తేజస్విని పెళ్లిలో సినీ, రాజకీయ ప్రముఖుల సందడి
తేజస్విని పెళ్లిలో సినీ, రాజకీయ ప్రముఖుల సందడి
Published Wed, Aug 21 2013 1:02 PM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM
సినీనటుడు బాలకృష్ణ రెండవ కూతురు తేజస్విని వివాహం హైదరాబాద్ లోని హైటెక్స్ ప్రాంగణంలో అత్యంత వైభవంగా జరిగింది. తేజస్విని వివాహానికి భారీ ఎత్తున వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. హైటెక్స్ ప్రాంగణమంతా రాజకీయ నేతలు, సినీ తారలతో కళకళలాడింది. వివాహా వేదిక వద్ద రాజకీయాలకు అతీతంగా, హోదాలను పక్కన పెట్టి ఒకరికొకరు కులాసాగా, ఆత్మీయంగా కబుర్లు చెప్పుకోవడం అందర్నిని ఆకర్షించింది. ఇక చిరంజీవి, బాలకృష్ణలు ఆత్మీయంగా ఆలింగనం చేసుకోని, కులాసాగా మాట్లాడుకోవడం అభిమానులతోపాటు పలువుర్ని ఆనందానికి లోను చేసింది.
వివాహానికి హాజరైన వారిలో కేంద్ర మంత్రులు చిరంజీవి, పురందేశ్వరి, జైపాల్ రెడ్డి, కావూరి సాంబశివరావు, బలరాం నాయక్, తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య, ఎంపీలు నామా నాగేశ్వరరావు, మాగుంట శ్రీనివాసుల రెడ్డి, కనుమూరి బాపిరాజు, రాయపాటి సాంబశివరావు, మధు యాష్కీ, కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, షబ్బీర్ ఆలీ, తెలుగుదేశం నేతలు యనమల రామకృష్టుడు, ఎర్రబెల్లి దయాకర్ రావు, అంబికా కృష్ణ, దేవినేని ఉమా, కరణం బలరాం, కాలువ శ్రీనివాసులు, సుజానా చౌదరీ, వర్ల రామయ్య, బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయతోపాటు సినీ ప్రముఖులు రామానాయుడు, దాసరి నారాయణరావు, రాఘవేంద్రరావు, మోహన్ బాబు, మురళీ మోహన్, పరుచూరి బ్రదర్స్, జయసుధ, బ్రహ్మనందం, బాబు మోహన్, సూపర్ స్టార్ కృష్ణ, విజయనిర్మల, మంచు మనోజ్, లక్ష్మి, వెంకటేశ్, గోపిచంద్, బోయపాటి శ్రీను, జగపతిబాబు, కోడి రామకృష్ణ లు ఉన్నారు.
ఇక ఈ వివాహానికి బాలకృష్ణ సోదరుడు హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ లు హాజరుకాకపోవడం గమనార్హం.
Advertisement
Advertisement