అవమానం తట్టుకోలేక.. | 20 years girl dies of abasement in ysrdistrict | Sakshi
Sakshi News home page

అవమానం తట్టుకోలేక..

Published Thu, Mar 30 2017 8:38 PM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM

20 years girl dies of abasement in ysrdistrict

వైఎస్ఆర్ జిల్లా(వల్లూరు):
అవమానం తట్టుకోలేక మండలంలోని ఆదినిమ్మాయపల్లెకు చెందిన అవివాహిత యువతి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఈ నెల 24 వ తేదీన ఆదినిమ్మాయపల్లెకు చెందిన సుప్రజ (20 ) అనే అవివాహిత యువతి తమ ఇంటిలో ఉండగా తల్లిదండ్రులు ఎవరూలేని సమయంలో మిట్టపల్లెకు చెందిన పాశం భాస్కర్‌ బాబు అనే యుకుడు ఇంటిలోకి ప్రవేశించి ఆమెపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. దీంతో ఆమె కేకలు వేయడంతో చుట్టు పక్కల వారు వచ్చి అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం వారు పోలీసులకు అప్పగించడంతో కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపారు. అయితే అప్పటి నుంచి అవమాన భారంతో కుమిలిపోతున్న యువతి బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి తెలిపారు. యువతి మృతికి కారణమైన నిందితుని కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement