు(న్యూజిలాండ్)పై సునాయాసంగా విజయం సాధించి ప్రిక్వార్టర్స్ కు చేరాడు. ఇక సౌరవ్ 21-16, 21-16 తో ఖో విబోవు(ఇండోనేసియా)పై, సిరిల్ వర్మ 21-14, 21-16తో విక్కీ అంగ్గా(ఇండోనేసియా)పై గెలిచి ప్రిక్వార్టర్స్ లోకి ప్రవేశించారు.