
న్యూఢిల్లీ: స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన భారత ప్లేయర్ భమిడిపాటి సాయిప్రణీత్... ప్రపంచ ర్యాంకింగ్స్‌లో పురోగతి సాధించాడు. మంగళవారం విడుదలైన ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య ర్యాంకింగ్స్‌లో సాయిప్రణీత్ పురుషుల సింగిల్స్ విభాగంలో మూడు స్థానాలు ఎగబాకి 19వ స్థానానికి చేరుకున్నాడు.
శ్రీకాంత్ ఏడో స్థానంలో, సమీర్ వర్మ 14వ స్థానంలో కొనసాగుతున్నారు. పురుషుల సింగిల్స్ టాప్–100లో భారత్ నుంచి పది మంది ఉండటం విశేషం. మహిళల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో సింధు, సైనా వరుసగా ఆరు, తొమ్మిది స్థానాల్లో కొనసాగుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment