
బంజారాహిల్స్: ఓ విద్యార్థి తనపై వేధింపులకు పాల్పడుతున్నట్లు ఓ విద్యార్థిని బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే..ఇందిరానగర్‌కు చెందిన బాలిక స్కూల్‌కు వెళ్లే క్రమంలో శ్రీనగర్ కాలనీలోని ప్రైవేట్ విద్యార్థి తరచూ ఆమె వెంటపడుతూ ప్రేమ పేరుతో వేధింపులకు పాల్పడ్డాడు. గత పది రోజులుగా మరో ఇద్దరు స్నేహితులతో కలిసి దారి కాచి అడ్డగిస్తూ ప్రేమించకపోతే యాసిడ్ పోసి చంపేస్తానంటూ బెదిరించసాగాడు. సోమవారం మరోసారి బెదిరింపులకు పాల్పడటంతో బాధితురాలు తల్లిదండ్రులతో కలిసి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీరి వేధింపులు తట్టుకోలేక చచ్చిపోవాలనిపిస్తోందంటూ పోలీసుల ముందే కన్నీరు మున్నీరైంది. పోలీసులు బాలుడితో పాటు అతడి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment