క్వాలియింగ్‌లో కశ్యప్ ఓటమి | Parupalli Kashyap loses in qualifiers of Denmark Open | Sakshi
Sakshi News home page

క్వాలియింగ్‌లో కశ్యప్ ఓటమి

Published Wed, Oct 19 2016 12:32 AM | Last Updated on Mon, Sep 4 2017 5:36 PM

క్వాలియింగ్‌లో కశ్యప్ ఓటమి

క్వాలియింగ్‌లో కశ్యప్ ఓటమి

ఒడెన్‌‌స: డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత అగ్రశ్రేణి క్రీడాకారుడు పారుపల్లి కశ్యప్ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించడంలో విఫలమయ్యాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వాలియింగ్ తొలి రౌండ్‌లో ప్రపంచ 92వ ర్యాంకర్ కశ్యప్ 13-21, 21-8, 20-22తో ప్రపంచ 47వ ర్యాంకర్ రౌల్ మస్ట్ (ఎస్తోనియా) చేతిలో ఓడిపోయాడు. 59 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో కశ్యప్ నిర్ణాయక మూడో గేమ్‌లో మ్యాచ్ పాయింట్లును వృథా చేశాడు. ఒకదశలో 14-19తో వెనుకబడిన కశ్యప్ వరుసగా ఆరు పాయింట్లు నెగ్గి 20-19తో విజయానికి ఒక పాయింట్లు దూరంలో నిలిచాడు. అయితే రౌల్ మస్ట్ పట్టుదలతో ఆడి వరుసగా మూడు పాయింట్లు గెలిచి కశ్యప్  ఓటమిని ఖాయం చేశాడు. బుధవారం జరిగే మ్యాచ్‌ల్లో సింధు, సాయిప్రణీత్, జయరామ్, ప్రణయ్ బరిలోకి దిగనున్నారు.  
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement