ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన మొదటి భార్య అనారోగ్యంతో అకాల మరణం చెందడంతో ఆయన ద్వితీయ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా ఈ దంపతులు త్వరలోనే ఓ బిడ్డకు జన్మను ఇవ్వబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ విషయం పై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.
ఇక దిల్ రాజుకు ఇప్పటికే ఓ కుమార్తె ఉన్న విషయం తెలిసిందే. భార్య మరణానంతరం కుమార్తె హన్షిత రెడ్డి, పెద్దల సలహాతో కరోనా లాక్ డౌన్ సమయంలో వైగా రెడ్డి (తేజస్విని)ని దిల్ రాజు రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఇక దిల్ రాజు నిర్మాతగా రామ్ చరణ్, శంకర్ కాంబోలో పాన్ ఇండియా చిత్రం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment