విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టు | Human Trafficking Ring Dismantled in Visakhapatnam | Sakshi
Sakshi News home page

విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టు

Published Sat, Dec 21 2024 9:06 AM | Last Updated on Sat, Dec 21 2024 10:18 AM

Human Trafficking Ring Dismantled in Visakhapatnam

సాక్షి,విశాఖ : విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టు రట్టయ్యింది. కిరండోల్‌-విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో బాలికల అక్రమణ రవాణా జరుగుతుందనే సమాచారంతో రైల్వే పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో 11మంది మైనర్లను రక్షించారు. బాలికల్ని తమిళనాడుకు తరలిస్తున్న ముఠాను నిందితుడు రవి బిసోయ్‌ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఈ దర్యాప్తులో ఒరిస్సాలోని నవరంగ్ పూర్ ప్రాంతానికి చెందిన చిన్నారులుగా గుర్తించారు. పూర్తి స్థాయి దర్యాప్తు కోసం విశాఖ రైల్వే పోలీసులు కేసును ఒరిస్సా పోలీసులకు అప్పగించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement