టీవీ యాంకర్ తేజస్వినిది ఆత్మహత్యే అని విజయవాడ ఈస్ట్ జోన్ ఏసీపీ విజయభాస్కర్ తెలిపారు. భర్త వేధింపులు, అక్రమ సంబంధాలు, అనుమానాలు వ్యక్తం చేస్తుండటంతో మనస్తాపానికి గురై ఈ నెల 16వ తేదీ రాత్రి అద్దె ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందన్నారు. ఘటనాస్థలంలో లభించిన మరణ వాంగ్మూలం, సెల్ ఫోన్‌ల ద్వారా పంపిన మెసేజ్‌లను నిర్ధారణగా చేసుకుని అనుమానాస్పద మృతి కేసును 306, 498ఎ సెక్షన్‌ల కింద కేసును మార్పు చేశామన్నారు.
కంకిపాడు(పెనమలూరు): టీవీ యాంకర్ తేజస్వినిది ఆత్మహత్యే అని విజయవాడ ఈస్ట్ జోన్ ఏసీపీ విజయభాస్కర్ తెలిపారు. పట్టణంలోని సర్కిల్ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ గుంటూరు జిల్లాకు చెందిన తేజస్విని, మట్టపల్లి పవన్‌కుమార్ ఇద్దరూ కలిసే చదువుకున్నారని, ఆ స్నేహం కాస్తా ప్రేమగా మారి 2014లో వివాహం చేసుకున్నారన్నారు. వివాహం అనంతరం దుబాయ్‌లో, భీమవరంలోనూ నివాసం ఉన్నారన్నారు. అక్కడ ఉండగానే ఓ టీవీ ఛానల్‌లో న్యూస్ రీడర్‌గా పనిచేసిందని చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఈడుపుగల్లు ఎంబీఎంఆర్‌లోని అద్దె ఇంట్లోకి వచ్చారన్నారు. భర్త వేధింపులు, అక్రమ సంబంధాలు నెరపటం, అనుమానాలు వ్యక్తం చేస్తుండటంతో మనస్తాపానికి గురై ఈనెల 16వ తేదీ రాత్రి అద్దె ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని వివరించారు. ఘటనా స్థలంలో లభించిన మరణ వాంగ్మూలం, సెల్ ఫోన్‌ల ద్వారా పంపిన మెసేజ్‌లను నిర్ధారణగా చేసుకుని అనుమానాస్పద మృతి కేసును 306, 498ఎ సెక్షన్‌ల కింద కేసును మార్పు చేశామన్నారు.
చనిపోయే రెండు రోజులు ముందు 14వ తేదీ ఉదయం భర్తకు ‘ నీ వేధింపుల వల్లే చనిపోతున్నానని, నా చావుకు నువ్వే కారణం. ఈ పాపాన్ని అనుభవిస్తావు. ఆ గోవిందుడే సాక్షి’ అంటూ మెసేజ్ ఫోన్‌లో పంపిందన్నారు. ఆ సమయంలో భర్త పవన్‌కుమార్ షిరిడీలో ఉన్నారన్నారు. రెవెన్యూ శాఖ ద్వారా తేజస్విని మృతదేహాన్ని పంచనామా చేయించి ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. భర్త పవన్‌కుమార్‌ను కూడా అరెస్టు చేసి కోర్టుకు పంపామన్నారు. మృతురాలి మరణ వాంగ్మూలంలో రాత, గతంలో ఉన్న చేతి రాతను పరిశీలించామని, నిపుణులకు కూడా పంపుతున్నామన్నారు. ఈడుపుగల్లు వచ్చి కొద్ది నెలలే అయ్యిందని, రాజకీయంగా ఓ ఎమ్మెల్యేతో సంబంధాలు ? అంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. తేజస్వినిది ఆత్మహత్యేనని స్పష్టం చేశారు. సమావేశంలో సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కోమాకుల శివాజీ, ఎస్‌ఐ షరీఫ్ పాల్గొన్నారు.
అనుమానాలెన్నో..
విజయవాడ: టీవీ యాంకర్ తేజస్విని అనుమానాస్పద స్థితిలో కేసులో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈనెల 16వ తేదీన తేజస్విని తాను నివాసం ఉండే ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడింది. అయితే ఈ విషయం 17వ తేదీ వరకు ఈ విషయం వెలుగు చూడలేదు. కాగా తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు భర్త మట్టపల్లి పవన్‌కుమార్ వేధింపులే కారణమని ఆమె ఆత్మహత్య నోట్‌కూడా రాసింది. పోలీసులు ముందుగా 174సెక్షన్ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఆతరువాత భర్త పవన్ కుమార్‌పై 498ఏ, 306 సెక్షన్లపై కేసు నమోదు చేసి అతడిని అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో రెండు రోజులుగా తేజస్విని మృతిపై వేరే కోణంలో పుకార్లు ప్రచారం చేస్తున్నారు. ఆమె మృతి కేసులో భర్తను ఇరికించారని కొందరు ప్రచారం చేస్తున్నారు. సుసైడ్ నోట్ కూడా కట్టుకథగా చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment