సాక్షి, విజయవాడ : ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఓ యువకుడు తీసిన సెల్ఫీ వీడియో కలకలం రేపుతోంది. విజయవాడ కృష్ణలంకకు చెందిన గురువారెడ్డి మంగళవారం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఆత్మహత్యకు దారితీసిన కారణాలను వివరిస్తూ ఓ సెల్ఫీ వీడియోను తీసి అనంతరం రైలుకింద పడి ప్రాణాలు తీసుకున్నాడు.
సెల్ఫీ వీడియోలో ఏముందంటే..
‘సారీ డాడీ. ఇంతగా బాధపెడతాననుకోలేదు. గాయాత్రి నేను నిన్ను ఎంతగా ప్రేమించానో నీకు తెలుసు. కానీ నువ్వు నన్ను ఎంతగా బాధపెట్టావో నీకు తెలుసు. ఏమీ చేయని తప్పుకు లోపల(పోలీసు స్టేషన్) కూర్చోపెట్టావు. ఎంత బాధగా ఉంటుందో తెలుసా అది. నువ్వు ఏముంది హ్యాపీగా ఉన్నావు. నా చావుకు కారణం నువ్వు, మీ అమ్మ నాన్న, మీ అన్నయ్య. వాళ్లు ఎంతగా మోసం చేశారో నీకు తెలుసు. రాత్రికి రాత్రి మాటమార్చెస్తారా. ఎంత పని చేశావు కన్నా. నీకోసం ఎంత చేశానో నీకు తెలుసు. సరే బాయ్... ఒక వేళ బతికుంటే మళ్లీ కలుద్దాం.. కిట్టు అమ్మానాన్నలను జాగ్రత్తగా చూసుకో..’ అంటూ సెల్ఫీ వీడియోలో మాట్లాడి అనంతరం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.
కృష్ణలంక పోలీసులు గురువారెడ్డిని చెయ్యని తప్పుకు రెండు రోజులు స్టేషన్ లో ఉంచి ఇబ్బంది పెట్టారని బంధువులు ఆరోపించారు. దీంతో తీవ్ర మనస్తాపం చెంది అతడు బలవన్మరణానికి పాల్పడ్డాడని వాపోయారు. గురువారెడ్డి ఆత్మహత్యకు కారణమైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment