
తెలుగు బుల్లితెర నటుడు అమర్‌దీప్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. నటి తేజస్వినిని పెళ్లాడబోతున్నాడు. తాజాగా అమర్‌దీప్, తేజస్వినిల నిశ్చితార్థం జరిగింది. ఈ వేడుకకు బిగ్‌బాస్ బ్యూటీ అరియానా హాజరైంది. పూలదండలు మార్చుకుని సంతోషంలో మునిగి తేలిపోతున్న అమర్- తేజస్వినిలతో ఫొటోలు దిగి వారికి శుభాకాంక్షలు తెలిపింది.
ఇందుకు సంబంధించిన వీడియోను అరియానా సోషల్ మీడియా షేర్ చేసింది. ఇది చూసి సర్‌ప్రైజ్ అయిన ఫ్యాన్స్.. అదేంటి? అమర్, తేజు నిశ్చితార్థం చేసుకున్నారా? ఇదెప్పుడు జరిగిందని ప్రశ్నిస్తున్నారు. సడన్ షాకిచ్చారేంటి అంటూ కొందరు అభిమానులు సీరియల్ హీరోను నిలదీస్తున్నారు. ఇక త్వరలో కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్న కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా అమర్ దీప్.. జానకి కలనగలేదులో హీరోగా నటిస్తుండగా తేజస్వి కేరాఫ్ అనసూయ సీరియల్ చేస్తోంది.
చదవండి: ఓటీటీలో అమలాపాల్ విక్టిమ్ సిరీస్, ఎప్పటినుంచంటే?
ఆ హీరోయిన్‌తో డేటింగ్ వార్తలపై నోరు విప్పిన చై, ఏమన్నాడంటే.
Comments
Please login to add a commentAdd a comment