ఆకతాయి పనులు.. ఐదుగురి అరెస్ట్‌ | Five arrested For Molested A Women In Haryana | Sakshi
Sakshi News home page

Published Sat, Sep 22 2018 11:23 AM | Last Updated on Sat, Sep 22 2018 2:15 PM

Five arrested For Molested A Women In Haryana - Sakshi

క్రైమ్‌ : ఆకతాయిగా అల్లరి పనులు చేసిన ఐదుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. హర్యానాలోని సెక్టార్‌ 86లో జరిగిన ఈ ఘటనలో మరో ఇద్దరు యువకులు పారిపోయినట్టు పోలీసులు తెలిపారు. వివరాలు.. ఆఫీస్‌ నుంచి ఇంటికి తిరిగివస్తోన్న ఐటీ ఉద్యోగినిని అల్లరిమూక భయబ్రాంతులకు గురిచేసింది. ఆ యువతి ఉండే అపార్ట్‌మెంట్‌లోనే కింది ఫ్లోర్‌లో ఉండే ఆ దుండగులు యువతిని వేధించేందుకు ప్రయత్నించారు. అసభ్యకర మాటలతో, లైంగిక దాడి చేసేందుకు ప్రయత్నించగా.. యువతి తప్పించుకుని ఇంట్లోకి వెళ్లి తన తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసింది. ఆ దుండగులు ఇంట్లోకి వచ్చి ఆ తల్లిదండ్రులపైనా తమ ఆకతాయితనాన్ని చూపసాగారు. అనంతరం ఫిర్యాదు అందుకున్న పోలీసులు అందులో ఐదుగురిని అదుపులోకి తీసుకోగా మరో ఇద్దరు పరారయ్యారు. ఆ యువకులు కాలనీలో అల్లరి చేస్తుంటారని, మద్యం సేవిస్తారని, రోడ్లపై అసభ్యంగా ప్రవర్తిస్తుంటారని అక్కడి కాలనీవాసులు చెప్పుకొచ్చారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement