వేధింపులకు పాల్పడుతోన్న టీడీపీ నేత అరెస్ట్‌ | TDP Leader Arrested By Police In Eluru | Sakshi
Sakshi News home page

వేధింపులకు పాల్పడుతోన్న టీడీపీ నేత అరెస్ట్‌

Published Thu, May 31 2018 8:34 PM | Last Updated on Fri, Aug 10 2018 9:52 PM

TDP Leader Arrested By Police In Eluru - Sakshi

నిందితుడు రామకృష్ణ

పశ్చిమ గోదావరి జిల్లా : యువతిని వేధింపులకు గురిచేస్తోన్న టీడీపీ నేత ముసునూరి రామకృష్ణను ఏలూరులో పోలీసులు గురువారం అరెస్ట్‌ చేశారు. స్థానికంగా నివాసముంటున్న ఓ యువతిని ఫోన్‌లో బ్లాక్‌మెయిల్‌ చేస్తూ వేధిస్తున్నాడు. ఈ వేధింపులకు తాళలేక ఆ యువతి, బంధువుల సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దీంతో పోలీసులు వేధింపులకు పాల్పడుతున్న టీడీపీ నేత ముసునూరి రామకృష్ణను అదుపులోకి తీసుకున్నారు. 354డీ, 506, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement