
కుప్పంలో గంగమ్మ వేషధారణలో టీడీపీ మహిళా నేతల సంబరాలు
కుప్పం(చిత్తూరు జిల్లా): చంద్రబాబు అరెస్ట్‌పై టీడీపీ నేతలు నిరసనల పేరిట చేపట్టిన కార్యక్రమాలు.. సంబరాల్నే మించిపోతున్నాయి. సాధారణంగా గ్రామాల్లో అమ్మవారి జాతరలో సంబరాలు జరుపుకొంటారు. మారెమ్మ, గంగమ్మ వేషధారణలతో వేపాకు చేతపట్టి.. అమ్మవారి రికార్డింగ్ పాటలతో డ్యాన్స్‌లు వేసి భక్తులను అలరింపజేస్తారు.అదే తరహాలో చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా కుప్పంలో శుక్రవారం ఆందోళన చేస్తున్న శిబిరం వద్ద.. తెలుగు మహిళలు వేపాకు చేతబట్టి.. అమ్మవారి వేషధారణలో రికార్డు డ్యాన్స్‌లతో మురిపింపజేశారు.
అటువైపు వెళుతున్న బాటసారులు ఆసక్తిగా వారి డ్యాన్సులను తిలకిస్తూ ముచ్చటపడ్డారు. స్థానికులు మాత్రం ఇదంతా నిరసన చేసినట్టు లేదని, సంబరాలు, విందు భోజనాలు చేస్తున్నట్టుందంటూ ముక్కున వేలేసుకోవడం కనిపించింది.
చదవండి: స్కిల్ కార్పొరేషన్‌కు, టీడీపీకి ఒకరే ఆడిటర్
Comments
Please login to add a commentAdd a comment