మైనర్ బాలికకు పెళ్లి వేధింపులు..యువకుడు అరెస్టు | Man held for abducting minor to marry her | Sakshi
Sakshi News home page

మైనర్ బాలికకు పెళ్లి వేధింపులు..యువకుడు అరెస్టు

Published Tue, Oct 15 2013 7:17 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

Man held for abducting minor to marry her

హైదరాబాద్: మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటానని బలవంతం చేసిన ఘటనలో ఓ యువకుడిని మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  కె.విద్యానాథ్ అనే యువకుడు ఓ ప్రైవేటు కంపెనీలు ఉద్యోగం చేస్తున్నాడు. తను అద్దెకుండే చోట పరిచయమైన యువతితో పరిచయం పెంచుకున్నాడు.  అతనితో ఆ యువతి చనువుగా ఉండటాన్ని అదునుగా భావించిన ఆ యువకుడు ప్రేమ ప్రస్తావన తెచ్చాడు. ఈవిషయాన్ని గోప్యంగా ఉంచిన ఆ యువతికి క్రమేపి వేధింపులు ఎక్కువైయ్యాయి.
 

ఇందులో భాగంగా  ఆ యువతి సెప్టెంబర్ 14వ తేదీన మంగళహాట్ ప్రాంతంలో ఉన్న ఓ షాపు వెళ్లగా విద్యానాథ్ మరోసారి వెంటబడ్డాడు. ''నువ్వంటే నాకిష్టం. నిన్ను పెళ్లి చేసుకుంటానని'' మాటలు కలిపాడు. యువకుడి వేధింపులకు అడ్డుకట్ట వేయాలని భావించిన ఆ యువతి అసలు విషయాన్ని తల్లి దండ్రులకు చెప్పింది. దీంతో ఆమె తల్లి దండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసును నమోదు చేసిన పోలీసులు ఆ యువకుడ్ని నల్గొండలో అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement