అందరూ చూస్తుండగానే ఓ భర్త భార్యపై దాడికి పాల్పడ్డాడు.
అందరూ చూస్తుండగానే ఓ భర్త భార్యపై దాడికి పాల్పడ్డాడు. విజయవాడ నగరం పెజ్జోనిపేటలో పట్టపగలే ఈ దారుణం చోటుచేసుకుంది. మహేశ్, తేజస్వినిల వివాహం ఏడాది క్రితం అయింది. అప్పటి నుంచి వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం మధ్యాహ్నం సోదరునితో కలసి చర్చికి వెళ్లి వస్తున్న భార్యపై మహేశ్ కత్తితో దాడి చేశాడు. మెడపై నరకటంతో ఆమె అక్కడే పడిపోయింది. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. పరారీలో ఉన్న మహేశ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.