తెలుగమ్మాయికి బాలీవుడ్ ఛాన్స్ | miss india earth shobitha dhulipala introducing in bollywood | Sakshi
Sakshi News home page

తెలుగమ్మాయికి బాలీవుడ్ ఛాన్స్

Published Fri, Oct 9 2015 10:47 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

తెలుగమ్మాయికి బాలీవుడ్ ఛాన్స్ - Sakshi

తెలుగమ్మాయికి బాలీవుడ్ ఛాన్స్

మన తెలుగు నేల మీద పుట్టి.. ఇక్కడే పెరిగిన శోభిత ధూళిపాళ త్వరలో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. మిస్ ఇండియా ఎర్త్ కిరీటం గెలిచిన ఈ ముద్దగుమ్మ చాలా రోజులుగా వెండితెర అరంగేట్రం కోసం ఎదురుచూస్తోంది. అయితే తెలుగు తెర మీద ఈ అమ్మడి అవకాశాలు రాకపోయినా బాలీవుడ్ మాత్రం పిలిచి మరి అవకాశం ఇచ్చింది. త్వరలోనే ఓ బాలీవుడ్ మూవీతో వెండితెర మీద దర్శనమివ్వబోతుంది శోభిత.

ఇప్పటికే ఫెమినా, మాండేట్, హై బ్లిట్జ్ లాంటి మేగజైన్ కవర్ పేజీల మీద దర్శనమిచ్చిన ఈ భామను అనురాగ్ కశ్యప్ బాలీవుడ్కు పరిచయం చేయబోతున్నాడు. వర్సటైల్ యాక్టర్ నవాజుద్ధీన్ సిద్ధీఖీ లీడ్ రోల్ లో నటిస్తున్న  ఓ బయోగ్రఫికల్ డ్రామలో శోభిత హీరోయిన్ గా నటిస్తోంది. సంచలనం సృష్టించిన సైకో కిల్లర్ రమణ్ రాఘవన్ జీవితకథ ఆధారంగా రాఘవ్ 2.0 పేరుతో తెరకెక్కుతున్న సినిమాతో శోభిత వెండితెరకు పరిచయం అవుతోంది .

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement