anurag Kasyap
-
అనురాగ్ కశ్యప్ కూతురి హల్దీ సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
ఆళ్ల సినిమాలు చూడొద్దంతే.. ఇప్పుడిదే నడుస్తోంది!
బాలీవుడ్లో బాయ్‌కాట్ ట్రెండ్ నడుస్తోంది. తాజాగా ఆమిర్ ఖాన్ హీరోగా నటించిన లాల్ సింగ్ చద్దా సినిమాను బాయ్‌కాట్ చేయాలని గత కొద్ది రోజులుగా ట్విటర్లో విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ సినిమా ఫ్లాప్ కావడానికి ఇది కూడా ఒక కారణమన్న వాదన అప్పుడే మొదలైంది. ఆమిర్.. ట్రోలింగ్ గతంలో పీకే సినిమాలో ఇతర గ్రహం నుంచి భూమికి వచ్చిన పాత్రలో ఆమిర్ నట్టించారు. కళ్లను పెద్దవిగా చేసి, వెడల్పాటి చెవులతో చిత్రమైన హావభావాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తాజా సినిమాలోనూ ఇలాగే నటించారని కొందరు విమర్శిస్తుంటే.. సిక్కులను చిత్రీకరించిన తీరు బాలేదంటూ ఆ సామాజిక వర్గానికి చెందిన వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమిర్‌ను హిందు వ్యతిరేకిగా పేర్కొంటూ #BoycottLaalSinghChaddha హ్యాష్‌టాగ్‌తో ట్విటర్లో నెటిజనులు ట్రోల్ చేశారు. భారత సైన్యాన్ని అగౌరవపరిచారని మరి కొందరు అలిగారు. తన చిత్రాన్ని బహిష్కరించవద్దని ఆమిర్ ఖాన్ పబ్లిగ్గా కన్నీళ్లు పెట్టుకున్నా నిరసనకారులు శాంతించలేదు. అయితే బాయ్‌కాట్ బాలీవుడ్‌కు కొత్తేమి కాదు. గతంలోనూ, ఇప్పుడు కూడా పలు చిత్రాలు ఇలాంటి సమస్యలను ఎదుర్కొన్నాయి. గతంలో ఆమిర్‌ఖాన్ దంగల్, దీపికా పదుకోన్ పద్మావత్ సినిమాల విడుదల సమయంలోనూ ఇలాంటి ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. అయితే ఈ రెండు సినిమా ఘన విజయం సాధించడం విశేషం. అక్షయ్‌కు తప్పని తలనొప్పి ఇక లాల్ సింగ్ చద్దాతో పాటే విడుదలైన అక్షయ్ కుమార్ 'రక్షా బంధన్' సినిమా కూడా బహిష్కరణాస్త్రాన్ని ఎదుర్కొంది. ఈ సినిమా రచయిత్రి కనికా ధిల్లాన్ గతంలో హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో #BoycottRakshaBandhanMovie హ్యాష్‌టాగ్‌తో ట్విటర్లో ప్రచారం చేశారు. అయితే వివాదస్పద ట్వీట్లను తొలగించి నిరసనకారులను చల్లబరిచే ప్రయత్నం చేశారు కనికా ధిల్లాన్. సినిమాలు చూడొద్దంటూ ప్రచారం చేయడం సమంజసం కాదని హీరో అక్షయ్ కుమార్ కూడా విన్నవించుకున్నాడు. అయితే ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినట్టు తెలుస్తోంది. తాప్సి సినిమా చూడొద్దు అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన దొబారా మూవీని చూడొద్దంటూ సోషల్ మీడియాలో ప్రచారం షురూ అయింది. అనురాగ్, తాప్సి తీరు నచ్చని సంప్రదాయవాదులు ట్విటర్లో వారికి వ్యతిరేకంగా #CancelDobaaraa హ్యాష్‌టాగ్‌తో ట్రోలింగ్ చేస్తున్నారు. ఆగస్టు 19న విడుదలవుతున్న ఈ సినిమాను బాయ్‌కాట్ చేయాలని ట్విటర్ వేదికగా పిలుపునిస్తున్నారు. బాయ్‌కాట్ ప్రచారాన్ని అనురాగ్, తాప్సి చాలా తేలిగ్గా తీసుకున్నారు. (క్లిక్: 'పోకిరి' స్పెషల్ షో.. దిమ్మతిరిగే కలెక్షన్స్ వసూలు) ఒటీటీలనూ వదలడం లేదు అలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన డార్లింగ్స్ సినిమా ఆగస్టు 5న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఈ సినిమా కూడా బాయ్‌కాట్ ప్రచారాన్ని ఎదుర్కొంది. #BoycottAliaBhatt హ్యాష్‌టాగ్‌తో అలియా భట్‌పై అక్కసు వెళ్లగక్కారు కొంతమంది. పురుషులను కించేపరిచేలా సినిమా తీసిన అలియా భట్ని అందరూ బహిష్కరించాలని పిలుపునిచ్చారు. పురుషులపై గృహ హింస అనేది బాలీవుడ్‌కు నవ్వులాటగా ఉందని ఫైర్ అవుతున్నారు. గౌరీ ఖాన్, గౌరవ్ వర్మతో కలసి అలియా భట్ నిర్మించిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ప్రారంభ వారాంతంలోనే 10 మిలియన్లపైగా వాచ్ అవర్స్ నమోదు చేసి దూసుకుపోతోంది. (క్లిక్: ట్విటర్లో తెగ ట్రెండ్ అవుతున్న దిల్‌రాజు.. కారణమిదే!) `బ్రహ్మాస్త్ర`పై నిషేధాస్త్రం రణ్‌బీర్ కపూర్, అలియాభట్ జంటగా నటిస్తున్న `బ్రహ్మాస్త్ర` మూవీ ట్రైలర్ అలా రిలీజైందో లేదో వెంటనే బాయ్కాటర్లు రెడీ అయిపోయారు. #BycottBrahmastra ట్యాగ్‌తో వ్యతిరేక ప్రచారం మొదలెట్టేశారు. హీరో రణబీర్ కపూర్ హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించారని ట్విటర్ వేదికగా ఏకీపారేశారు. కాగా, ఈ సినిమాలో బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, నాగార్జున కీలక పాత్రల్లో కనిపించనున్నారు. (క్లిక్: ‘సీతారామం’ నేను చేయాల్సింది.. నాగార్జున) -
బాయ్‌ఫ్రెండ్ బర్త్‌డే.. రెచ్చిపోయిన డైరెక్టర్ కూతురు!
Aaliyah Kashyap With Boyfriend Shane: ‘‘నా ప్రియమైన సఖుడా.. 22వ పుట్టినరోజు శుభాకాంక్షలు! ఈ ప్రపంచంలోనే అత్యంత అదృష్టవంతురాలైన అమ్మాయిగా నన్ను మార్చావు. నిన్ను కలిసినందుకు నేనెంత సంతోషంగా ఉన్నానో నాకే తెలుసు! ఎల్లప్పుడూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను’’ అంటూ ప్రముఖ సినీ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కుమార్తె అలియా కశ్యప్ తన ప్రేమికుడు షేన్ గ్రెగోయిర్కు బర్త్‌డే విషెస్ తెలిపింది. ఈ సందర్భంగా అతడితో అత్యంత సన్నిహితంగా ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ క్రమంలో అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతుండగా.. కొంతమంది నెటిజన్లు మాత్రం అనురాగ్, అలియాను ఉద్దేశించి విపరీతపు కామెంట్లు చేస్తున్నారు. ‘‘అసలు నువ్వు ఏం అనుకుంటున్నావు అలియా? మీ నాన్న తీసే సినిమాలు బాగానే చూస్తున్నట్టున్నావు. అందుకే ఇలా తయారయ్యావు. ఆ ఫొటోలేంటి? దేనికైనా హద్దులు ఉంటాయి. అభిమానులతో అన్నీ పంచుకోవాల్సిన అవసరం ఉందంటావా? అనురాగ్ నువ్వేనా కాస్త చెప్పొచ్చు కదా’’ అంటూ ట్రోల్ చేస్తున్నారు. అయితే, ఆమె ఫాలోవర్లు మాత్రం.. ‘‘మీ జోడీ క్యూట్ ఉంది అలియా. ఎవరేమన్నా ఇలాగే ఉండండి. కలకాలం కలిసి ఉండండి’’ అంటూ మద్దతుగా నిలుస్తున్నారు. కాగా డేటింగ్ యాప్‌లో పరిచయమైన షేన్‌తో ప్రేమలో పడిన అలియా ఈ విషయాన్ని ఎప్పుడూ రహస్యంగా ఉంచలేదు. చదవండి: అవసరం లేకున్నా డైరెక్టర్ ఆ సీన్ తీశాడు! గతంలో ఓ యూట్యూబ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘‘నేనే ముందడుగు వేశాను. తన కోసం ఎంతగానో పరితపించిపోయాను. రెండు నెలలు మాట్లాడుకున్న తర్వాత తొలిసారి తనను కలిశాను. తను నన్ను ఎప్పుడెప్పుడు ముద్దు పెట్టుకుంటాడా అని ఎదురుచూశాను. అయితే, తను మాత్రం కాస్త సందేహించాడు. అందుకే, మాట్లాడుతుండగానే నేనే ధైర్యం చేసి ముద్దుపెట్టేశాను. తను అంటే నాకు అంతగా ఇష్టం ఏర్పడిపోయింది’’ అంటూ ప్రియుడిపై ప్రేమను చాటుకుంది. తండ్రితో అలియా కశ్యప్ ఇక గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్, బాంబే వెల్వెట్, మన్మర్జియాన్ వంటి పలు సినిమాల్లో భాగమైన అనురాగ్ కశ్యప్.. లస్ట్ స్టోరీస్, సాక్రెడ్ గేమ్స్ వంటి వెబ్‌సిరీస్‌లను తెరకెక్కించాడు. మొదటి భార్య ఆర్తీ బజాజ్ ద్వారా అతడికి కూతురు అలియా కశ్యప్ జన్మించింది. ఆమె తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి కొన్నాళ్లుగా అనురాగ్ ఇంట్లోనే ఉంటోంది. ఈ క్రమంలో బాయ్‌ఫ్రెండ్, వివాహానికి ముందే శృంగారం వంటి పలు అంశాల గురించి ఈ తండ్రికూతుళ్లు సంభాషించిన వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. చదవండి: ‘పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ’.. దర్శకుడిని ప్రశ్నించిన కుమార్తె View this post on Instagram A post shared by Aaliyah Kashyap (@aaliyahkashyap) -
లైంగిక వేధింపులు: దర్శకుడికి సమన్లు
ముంబై: లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌కు ముంబైలోని వెర్సోవా పోలీసులు బుధవారం సమన్లు పంపించారు. అనురాగ్ కశ్యప్ తనను లైంగికంగా వేధించారని నటి పాయల్ ఘోష్ ఆరోపించిన విషయం తెలిసిందే. మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించి మీటూ ఉద్యమం తరువాత అనురాగ్ కశ్యప్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. అయితే తనకు న్యాయం చేయాలంటూ పాయల్ ప్రధాని నరేంద్ర మోదీని కోరిన విషయం తెలిసిందే. పాయల్ ఘోష్ ఫిర్యాదు మేరకు ముంబైలోని వెర్సోవా పోలీస్ స్టేషన్లో పోలీసులు అనురాగ్‌పై కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగా రేపు (గురువారం) ఉదయం 11 గంటలకు పోలీసు స్టేషన్లో అనురాగ్ కశ్యప్ హాజరు కావాలని సమన్లలో పోలీసులు పేర్కొన్నారు. చదవండి: (రూపా దత్తా లైంగిక ఆరోపణలు : నిజమేనా?) ఇప్పటికే అనురాగ్‌పై ఐపీసీ సెక్షన్లు 376(ఐ), 354, 341, 342 సెక్షన్ల కింద కేసు నమోదయ్యింది. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరింత లోతుగా విచారణ చేయడానికి అనురాగ్‌కు బుధవారం సమన్లు పంపించినట్లు తెలుస్తోంది. ఇక 2013లో వెర్సోవాలోని యారి రోడ్డులో కశ్యప్ తనపై అత్యాచారం చేశారని ఇటీవల నటి పాయల్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏడేళ్ల క్రితం జరిగిన ఈ ఘటనపై విచారణలో భాగంగా అనురాగ్ కశ్యప్‌ను పోలీసులు విచారణ జరపనున్నారు. చదవండి: (అనురాగ్ కశ్యప్‌పై కేసు నమోదు) -
మతవిద్వేష దాడుల్ని ఆపండి!
కోల్‌కతా/న్యూఢిల్లీ: దేశంలో ముస్లింలు, దళితులు, ఇతర మైనారిటీలపై మతం ఆధారంగా జరుగుతున్న మూకహత్యలు, దాడులపై సినీపరిశ్రమతో పాటు వేర్వేరు రంగాలకు చెందిన 49 మంది ప్రముఖులు గళమెత్తారు. ఈ మూకహత్యలను వెంటనే అరికట్టేందుకు ప్రధాని మోదీ చర్యలు తీసుకోవాలని ప్రముఖ దర్శకులు మణిరత్నం, అదూర్ గోపాలకృష్ణన్, అనురాగ్ కశ్యప్, శ్యామ్‌బెనగల్ నటీనటులు అపర్ణాసేన్, కొంకణ్‌సేన్ శర్మ, రేవతి, సౌమిత్రో ఛటర్జీ, గాయని శుభా ముగ్దల్, ప్రముఖ చరిత్రకారుడు రామచంద్రగుహ, సామాజిక కార్యకర్త బినాయక్ సేన్, సామాజికవేత్త ఆశిష్ నంది సహా 49 మంది బహిరంగ లేఖ రాశారు. కోల్‌కతాలో నటి అపర్ణాసేన్ ఈ లేఖను మీడియాకు విడుదల చేశారు. అందులో.. ‘‘మోదీజీ.. మనదేశంలో ఇటీవల చోటుచేసుకుంటున్న దురదృష్టకరమైన సంఘటనలపై మేమంతా కలత చెందుతున్నాం. మనది శాంతికాముక దేశం. కానీ దేశంలో ముస్లింలు, దళితులు, ఇతర మైనారిటీ మతస్తులను చంపేస్తున్నారు. దీన్ని నిలువరించాలి. ఇటీవల నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) గణాంకాలు చూసి విస్తుపోయాం. ఎందుకంటే ఒక్క 2016లోనే దళితులపై 840 దాడి ఘటనలు నమోదయ్యాయి. 9 ఏళ్లలో మతవిద్వేష దాడులు అమాంతం పెరిగిపోగా, అందులో 62 శాతం మంది బాధితులు ముస్లింలే. 2009, జనవరి 1 నుంచి 2018 అక్టోబర్ 29 వరకూ దేశవ్యాప్తంగా 254 మత విద్వేష ఘటనలు నమోదుకాగా, వీటిలో 91 మంది చనిపోయారు. ఈ విద్వేషదాడుల్లో 90 శాతం 2014, మే తర్వాతే(మోదీ వచ్చాకే) నమోదయ్యాయి. ఈ నేరాల్లో శిక్షలు పడుతున్న కేసులు గణనీయంగా తగ్గిపోవడం ఇంకా దారుణం. మోదీజీ.. మీరు పార్లమెంటులో ఈ మూకహత్యలను ఖండించారు. కానీ అది మాత్రమే సరిపోదు. హత్య కేసుల్లో పెరోల్ లేకుండా జీవితఖైదు పడుతున్నప్పుడు అంతకంటే దారుణమైన మూకహత్యలకు అదే శిక్ష ఎందుకు వర్తించదు? ఇలాంటి ఘటనల్లో దోషులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఏ దేశంలో కూడా ప్రజలు భయంతో బతకకూడదు. మెజారిటీ ప్రజలు శ్రీరాముడిని ఆరాధిస్తారు. కానీ, ‘జై శ్రీరామ్’ రెచ్చగొట్టే యుద్ధ నినాదంగా మారిపోయింది. ఆయన పేరుతో హత్యలు చేయడానికి ఇది మధ్యయుగం కాదు. ప్రధానిగా ఈ దుశ్చర్యలను నిలువరించాలి. మతవిద్వేష దాడులతో శ్రీరాముడి పేరును అపవిత్రం చేయడం ఆపండి. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించిన వారిని దేశద్రోహులుగా, జాతివ్యతిరేకులుగా, అర్బన్ నక్సల్స్‌గా ముద్రవేయడం సరికాదు. అధికార పార్టీని విమర్శిస్తే∙దేశాన్ని వ్యతిరేకించినట్లు కాదు. ప్రజలు తమ అభిప్రాయాలను వెల్లడించే హక్కును రాజ్యాంగం కల్పిస్తోంది. ఎక్కడైతే భిన్నాభిప్రాయాన్ని, అసమ్మతిని వినిపించేందుకు అవకాశముంటుందో అదే బలమైన దేశంగా రూపుదిద్దుకుంటుంది’’ అని లేఖలో పేర్కొన్నారు. అందరూ సురక్షితమే: నఖ్వీ భారత్‌లో ముస్లింలు దళితులు సహా మైనారిటీలంతా సురక్షితంగా ఉన్నారని కేంద్ర మైనారిటీ శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తెలిపారు. మూకహత్యలు, మతవిద్వేష దాడుల్ని అరికట్టాలని 49 మంది దర్శకులు, నటులు, ఇతర కళాకారులు ప్రధాని మోదీకి రాసిన లేఖను ఆయన తప్పుపట్టారు. నేరాలకు మతం రంగు పులమడం సరికాదని వ్యాఖ్యానించారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎలాంటి మతఘర్షణలు చోటు చేసుకోలేదని గుర్తుచేశారు. ‘‘2014 ఎన్నికల తర్వాత ‘అవార్డు వాపసీ’ పేరుతో ఇలాంటి కార్యక్రమాన్నే మనమంతా చూశాం. ఇది దానికి పార్ట్–2 మాత్రమే. విద్వేష నేరాలు, మూకహత్యలను అరికట్టడానికి ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. కానీ తమనుతాము మానవ హక్కుల పరిరక్షకులుగా, లౌకికవాదానికి కస్టోడియన్లుగా చెప్పుకునే కొందరు ఈ నేరాలకు మతం రంగుపులిమే ప్రయత్నం చేస్తున్నారు’’ అని నఖ్వీ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
నవాజ్ కోసమే నటిస్తున్నా
దర్శకుడిగా హిందీలో ‘గ్యాంగ్స్ ఆఫ్ వసీపూర్, దేవ్ డి, మన్మర్జియా’ వంటి సూపర్‌హిట్ సినిమాలను అందించారు అనురాగ్ కశ్యప్. 2017లో యాక్టర్‌గా ‘ఇమైక్క నొడిగళ్’ అనే తమిళ చిత్రంలో నటించారు. తాజాగా నవాజుద్దీన్ సిద్ధిఖీ హీరోగా రూపొందుతున్న ‘బోలే చుడియా’లోనూ యాక్ట్ చేయనున్నారట. ఈ సినిమా ద్వారా నవాజుద్దీన్ సిద్ధిఖీ తమ్ముడు నవాబ్ సిద్దిఖీ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ సినిమాలో నటించడం గురించి అనురాగ్ కశ్యప్ మాట్లాడుతూ – ‘‘నన్ను ఇప్పటివరకూ నవాజుద్దీన్ ఏదీ అడగలేదు. తొలిసారి ఈ సినిమాలో యాక్ట్ చేయమని అడిగారు. అందుకే చేస్తున్నాను’’ అన్నారు. అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో నవాజుద్దీన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ వసీపూర్, రమన్ రాఘవన్’ సినిమాల్లో నటించారు. -
30న తెరపైకి ఇమైకా నొడిగళ్
తమిళసినిమా: అధర్వ, నయనతార, విజయ్‌సేతుపతి, రాశీఖన్నా, హిందీ దర్శకుడు అనురాగ్ కశ్యప్ వంటి ప్రముఖ నటీనటులు నటించిన మల్టీస్టారర్ చిత్రం ఇమైకా నొడిగళ్ భారీ అంచనాల మధ్య ఈ నెల 30వ తేదీన తెరపైకి రానుంది. క్యామియో ఫిలింస్ పతాకంపై సీజే. జయకుమార్ నిర్మించిన ఈ చిత్రానికి డిమాంటీ కాలనీ చిత్రం ఫేమ్ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించారు. హిప్హాప్ తమిళా సంగీతాన్ని, ఆర్డీ.రాజశేఖర్ ఛాయాగ్రహణం అందించిన ఈ చిత్ర వివరాలను తెలియజేయడానికి చిత్ర యూనిట్ బుధవారం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్‌ల్యాబ్‌లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సీఏ.జయకుమార్ మాట్లాడుతూ ఇది మల్టీస్టారర్ చిత్రం అని, రెండేళ్ల కఠిన శ్రమ, అవమానాలను దాటి ఈ నెల 30వ తేదీన విడుదల కానుందన్నారు. చిత్రంపై దర్శకుడి నమ్మకంతో విడుదలకు ఐదు రోజుల ముందు పత్రికల వారికి ప్రదర్శనను ఏర్పాటు చేయనున్నామన్నారు. ఇది యాక్షన్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. ఇందులో హిందీ నటుడు అనురాగ్ కశ్యప్ నటన యూత్‌ను బాగా ఆకట్టుకుంటుందన్నారు. అదే విధంగా అధర్వ, రాశీఖన్నాల జంట చాలా ఫ్రెష్‌గా అనిపిస్తుందని చెప్పారు. ఇక విజయ్‌సేతుపతి, నయనతారల సన్నివేశాలు అందరిని కంటతడి పెట్టిస్తాయని అన్నారు. చిత్రంలోని యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో తాము ఎలాంటి కాంప్రమైజ్ కాలేదన్నారు. పోరాట దృశ్యాలకు అవసరమైన వాటిని నిర్మాత నుంచి ఎలా అడిగి తీసుకోవాలో ఫైట్ మాస్టర్ స్టన్ శివకు బాగా తెలుసన్నారు. హిప్హాప్ తమిళా నేపథ్య సంగీతంతో కలిపి చిత్రాన్ని చూడడానికి తానూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని నిర్మాత అన్నారు. చిత్ర కథానాయకుడు అధర్వ మాట్లాడుతూ ఇమైకా నొడిగళ్ రోలర్ కోస్టర్ రైడ్ కంటే కష్టమైనదని, ఏమైనా ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా చేయాలని తాను దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు భావించామని అన్నారు. చాలా శ్రమ తరువాత నిర్మాత జయ్‌కుమార్ ఈ చిత్రంలోకి వచ్చారని తెలిపారు.ఆయన కథను నమ్మి ఖర్చు పెట్టారని తెలిపారు. నయనతార, అనురాగ్ కశ్యప్, ఛాయాగ్రాహకుడు ఆర్డీ.రాజశేఖర్ అంటూ తన ఫేవరేట్స్ లిస్ట్‌లో ఉన్న వారందరూ ఈ చిత్రంలో పనిచేయడం పెద్ద సర్ప్రైజ్ అని అన్నారు. ఈ చిత్ర ఆల్బమ్ తనకు చాలా నచ్చిందని అన్నారు. ఈ చిత్రంలో పోరాట దృశ్యాల్లో నటించడం మరచిపోలేని అనుభవం అని అధర్వ పేర్కొన్నారు. రాశీఖన్నా, సంగీతదర్శకుడు హిప్ హాప్ తమిళ, దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు పాల్గొన్నారు. -
తెలుగమ్మాయికి బాలీవుడ్ ఛాన్స్
మన తెలుగు నేల మీద పుట్టి.. ఇక్కడే పెరిగిన శోభిత ధూళిపాళ త్వరలో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. మిస్ ఇండియా ఎర్త్ కిరీటం గెలిచిన ఈ ముద్దగుమ్మ చాలా రోజులుగా వెండితెర అరంగేట్రం కోసం ఎదురుచూస్తోంది. అయితే తెలుగు తెర మీద ఈ అమ్మడి అవకాశాలు రాకపోయినా బాలీవుడ్ మాత్రం పిలిచి మరి అవకాశం ఇచ్చింది. త్వరలోనే ఓ బాలీవుడ్ మూవీతో వెండితెర మీద దర్శనమివ్వబోతుంది శోభిత. ఇప్పటికే ఫెమినా, మాండేట్, హై బ్లిట్జ్ లాంటి మేగజైన్ కవర్ పేజీల మీద దర్శనమిచ్చిన ఈ భామను అనురాగ్ కశ్యప్ బాలీవుడ్‌కు పరిచయం చేయబోతున్నాడు. వర్సటైల్ యాక్టర్ నవాజుద్ధీన్ సిద్ధీఖీ లీడ్ రోల్ లో నటిస్తున్న ఓ బయోగ్రఫికల్ డ్రామలో శోభిత హీరోయిన్ గా నటిస్తోంది. సంచలనం సృష్టించిన సైకో కిల్లర్ రమణ్ రాఘవన్ జీవితకథ ఆధారంగా రాఘవ్ 2.0 పేరుతో తెరకెక్కుతున్న సినిమాతో శోభిత వెండితెరకు పరిచయం అవుతోంది .