selfi suicide
-
నాన్న నన్ను క్షమించండి అంటూ సెల్ఫీ వీడియో! కన్నీటి పర్యంతమవుతున్న తండ్రి
మహిళలను వరకట్నం కోసమో లేక ఆడపిల్లలు పుట్టారనో వేధించే అత్తమామాలు కోకొల్లలు. భర్త కూడా తన తల్లిదండ్రులకే వంతపాడుతూ వేధిస్తుంటే ఇక ఆ మహిళ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో మాటల్లో చెప్పలేం. అది కూడా విదేశాల్లో ఎక్కడో ఉండి ఈ బాధలు అనుభవిస్తుంటే ఇక ఆ మహిళలు పరిస్థితి మరితం ఘెరంగా ఉంటుంది. సదరు బాధిత మహిళలు దిక్కుతోచని నిస్సహయ స్థితిలో వేధింపులకు తాళలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అచ్చం అలానే న్యూయార్క్‌లో ఉంటున్న ఒక భారతీయ మహిళ ఇలానే చేయండంతో ఆమె తల్లిదండ్రులు కూతురు మృతదేహం కోసం ఆవేదనగా నిరీక్షిస్తున్నారు. వివరాల్లోకెళ్తే...యూపీలోని బిజ్నోర్కి చెందిన 30 ఏళ్ల మన్దీప్ కౌర్ 2015లో రంజోద్ బీర్ సింగ్ సంధును వివాహం చేసుకుని అమెరికా వెళ్లింది. ఐతే కొన్నాళ్లు సంతోషంగానే గడిచింది వారి కాపురం. ఎప్పుడైతే తనకు ఇద్దరు కూతుళ్ల పుట్టారో అప్పటి నుంచి ఆమెకు కష్టాలు అధికమయ్యాయి. ఏదో ఒక రోజు మారతాడనే ఆశతో ఆ వేధింపులను భరిస్తూ వచ్చింది. ఆ వేధింపులు తగ్గకపోక మరింత తీవ్రమవ్వడంతో ...ఆమె తన భర్త అత్త మామ వేధిస్తున్నారంటూ తన తల్లిదండ్రులకు తన గోడును వెళ్లబోసుకోవడమే గాక తనను హింసిస్తున్న వీడియోలను కూడా పంపించింది. దీంతో ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న ఆమె భర్త తనను కాపాడమంటూ వేడుకున్నాడు. దీంతో ఆమె మారతాడనుకుని కేసు పెట్టడానికి వెనక్కి తగ్గింది. ఆ తర్వాత నుంచి ఆమెను మరింతగా అత్తమామ, భర్త కలిసి హింసించడం ప్రారంభించారు. ఇక వారి వేధింపులు తాళ్లలేక ఆమె ఒక సెల్ఫీ వీడియోలో తన ఆవేదనను వివరిస్తూ నాన్న నన్ను క్షమించండి. నన్ను చచ్చిపోమని భర్త, అత్తమామ పదేపదే అంటున్నారు. ఇక తన వల్ల కాదంటూ మన్దీప్ ఆత్యహత్య చేసుకుని చనిపోతున్నట్లు వీడియోలో తెలిపింది. అయితే ఆమె తల్లిదండ్రులు తమ అల్లుడు తమ కూతురిని ఎలా వేధించేవాడో వివరిస్తూ... పలు వీడియోలు పంపించిందని చెప్పుకొచ్చారు. మారతాడని ఓపిక పట్టానని ఒకానొక సమయంలో పోలీసులను కూడా సంప్రదించానని చెప్పుకొచ్చాడు. తన కూతురు మృతదేహాన్ని భారత్ తీసుకువచ్చేందుకు సహాయం చేయండి అంటూ కన్నీటి పర్యంతమయ్యాడు ఆమె తండ్రి. ఈ మేరకు వేధింపులు, గృహహింసకు గురవుతున్న సిక్కు మహిళల కోసం పనిచేస్తున్న ది కౌర్ మూవ్మెంట్ అనే సంస్థ బాధిత మహిళ సెల్ఫీ వీడియోని ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం నెట్టింట ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహంతో ఇంకా మనం ఏ సమాజంలో ఉన్నామంటూ ప్రశ్నిస్తూ..ట్వీట్ చేశారు. There are collosal problems in our family & social structure which we conveniently ignore or deny to accept. #DomesticViolence against women is one such serious problem. Suicide by Mandeep Kaur a NRI Punjabi woman is a wake up call to accept the problem and fix it accordingly. pic.twitter.com/F8WpkiLCZY — Gurshamshir Singh (@gurshamshir) August 5, 2022 (చదవండి: సుప్రీం ముందు రేప్ బాధితురాలి సూసైడ్ ఘటన.. సంచలన కేసులో అతుల్ రాయ్‌కు ఊరట) -
లోన్ యాప్ వేధింపులు, సెల్ఫీ సూసైడ్!
సాక్షి, పెద్దపల్లి: ఆన్లైన్ లోన్ యాప్ మరో వ్యక్తి ప్రాణాలు తీసింది. అవసరానికి అప్పులు తీసుకున్న వ్యక్తిని అదే పనిగా వేధించడంతో బాధితుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు... విశాఖపట్నానికి చెందిన సంతోష్‌కుమార్ రామగుండంలోని ఓ ఎరువుల కర్మాగారంలో సైట్ ఇంచార్జిగా పనిచేసేవాడు. మల్కాపూర్‌లో ఇల్లు అద్దెకు తీసుకునే ఉండేవాడు. తన ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవడంతో సంతోష్ ఆర్థికంగా కుదేలయ్యాడు. దీంతో యాప్ లోన్ ద్వారా అప్పు తీసుకున్నాడు. వాటిని వాయిదాల ప్రకారం చెల్లించసాగాడు. అయితే, అసలు, వడ్డీ ఒకేసారి చెల్లించాలని సదరు యాప్‌ల నిర్వాహకులు వేధించసాగారు. అసలే ఆర్థికంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న సంతోష్ వారి వేధింపులు భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అఘాయిత్యానికి పాల్పడే ముందు అతను సెల్ఫీ వీడియోలో తన ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ వీడియోను తన ఫ్రెండ్ సుబ్రహ్మణ్యంకు పంపించాడు. (చదవండి: లోన్‌యాప్స్ కేసులో ఆసక్తికర విషయాలు) అప్పులు తీసిన ప్రాణం వెంటనే స్పందించిన సుబ్రహ్మణ్యం అతన్ని గోదావరిఖని ఆస్పత్రికి అక్కడి నుంచి కరీంనగర్‌లోని ఆస్పత్రికి తరలించారు. విశాఖపట్పం నుంచి వచ్చిన కుటుంబ సభ్యులు సంతోష్‌ను మెరుగైన వైద్యం కోసం వైజాగ్‌కు తీసుకువెళ్ళారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల 23న మృతి చెందారు. సూసైడ్ సెల్ఫీ వీడియో ద్వారా సుబ్రహ్మణ్యం ఎన్టీపీసీ పోలీసులకు పిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మొత్తం 5 లోన్ యాప్‌ల ద్వారా సంతోష్ రూ. 54 వేలు అప్పు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఉదాన్‌లోన్ యాప్, రుపీ లోన్ యాప్, రూపేలోన్ యాప్, ఎఎఎ-క్యాష్ లోన్ యాప్, లోన్‌గ్రాన్ యాప్‌లలో అతను అప్పుగా తీసుకున్నట్టుగా సమాచారం. ఆయా యాప్‌ల యాజమాన్యాలపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని అతని స్నేహితుడు సుబ్రహ్మణ్యం ఎన్టీపీసీ పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టామని ఎన్టీపీసీ ఎస్సై స్వరూప్‌రాజ్ తెలిపారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో కలకలం సృష్టిస్తోంది. (చదవండి: వేధింపులకు కొన్ని స్టేజ్‌లు..!) -
ముఖంపై చిరునవ్వు.. మీసంపై చెయ్యి: సెల్ఫీసూసైడ్
సాక్షి, సిద్ధిపేట : ప్రేమలో విఫలమైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాను ఆత్మహత్య చేసుకోవటాన్ని మొత్తం వీడియో చిత్రీకరించి దాన్ని స్నేహితులకు వాట్సాప్ చేశాడు. ఈ సంఘటన సిద్ధిపేట జిల్లాలోని మద్దూరు మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మద్దూరు మండలం మరుమల్లె గ్రామానికి చెందిన అనిల్ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన ఓ యువతి కొద్దిరోజులుగా ప్రేమించుకుంటున్నారు. కాగా వీరి ప్రేమను అంగీకరించని అమ్మాయి తండ్రి ఆమెకు వేరే పెళ్లి నిశ్చయం చేశాడు. దీంతో మనస్తాపానికి గురైన అనిల్ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు పురుగుల మందు కొనుక్కుని ఊరికి దూరంగా వెళ్లాడు.తన ఆవేదనను సెల్ఫీ వీడియోలో చిత్రీకరించి, పురుగుల మందుతాగాడు. అనంతరం వీడియోను మిత్రులకు పంపాడు. వీడియోలో : తల్లిదండ్రులు పిల్లలను అర్థంచేసుకోవాలని విజ్ఞప్తి చేశాడు. పిల్లలను పక్కవారితో పోల్చి బాధపెట్టవద్దని కోరాడు. చివరగా ‘‘చావు నా కళ్లముందు ఉన్నపుడు నా ముఖంపై చిరునవ్వుండాలి, నా చెయ్యి నా మీసం మీదుండాలి’’ అన్న సినిమా డైలాగ్‌ను ప్రస్తావిస్తూ.. అది కేవలం సినిమా మాత్రమేనని తాను చేస్తున్నది రియల్ అని పేర్కొన్నాడు. తన ముఖంపై చిరునవ్వు ఉందని, మీసంపై చెయ్యి ఉందని చెప్పి, మీసం మెలితిప్పి.. పురుగుల మందు సేవించాడు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ముఖంపై చిరునవ్వు.. మీసంపై చెయ్యి: సెల్ఫీసూసైడ్
-
వడ్డీలు కట్టలేక ఓ యువకుడు ఆత్మహత్య
-
నా చావుకు వాళ్లే కారణం.. సెల్ఫీ సూసైడ్!
సాక్షి, కృష్ణాజిల్లా : వడ్డీలు కట్టలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కొంతమంది వ్యక్తుల వేధింపుల కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. ఈ సంఘటన కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. మచిలీపట్నానికి చెందిన భానుప్రకాష్ అనే యువకుడు కొద్దిరోజుల క్రితం అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్య చేసుకోవటాన్ని మొత్తం సెల్ఫీ వీడియో తీశాడు. తన చావుకు అఖిల్, అఖిల్ తండ్రి కారణమని వీడియోలో పేర్కొన్నాడు. వారివద్ద తీసుకున్న అప్పుకు తనను బెదిరించి వడ్డీ పెంచి, బైక్ లాక్కొన్నారని తెలిపాడు. తన తల్లి ఏటీఎంను సైతం లాక్కొని, ఎంత బ్రతిమాలినా తిరిగి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. రోడ్డు మీద అందరి ముందు తనను నిలదీయటం కారణంగానే మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపాడు. అంత్యక్రియల అనంతరం భానుప్రకాష్ మిత్రులు అతడి మొబైల్ ఫోన్‌ను చెక్ చేయగా సెల్ఫీ వీడియో వెలుగుచూసింది. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : వడ్డీలు కట్టలేక ఓ యువకుడు ఆత్మహత్య -
కులాంతర వివాహం..నా చావుకు వారే కారణం
-
వడ్డీ వ్యాపారి వేధింపులు..సెల్ఫీ సూసైడ్!
-
అత్తింటి వేధింపులతో యువకుడు ఆత్మహత్య
సాక్షి, విజయవాడ : ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఓ యువకుడు తీసిన సెల్ఫీ వీడియో కలకలం రేపుతోంది. విజయవాడ కృష్ణలంకకు చెందిన గురువారెడ్డి మంగళవారం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఆత్మహత్యకు దారితీసిన కారణాలను వివరిస్తూ ఓ సెల్ఫీ వీడియోను తీసి అనంతరం రైలుకింద పడి ప్రాణాలు తీసుకున్నాడు. సెల్ఫీ వీడియోలో ఏముందంటే.. ‘సారీ డాడీ. ఇంతగా బాధపెడతాననుకోలేదు. గాయాత్రి నేను నిన్ను ఎంతగా ప్రేమించానో నీకు తెలుసు. కానీ నువ్వు నన్ను ఎంతగా బాధపెట్టావో నీకు తెలుసు. ఏమీ చేయని తప్పుకు లోపల(పోలీసు స్టేషన్) కూర్చోపెట్టావు. ఎంత బాధగా ఉంటుందో తెలుసా అది. నువ్వు ఏముంది హ్యాపీగా ఉన్నావు. నా చావుకు కారణం నువ్వు, మీ అమ్మ నాన్న, మీ అన్నయ్య. వాళ్లు ఎంతగా మోసం చేశారో నీకు తెలుసు. రాత్రికి రాత్రి మాటమార్చెస్తారా. ఎంత పని చేశావు కన్నా. నీకోసం ఎంత చేశానో నీకు తెలుసు. సరే బాయ్... ఒక వేళ బతికుంటే మళ్లీ కలుద్దాం.. కిట్టు అమ్మానాన్నలను జాగ్రత్తగా చూసుకో..’ అంటూ సెల్ఫీ వీడియోలో మాట్లాడి అనంతరం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. కృష్ణలంక పోలీసులు గురువారెడ్డిని చెయ్యని తప్పుకు రెండు రోజులు స్టేషన్ లో ఉంచి ఇబ్బంది పెట్టారని బంధువులు ఆరోపించారు. దీంతో తీవ్ర మనస్తాపం చెంది అతడు బలవన్మరణానికి పాల్పడ్డాడని వాపోయారు. గురువారెడ్డి ఆత్మహత్యకు కారణమైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
సెల్ఫీ సూసైడ్: నా చావుకి వాళ్లే కారణం
-
భార్య మోసం.. భర్త సెల్ఫీ సూసైడ్
భోపాల్ : ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య మోసం చేసిందని సెల్ఫీ సూసైడ్ చేసుకున్నాడో యువకుడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని ఛటర్‌పూర్ జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్ ఛటర్‌పూర్ జిల్లా గంజ్ గ్రామానికి చెందిన తులసీదాస్ పాటిల్(28) పెద్దలను ఎదురించి ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె మెడికల్ క్లీనిక్ పెడతానంటే ఇంటిని అమ్మి 2లక్షల డబ్బు సహాయం చేశాడు. ఏమైందో ఏమో కొద్ది రోజుల తర్వాత ఆమె అతనితో తెగదెంపులు చేసుకుని ఆమె విడిపోయింది. దీంతో మనస్తాపానికి గరైన తులసీదాస్ విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు తన చావుకు కారణాలను తెలుపుతూ వీడియో సెల్ఫీ తీసి దాన్ని అతని బావకు పంపాడు. ‘‘ ప్రాణంగా ప్రేమించిన ఆమె నన్ను దూరంగా పెడుతోంది. ఆమెకు కుటుంబ సభ్యులు మరో పెళ్లి చేయడానికి సిద్దపడుతున్నారని తెలిసింది. ఆమె బంధువలతో గొడవపడేంత దమ్ము నాకు లేదు అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాను. ఇంట్లో భద్రపరిచిన పెళ్లికి సంబంధించిన కొన్ని ఫోటోలు, మ్యారేజ్ సర్టిఫికేట్లు పోలీసులు చూడాలి’’అని ఆ సెల్ఫీ వీడియోలో తులసీదాస్ కోరాడు. ఆలస్యంగా వీడియో చూసిన తులసీదాస్ బావ పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
మాధవి కేసులో భాను అరెస్ట్
నెల్లూరు: అసిస్టెంట్ ప్రొఫెసర్ వీర మాధవి (28) ఆత్మహత్య కేసులో ప్రియుడు భానుతేజను పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. ప్రేమించిన వ్యక్తి ముఖం చాటేయడంతో తట్టుకోలేక సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్యకు కారణాలను వివరించి మాధవి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. 'భానూ..ఒకే ఒక కోరిక ఉంది తీరుస్తావా..నా చేతులకు గాజులు వేసి..నా ముఖాన ఇంత బొట్టుపెట్టు..మనకి భగవంతుని దృష్టిలో ఎప్పుడో పెళ్లయిపోయింది భానూ.. ఈ ఒకే ఒక్క కోరిక తీరుస్తావని మరీ మరీ కోరుకుంటున్నాను. ఇంకెప్పుడు నీ లైఫ్‌లోకి..ఇంకెవరి లైఫ్‌లోకి రాను.. మీకందరికీ దూరంగా వెళ్లిపోవాలని..ముఖ్యంగా ఈ నరకాన్ని భరించలేక వెళ్లిపోతున్నాను.. ఇక సెలవ్..'అంటూ వీడియో సెల్ఫీ తీసుకున్న మాధవి బలవన్మరణానికి పాల్పడ్డారు. కావలిలోని కో-ఆపరేటివ్ కాలనీకి చెందిన మాధవి పట్టణంలోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో మ్యాథ్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేసేవారు. మాధవి ఆత్మహత్యకు కారణమైన భానుతేజను పోలీసులు అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నారు.