అనురాగ్ కశ్యప్
ముంబై: లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌కు ముంబైలోని వెర్సోవా పోలీసులు బుధవారం సమన్లు పంపించారు. అనురాగ్ కశ్యప్ తనను లైంగికంగా వేధించారని నటి పాయల్ ఘోష్ ఆరోపించిన విషయం తెలిసిందే. మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించి మీటూ ఉద్యమం తరువాత అనురాగ్ కశ్యప్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. అయితే తనకు న్యాయం చేయాలంటూ పాయల్ ప్రధాని నరేంద్ర మోదీని కోరిన విషయం తెలిసిందే. పాయల్ ఘోష్ ఫిర్యాదు మేరకు ముంబైలోని వెర్సోవా పోలీస్ స్టేషన్‌లో పోలీసులు అనురాగ్‌పై కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగా రేపు (గురువారం) ఉదయం 11 గంటలకు పోలీసు స్టేషన్‌లో అనురాగ్ కశ్యప్ హాజరు కావాలని సమన్లలో పోలీసులు పేర్కొన్నారు. చదవండి: (రూపా దత్తా లైంగిక ఆరోపణలు : నిజమేనా?)
ఇప్పటికే అనురాగ్‌పై ఐపీసీ సెక్షన్లు 376(ఐ), 354, 341, 342 సెక్షన్ల కింద కేసు నమోదయ్యింది. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరింత లోతుగా విచారణ చేయడానికి అనురాగ్‌కు బుధవారం సమన్లు పంపించినట్లు తెలుస్తోంది. ఇక 2013లో వెర్సోవాలోని యారి రోడ్డులో కశ్యప్ తనపై అత్యాచారం చేశారని ఇటీవల నటి పాయల్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏడేళ్ల క్రితం జరిగిన ఈ ఘటనపై విచారణలో భాగంగా అనురాగ్ కశ్యప్‌ను పోలీసులు విచారణ జరపనున్నారు. చదవండి: (అనురాగ్ కశ్యప్‌పై కేసు నమోదు)
Comments
Please login to add a commentAdd a comment