Balakrishna Younger Daughter Tejaswini Works Behind Unstoppable Talk Show - Sakshi
Sakshi News home page

Balakrishna Daughter Tejaswini: అన్‌స్టాపబుల్‌ షోకు పని చేసిన బాలయ్య కూతురు తేజస్విని

Published Mon, Jan 31 2022 8:58 PM | Last Updated on Tue, Feb 1 2022 11:56 AM

Balakrishna Younger Daughter Tejaswini Works Behind Unstoppable Talk Show - Sakshi

నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్‌ చేస్తున్న ‘అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే’ షో ఆహా ఓటీటీలో అదరగొడుతున్న సంగతి తెలిసిందే.  ఓటీటీ చరిత్రలోనే అత్యధిక వ్యూస్‌తో సంచలనం సృష్టిస్తోన్న ఈ షో దిగ్విజయంగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే 9ఎపిసోడ్‌లు పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు గ్రాండ్‌ ఫినాలేలోకి అడుగుపెట్టింది. ఈ షోలో బాలయ్య తనదైన మ్యానరిజం, డైలాగ్స్‌, లుక్స్‌, సెన్స్ ఆఫ్ హ్యూమర్‌తో సక్సెస్‌ఫుల్‌గా ఈ షోను నడిపించాడు బాలయ్య.

చదవండి: హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న సింగర్‌ సునీత కుమారుడు!

దీంతో తొలి సీజన్‌ ముగుస్తుండటంతో ఈ షో రెండో సీజన్‌కు సన్నాహాలు చేస్తున్నారు నిర్వహకులు.  ఈ సీజన్‌ కూడా మరో లెవెల్ లోనే సెట్ చేస్తుంది ఆహా టీం. అయితే ఈ షో ఇంత సక్సెస్ కావడానికి బాలయ్య ఒక కారణమైతే.. తెర వెనక దీని కోసం ఎంతో మంది కష్టపడ్డారట. అయితే వీరిలో బాలయ్య రెండవ కూమార్తె తెజస్వీని కూడా ఉండటం విశేషం. ఈ షోకు తేజస్వీని కూడా పనిచేసిందని తెలిసి చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రముఖ రైటర్‌, దర్శకుడు బీవీఎస్ రవి ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.

చదవండి: ఆ మూవీ నుంచి రాజశేఖర్‌ను తప్పించారా? జీవిత వల్లే ఆయనకు ఆఫర్‌ పోయిందట!

కాగా అన్‌స్టాపబుల్‌ షోకు ఆయన రైటర్‌గా పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ షో సక్సెస్‌ కావడంతో పలు టీవీ, యూట్యూబ్‌ చానల్‌ ఆయనతో ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రవి ఈ షోకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఈ క్రమంలో బాలయ్య అన్ స్టాపబుల్ షో కోసం బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని కూడా పనిచేశారని చెప్పాడు. బాలయ్యను కొత్తగా చూపేందుకు తేజస్విని చాలా రీసెర్చ్ చేశారని.. ‘అన్‌స్టాపబుల్’ టీమ్‌తో పనిచేస్తూ బాలయ్య లుక్, కాస్ట్యూమ్ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపాడు. ఇక విషయం తెలిసి నందమూరి ఫ్యాన్స్‌ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

చదవండి: వైరల్‌గా ప్రభాస్‌ ‘ఆది పురుష్‌’ న్యూ లుక్‌! శ్రీరాముడిగా ‘డార్లింగ్‌’ను చూశారా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement