TV Serial Actress Harika Gift IPhone To Husband Eknadh Paruchuri, Deets Inside - Sakshi
Sakshi News home page

Ek NaDh Paruchuri: భర్తకు కాస్ట్‌లీ ఐఫోన్‌ బహుమతిగా ఇచ్చిన నటి

Published Sat, Nov 12 2022 8:04 PM | Last Updated on Sat, Nov 12 2022 8:39 PM

TV Actress Harika Gift IPhone To Husband Eknadh Paruchuri - Sakshi

ఫొటోషూట్స్‌, రీల్స్‌, యూట్యూబ్‌ వీడియోలతో తెగ హల్‌చల్‌ చేస్తుంటారు ఏక్‌నాధ్‌, హారిక. ఆన్‌స్క్రీన్‌ మీద హిట్‌ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న ఈ జంట ఆఫ్‌ స్క్రీన్‌లో కూడా క్యూట్‌ పెయిర్‌గా వెలుగొందుతున్నారు. నవంబర్‌ 8న నటుడు ఏక్‌నాధ్‌ బర్త్‌డే. తన భర్త పుట్టినరోజును గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసింది నటి హారిక. అరకులోని ఓ రిసార్ట్‌లో అర్ధరాత్రి ఏక్‌నాధ్‌తో కేక్‌ కట్‌ చేయించింది.

అంతేకాదు, అతడి కోసం కొత్త బట్టలతో పాటు ఖరీదైన వస్తువును బహుమతిగా ఇచ్చింది. ఆ గిఫ్ట్‌ మరేంటో కాదు, ఐఫోన్‌ 14 ప్రొమాక్స్‌. దాదాపు లక్షన్నర రూపాయలు విలువ చేసే ఈ కానుకను చూసి గుడ్లు తేలేశాడు ఏక్‌నాధ్‌. భార్య ఎంతో ప్రేమగా ఇచ్చిన గిఫ్ట్‌ తనకెంతో బాగా నచ్చిందని చెప్పుకొచ్చాడు. కాగా వీరిద్దరూ ఓ తెలుగు సీరియల్‌లో జంటగా నటించారు. అప్పుడే వీరి మధ్య ప్రేమ చిగురించగా 2020లో పెళ్లి చేసుకున్నారు.

చదవండి: కష్టపడి చేసిన సీన్స్‌ కట్‌ చేశారు, బాధేసింది: విలన్‌
నా కష్టాల్లో, కన్నీళ్లలో నావెంటే ఉన్నావు, థాంక్యూ: సమంత

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement