husband escape
-
ప్రియుడి కోసం ప్రియురాలు.. భర్త కోసం భార్య..
ఒకరిది ప్రేమ పోరాటం...మరొకరిది భర్త కోసం ఆరాటం...కానీ వారిద్దరికీ న్యాయం చేయాల్సిన ప్రియుడు, భర్తతో పాటు ఆ రెండు కుటుంబాల వారు ఆకస్మాత్తుగా కనిపించకుండా పోయారు. దీంతో ఆ యువతి, మరో వివాహిత ప్రియుడు, భర్త ఇళ్ల ముందు పోరాటానికి దిగారు. న్యాయం చేసే వరకు కదిలేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. పోలీసుల రంగ ప్రవేశంతో వివాహిత పోరాటం తాత్కాలికంగా ఆగినా...ప్రియుడు కోసం ప్రియురాలు చేస్తున్న పోరాటం మాత్రం కొనసాగుతుంది. విజయనగరం, కొమరాడ: ప్రేమించానన్నాడు...పెళ్లి చేసుకుంటానన్నాడు...చివరి వరకు తోడు ఉంటానని నమ్మబలికాడు... నువ్వంటే నాకు ప్రాణమని నమ్మించాడు.. మాయమాటలు చెప్పి యువతిని లొంగదీసుకున్నాడు. చివరకు పెళ్లి అనేసరికి ముఖం చాటేశాడు. పది రోజులుగా కన్పించకుండా పోయాడు. దీంతో ఆ యువతి తనకు న్యాయం చేయాలంటూ ప్రియుడు ఇంటి ముందు రెండు రోజులుగా న్యాయపోరాటం చేస్తుంది. అన్న పానీయాలు మానివేసి న్యాయం చేయాలని నిరసన తెలియజేస్తుంది. వివరాల్లోకి వెళ్తే... మండలంలోని తులసివలస గ్రామానికి చెందిన కుట్రిక పుణ్యవతి, అదే గ్రామానికి చెందిన బొడ్డు శేఖర్ ఐదు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. శారీరకంగా ఒక్కటయ్యారు. పెళ్లి చేసుకుంటారని అంతా భావించారు. కానీ కథ అడ్డం తిరిగింది. ఐదేళ్లుగా తనను నమ్మి తిరిగితే చివరకు కనిపించకుండా పోయాడని పుణ్యవతి తెలిపింది. ఎప్పటిలాగే పండగ ముందు తనను రాత్రి సమయంలో బయటకు తీసుకువెళ్లి మార్గమధ్యంలో విడిచిపెట్టి వెళ్లిపోయాడని బాధితురాలు తెలిపింది. ఆ రాత్రి అష్టకష్టాలు పడి భయపడుతూ ఇంటికి చేరుకున్నానని పుణ్యవతి చెప్పింది. దీంతో విషయాన్ని గ్రామ పెద్దల వద్ద పంచాయతీ పెట్టగా ఏ విషయం రెండు రోజుల్లో చెబుతానని శేఖర్ గడువు పెడుతూ వస్తున్నాడు. ఇలా పది రోజులు అవుతున్నా శేఖర్ ఏ విషయం చెప్పకపోవడంతో కొమరాడ పోలీసులను ఆశ్రయించినట్టు చెప్పింది. దీంతో ఎస్ఐ ఫిర్యాదు ఇస్తే కేసు నమోదు చేస్తానని చెబుతున్నట్లు తెలుస్తోంది. అయితే పుణ్యవతి తనకు న్యాయం చేయాలని శేఖర్‌తో తన వివాహం జరిపించాలని బుధవారం ఉదయం నుంచి తులసివలసలోని శేఖర్ ఇంటి ముందు నిరసనకు దిగింది. కుటుంబ సభ్యులెవరూ ఇంట్లో లేకపోయినా ఆరుబయటే అన్న పానీయాలు మాని రెండు రోజులుగా నిరసన తెలియజేస్తూ న్యాయపోరాటం చేస్తుంది. అయినా శేఖర్గాని కుటుంబ సభ్యులుగాని ఇంతవరకు రాలేదు. రాత్రిపూట చలికి వణుకుతూ ఇంటి ముందు మెట్లపై పుణ్యవతి నిరసన తెలుపుతూ పోరాటం చేస్తుంది. తనకు న్యాయం జరగాలని శేఖర్‌కు ఉద్యోగం వచ్చే వరకు ఆగమన్నా ఆగుతానని ఐదేళ్లైనా, పదేళ్లైనా అతని కోసం వేచి చూస్తానని పేర్కొంది. గ్రామస్తులు, పోలీసులు అక్కడకు చేరుకొని చూస్తున్నారే తప్ప ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. మహిళ మౌన పోరాటం ఆడపిల్ల పుట్టిందని అత్తింటి వారి వేధింపులు బొబ్బిలి: ఓ వివాహిత తన ఆరేళ్ల కుమార్తెతో భర్త ఇంటి ముందు మౌన పోరాటానికి దిగింది. కట్నకానుకలు, ఖర్చుల కింద రూ.ఏడు లక్షలు ఖర్చు చేసినా తనను వదిలించుకునేందుకు అత్తమామలు, భర్త ప్రయత్నిస్తున్నారని ఇంటి ముందు కుమార్తెతో పాటు కూర్చుంది. న్యాయం చేయాలని వేడుకుంటున్నది. వివరాల్లోకి వెళ్తే...తెర్లాం మండలం నందబలగకు చెందిన దోర దుర్గా భవానికి బొబ్బిలికి చెందిన కళ్యాణరావుతో 2011 అక్టోబర్ 12న వివాహమైంది. వీరికి తనూజ అనే ఆరేళ్ల కుమార్తె ఉంది. వీరు విశాఖలో ప్రైవేటు ఉద్యోగం చేస్తూ జీవిస్తున్నారు. ఇటీవల తనకు పనుంది పుట్టింటికి వెళ్లమని భర్త చెప్పాడని, ఆ తరువాత సెల్ స్విచ్ఆఫ్ చేసి అద్దె ఇంటిని మార్చేసి వేరే చోటకు అద్దెకు దిగాడని దుర్గా భవాని, ఆమె తండ్రి ఆరోపించారు. ఆడపిల్ల పుట్టిందని, ఆ తరువాత మాకు జరగడం లేదని మీరు దురదృష్టవంతులని వేధిస్తున్నారని విలేకర్ల వద్ద ఆమె వాపోయింది. మరొకరిని పెళ్లి చేసుకునేందుకు తన భర్త అత్తమామలతో తనను వేధిస్తున్నాడని ఆవేదన చెందింది. తమకు న్యాయం చేయాలంటూ విలేకర్ల ఎదుట వాపోయింది. అనంతరం ఎస్ఐ బి.రవీంద్రరాజు తన సిబ్బందితో వచ్చి మీ భర్తతో మీకు మీ ఇంటికి పంపించేలా శనివారం ఏర్పాట్లు చేస్తానని మీ భర్తను రమ్మని పిలిచామని హామీ ఇవ్వడంతో తాత్కాలికంగా దీక్ష విరమించింది. -
భార్యను హత్య చేసిన భర్త
మూలపాడు (ఇబ్రహీంపట్నం): మద్యానికి బానిసైన భర్త కుటుంబ కలహాలతో భార్యను హత్యచేసి పరారయ్యాడు. మూలపాడు గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన ఆళ్లదాసు సూర్యనారాయణ కూలీ పనులు చేస్తుంటాడు. మద్యానికి బానిసైన ఇతను నిత్యం భార్య రమాదేవి (30)తో గొడవపడేవాడు. కేతనకొండ రంగుల కంపెనీలో పనిచేసి ఇంటికొచ్చిన తన భార్యతో ఆదివారం రాత్రి గొడవ పడ్డాడు. ఇరువురి మద్యన వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. రాత్రి ఒంటి గంట సమయంలో ఆవేశంతో తన వద్ద ఉన్న కండువాతో రమాదేవిని గొంతు నులిమి చంపాడని బందువులు ఆరోపిస్తున్నారు. అపస్మారక స్థితిలో పడిఉన్న భార్యను చూసి అనుమానంతో సమీపంలోని ఆర్ఎంపీ వైద్యుడిని తీసుకొచ్చి చూపించాడు. ఆమెను పరీక్షించి అప్పటికే చనిపోయినట్లు వైద్యుడు నిర్థారించాడు. భార్య చనిపోయిందన్న విషయాన్ని తెలుసుకున్న సూర్యనారాయణ అక్కడ నుంచి పరారయ్యాడు. తల్లి మరణించి తండ్రి పరారీలో ఉండటంతో మృతురాలికి చెందిన ఇద్దరు మగబిడ్డలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. బంధువుల్లో విషాదం నెలకొంది. ఇబ్రహీంపట్నం సీఐ డి.చవాన్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పంచనామా నిర్వహించి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
కారులో మహిళ మృతదేహం
హత్యగా పోలీసుల నిర్థారణ పరారీలో భర్త సనత్‌నగర్: పాడైపోయిన కారులో ఓ మహిళ మృతదేహం లభ్యమైంది... తలపై గాయాలుండటంతో ఆమె హత్యకు గురైనట్లుగా పోలీసులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. మృతురాలి భర్త పరారీలో ఉండటంతో అతడిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బేగంపేట ఠాణా పరిధిలో మంగళవారం ఈ దారుణం వెలుగు చూసింది. ఇన్స్పెక్టర్ బస్వారెడ్డి కథనం ప్రకారం... ప్రకాశ్‌నగర్‌లోని రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లే రోడ్డులో పద్మ (35), నర్సింహ్మ (40) దంపతులు ఉంటున్నారు. పిల్లలను హాస్టల్లో చేర్పించి భార్యాభర్తలు చెత్తకాగితాలు ఏరుకుంటూ జీవిస్తున్నారు. ఇల్లు లేకపోవడంతో స్థానికంగా ఉన్న చెట్ల కిందనే కాలం గడుపుతున్నారు. వర్షం వచ్చిన సమయంలో మాత్రం అక్కడే రోడ్డు పక్కన ఉన్న పాడైన కారును షెల్టర్‌గా వాడుకుంటున్నారు. మూడు రోజులుగా ఈ ప్రాంతంలో తీవ్ర దుర్వాసన వస్తోంది. అక్కడి డస్ట్‌బిన్ నుంచి వాసన వస్తోందేమోనని స్థానికులు పట్టించుకోలేదు. అయితే, డస్ట్బిన్లోని చెత్తను తరలించినప్పటికీ దుర్వాసన వస్తుండటంతో స్థానికులకు మంగళవారం అనుమానం వచ్చి పరిశీలించగా కారులో కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం కనిపించింది. వెంటనే వారు బేగంపేట్ పోలీసులకు సమాచారం ఇవ్వగా.. సీఐ బస్వారెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ మృతదేహం పద్మదిగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. మృతదేహం కుళ్లిపోవడం బట్టి నాలుగైదు రోజుల క్రితమే ఆమె చనిపోయి ఉంటుందని భావిస్తున్నారు. నర్సింహ్మ, పద్మలు కొంతకాలంగా గొడవపడుతున్నారని, రోజూ నర్సింహ్మ తాగి వచ్చి భార్యను కొట్టేవాడని స్థానికులు పోలీసులకు తెలిపారు. తలపై గాయాలు ఉండటంతో ఆమె హత్యకు గురైనట్టు పోలీసులు నిర్థారణకు వచ్చారు. మృతురాలి భర్త అదృశ్యం కావడంతో అతడే చంపి పారిపోయి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నర్సంహ్మ కోసం గాలిస్తున్నామని, అతను దొరికితే పూర్తి వివరాలు బయటకు వస్తాయని సీఐ తెలిపారు. ఘటనా స్థలాన్ని బేగంపేట్ ఏసీపీ గణేష్‌రెడ్డి పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సురేంద్ర మోహన్‌పై కేసు నమోదు
ఏలూరు : భార్యకు విడాకులు ఇవ్వకుండానే రెండోపెళ్లికి సిద్ధపడిన సురేంద్ర మోహన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. భార్య ఉమా మహేశ్వరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సురేంద్ర మోహన్‌పై 494, రెడ్ విత్ 511, 506(2) సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన లంకా సురేంద్ర మోహన్ శుక్రవారం ద్వారకా తిరుమలలో విశాఖ జిల్లా నర్సీపట్నంకు చెందిన ఓ యువతిని బంధుమిత్రుల సమక్షంలో వివాహం చేసుకుంటున్న సమయంలో ఉమామహేశ్వరి అక్కడ వచ్చి ఆ పెళ్లిని ఆపిన విషయం తెలిసిందే. -
'ఆపండి అనే లోపే పెళ్లి అయిపోయింది..!
-
'ఆపండి అనే లోపే పెళ్లి అయిపోయింది..!
ఏలూరు: చాలా సినిమాల్లో సరిగ్గా తాళి కట్టే సమయంలో.. సీన్ చాలా స్లో మోషన్ గా ఉంటుంది. థియేటర్ సీట్లలో కూర్చున్నవారంతా కాస్తంత ఆసక్తిగా సీట్లలోంచి కొంచెం లేస్తున్నట్లుగా మెడలు ముందుకుసాచి పెట్టి చూస్తుంటారు.. ఒక సస్పెన్స్ మ్యూజిక్ వినిపిస్తుంటుంది. సరిగ్గా వరుడు తాళి కట్టే సమయానికి.. ఆగండి అని ఒక డైలాగ్ వినిపిస్తుంది. దీంతో అయ్యో అంటూ ఊసురుమంటాం. సరిగ్గా అలాంటి డైలాగే వినిపించింది. కానీ, కాస్తంతా ఆలస్యంగా రావడంతో ఇక్కడ మాత్రం పెళ్లి జరిగిపోయింది. పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో శుక్రవారం రాజమండ్రికి చెందిన సురేంద్ర మోహన్ అనే వ్యక్తి భార్యకు తెలియకుండా మరో పెళ్లి సిద్ధమయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న మొదటి భార్య ఉమా మహేశ్వరి కళ్యాణ మండపం వచ్చేసరికి మరో అమ్మాయి మెడలో తాళి కట్టేశాడు. ఆగ్రహానికి గురైన ఆమె తాను బతికి ఉండగానే, విడాకులు తీసుకోకుండా మరో పెళ్లికి ఎలా సిద్ధమయ్యావంటూ సురేంద్రను నిలదీసింది. సురేంద్రతో తనకు పదేళ్ల క్రితమే పెళ్లి అయిందని,వివాహ సమయంలో రూ.కోటి తీసుకున్నట్లు చెప్పింది. తమకు ఆరేళ్ల పాప కూడా ఉందని ఆమె తెలిపింది. దీంతో సురేంద్ర పెళ్లి మండపం నుంచి వెళ్లిపోయాడు. కాగా అసలు పెళ్లి జరగలేదని పోలీసులు చెప్తున్నారు. ఉమా మహేశ్వరి ఫిర్యాదు ఇచ్చిందని, దానిపై దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు. ఇదిలా ఉండగా, భార్యభర్తల మధ్య విబేధాలు ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో వీరిద్దరూ గత కొంతకాలంగా వేర్వేరుగా ఉంటున్నారు. అయితే భర్త వేధింపులు తట్టుకోలేక ఉమా మహేశ్వరి ఫిర్యాదుతో సురేంద్ర మోహన్‌పై హైదరాబాద్ పోలీసులు 498 కేసు కూడా నమోదు చేశారు. ఉమా మహేశ్వరి స్వస్థలం విశాఖపట్నం. -
అప్పు చెల్లించలేక భర్త పరారీ: భార్య నిర్బంధం
అనంతపురం: సమాజంలో మానవతా విలువలు నానాటికీ అంతరించిపోతున్నాయి. భర్త చేసిన అప్పు కారణంగా భార్యను నిర్బంధంలోకి తీసుకున్న ఘటన జిల్లాలోని ధర్మవరంలో కలకలం రేపింది. చేనేత కార్మికుడు శివప్ప గతంలో రామచంద్ర అనే వ్యక్తి వద్ద రూ.లక్ష అప్పు తీసుకున్నాడు. తన అప్పు తీర్చాలని రామచంద్ర ఒత్తిడి చేయడంతో శివప్ప పరారీ అయ్యాడు. దీంతో ఆ చేనేత కార్మికుని భార్య లీలావతిని రామచంద్ర తన నిర్బంధంలోకి తీసుకున్నాడు. అంతటి ఆగని రామచంద్ర ఆమెను వేధింపులకు గురిచేశాడు. తన వద్ద తీసుకున్న అప్పుని ఎలాగైనా తీర్చాలని బలవంతపెట్టడం ఆరంభించాడు. ఇక ఎటుదిక్కు తోచని ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది.