బాలకృష్ణ కూతురు వివాహనికి హరికృష్ణ డుమ్మా | Nandamuri harikrishna away from Balakrishna's daughter tejaswini wedding | Sakshi
Sakshi News home page

బాలకృష్ణ కూతురు వివాహనికి హరికృష్ణ డుమ్మా

Published Wed, Aug 21 2013 12:57 PM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

Nandamuri harikrishna away from Balakrishna's daughter tejaswini wedding

నందమూరి కుటుంబంలో విభేదాలు మరోసారి తారస్థాయికి చేరాయి. ప్రముఖ నటుడు బాలకృష్ణ రెండవ కుమార్తె తేజస్వీని వివాహ మహోత్సవానికి ఆయన సోదరుడు హరికృష్ణతోపాటు ఆయన కుమారుడు, ప్రముఖ టాలీవుడ్ నటుడు జూనియర్ ఎన్టీఆర్లు హాజరుకాలేదు. దీంతో వారిరువురి కుటుంబాల మధ్య విభేదాలు మరో సారి బయటపడ్డాయని స్పష్టమైంది.

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే రాష్ట విభజనకు చంద్రబాబు  అనుకూలంగా కేంద్రప్రభుత్వానికి లేఖ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ విభజనకు చంద్రబాబే ముఖ్య కారణమని సర్వత్రా నిరసనలు వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలోనే హరికృష్ణ ఆ వివాహవేడుకలను దూరంగా ఉన్నారని సమాచారం.  



బుధవారం ఉదయం మాదాపూర్లోని హైటెక్స్లో తేజస్వీని- శ్రీభరత్ల వివాహ వేడుకలు అంగరంగవైభవంగా జరిగాయి. తెలుగు చిత్ర పరిశ్రమ, రాజకీయ రంగానికి చెందిన అతిరథమహారథులతోపాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఆ వివాహ వేడుకలకు హాజరై ఆ నూతన వధువువరులను ఆశీర్వదించారు. బాలకృష్ణ మొదటి కుమార్తె బ్రహ్మణీని తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కుమారుడు లోకేశ్ బాబుకు ఇచ్చి గతంలో వివాహాం చేసిన సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement