అమెరికాలో తెలుగు యువతి మృతి
2 నెలల్లో పూర్తికానున్న చదువు.. అంతలోనే రోడ్డు ప్రమాదంలో దుర్మరణం
విజయవాడ(రామవరప్పాడు): అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువతి మరణించింది. ఏపీలోని ప్రసాదంపాడు బీఎమ్‌పీఎస్ రోడ్డులో నివాసం ఉంటున్న చుండూరి విష్ణువర్ధన్, కోటేశ్వరీ దంపతులకు ముగ్గురు సంతానం. జ్యోత్స్న, తరుణ్ సాయి ఇంజినీరింగ్ చదువుతున్నారు. పెద్ద కుమార్తె సాయి తేజస్వీ ఎమ్‌ఎస్ చేయడానికి అమెరికాకు 16 నెలల కిందట వెళ్లిం ది. నార్త్ వెస్ట్రన్ పాలిటెక్నిక్ వర్సిటీలో విద్య ను అభ్యసిస్తోంది.కాలిఫోర్నియాలో సోమవారం రాత్రి నడుచుకుంటూ రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టింది. వెంటనే తేజస్వీని ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మరణించింది.
చిన్నతనం నుంచి చదువులో ముందంజ
చిన్నతనం నుంచి తేజస్వీ చదువులో ముందుండేది. చదువుపై ఉన్న ఇష్టాన్ని గమనించి రైతు అరుున తండ్రి విష్ణువర్ధన్ ఆమెను కష్టపడి చదివించాడు. అమెరికాలో ఎమ్‌ఎస్ చేయడానికి పంపించారు. మరో రెండు నెలల్లో చదువు పూర్తి కానుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. మంచి ఉద్యోగంలో స్థిరపడి మన కుటుంబాన్ని దేనికి లోటు లేకుండా బాగా చూసుకుంటానని తరచూ అంటుండేదని కుటుంబ సభ్యులు విలపిస్తూ తెలిపారు. కాగా, సారుు తేజస్వి మృతదేహం అమెరికా నుంచి దేశానికి త్వరగా వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. పోస్టుమార్టం ప్రక్రియ పూర్తి అరుు్యందని తెలిపారు. అక్కడి నుంచి మృతదేహం త్వరగా వచ్చేలా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేయాలని కోరుతున్నారు.