యూఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్
ఎల్ మాంటే (యూఎస్) : యూఎస్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత షట్లర్లు శుభారంభం చేశారు. తొలిరౌండ్ మ్యాచ్‌ల్లో సాయిప్రణీత్ సహా ఐదుగురు ఆటగాళ్లు రెండో రౌండ్‌లోకి అడుగుపెట్టారు. సాయి ప్రణీత్ 21-13, 21-12తో హెన్రీపై విజయం సాధించాడు. అతను రెండో రౌండ్‌లో బి.ఆర్. సంకీర్త్ (కెనడా)తో తలపడతాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో హెచ్.ఎస్. ప్రణయ్ 21-7, 21-6తో కాల్విన్ (యూఎస్‌ఏ)పై; గురుసాయిదత్ 21-8, 21-13తో ఫిలిప్స్‌పై; ప్రతుల్ జోషి 21-13, 21-13తో కెవిన్ బర్క్‌మన్ (కెనడా)పై; ఆనంద్ 21-7, 21-7తో పెడెర్ సోవెన్‌డల్ (డెన్మార్క్)పై గెలుపొందారు. నాలుగో సీడ్ అజయ్ జయరామ్‌కు ఈ మ్యాచ్‌లో వాకోవర్ లభించగా, హర్షిల్ డానీ 18-21, 18-21తో మిషా జిల్బర్‌మన్ (ఇజ్రాయెల్) చేతిలో ఓటమి పాలయ్యాడు.
రెండో రౌండ్ లో సాయిప్రణీత్
Published Thu, Jul 7 2016 1:35 AM | Last Updated on Fri, Aug 24 2018 5:21 PM
Advertisement
Advertisement