సాక్షి,హైదరాబాద్:కాంగ్రెస్ ప్రభుత్వం తమ నేతలపై అక్రమ కేసులు పెట్టడానికి నిరసనగా బీఆర్‌ఎస్ పార్టీ శుక్రవారం(డిసెంబర్6) ట్యాంక్‌బండ్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసనలకు పిలుపునిచ్చింది. బీఆర్‌ఎస్ కీలక నేతలతో పాటు పార్టీ శ్రేణులు భారీగా నిరసనకు హాజరవనున్నారు.ఈ నిరసన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు.
ముందు జాగ్రత్త చర్యగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో పాటు కీలక నేతలను వారి ఇళ్ల వద్దే హౌస్ అరెస్టులు చేస్తున్నారు.పార్టీ కార్యకర్తలను ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నారు. కాగా, గురువారం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కౌశిక్‌రెడ్డి, హరీశ్‌రావు, పల్లారాజేశ్వర్‌రెడ్డిలను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కౌశిక్‌రెడ్డికి అర్ధరాత్రి నాంపల్లి కోర్టు బెయిల్ ఇవ్వగా హరీశ్‌రావు, పల్లారాజేశ్వర్‌రెడ్డిలను పోలీసులు సాయంత్రం విడుదల చేశారు.
మాజీ మంత్రి హరీవ్‌రావు హౌస్ అరెస్టు..
మాజీ మంత్రి హరీశ్‌రావును కోకాపటలోని తన నివాసంలో పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.
ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్‌ఎస్ ధర్నాలో పాల్గొనకుండా అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా పోలీసులపై హరీశ్‌రావు ఫైర్
రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ ప్రకటించారు.
ధర్నాకు వెళ్లకుండా బీఆర్‌ఎస్ నాయకులను అడ్డుకోవడం అప్రజాస్వామికమని వ్యాఖ్య
ఎమ్మెల్సీ కవిత హౌస్ అరెస్ట్
ఎమ్మెల్సీ కవితన బంజారాహిల్స్‌లోని ఆమె నివాసంలో పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.
ధర్నాకు వెళ్లకుండా పోలీసులు కవితను అడ్డుకున్నారు.
కవిత ఇంటి ముందు భారీగా పోలీసులు మోహరించారు.
తెలంగాణభవన్‌కు చేరుకున్న కేటీఆర్.. భారీగా పోలీసులు
బీఆర్‌ఎస్ హైదారబాద్ నగర ఎమ్మెల్యేలను, నేతలను ఇళ్లలో నుంచి బయటికి రాకుండా పోలీసులు హౌస్ అరెస్టులు చేస్తున్నారు.
మరోపక్క తెలంగాణభవన్‌కు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేరుకున్నారు.
తెలంగాణభవన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ముందుగా తెలంగాణభవన్‌కు చేరుకుని ఇక్కడిక నుంచి ట్యాంక్‌బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నాకు వెళ్లాల్సి ఉంది.
కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద హౌస్ అరెస్ట్..
బీఆర్‌ఎస్ నిరసనకు వెళుతున్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానందను శుక్రవారం ఉదయమే పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కొంపల్లిలోని దండెమూడి ఎంక్లేవ్‌లోని కేపీ వివేకానంద్ ఇంటి ముందు పోలీసులు భారీగా మోహరించారు.
కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం హౌస్ అరెస్ట్
- ఏం తప్పు చేశామని హౌస్ అరెస్టు చేస్తున్నారని పోలీసులను ప్రశ్నించిన మాధవరం
- ప్రోటోకాల్ ప్రకారం అభివృధి కార్యక్రమాలకు పోలీసులను పిలిచానా స్పందించరు
- బీఆర్‌ఎస్ కార్పొరేటర్టు, నాయకులను మాత్రం హౌస్ అరెస్టు చేస్తారు
- ఉదయాన్నే పోలీసులు ఇంటికి వచ్చి తమ పనులకు వెళ్లకుండా.. అడ్డుకోవడం దారుణం
ముషీరాబాద్, అంబర్‌పేట ఎమ్మెల్యేల నిర్బంధం
ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌లను క్వార్టర్స్‌లోనే నిర్బంధించిన పోలీసులు
ఇదీ చదవండి: కౌశిక్‌రెడ్డి అరెస్టు..10 గంటల హైడ్రామా
Comments
Please login to add a commentAdd a comment