ఇవి పవన్‌ రగిల్చిన ఆగ్రహ జ్వాలలు | Volunteers angry over Janasena Chief Pawan Kalyan comments | Sakshi
Sakshi News home page

ఇవి పవన్‌ రగిల్చిన ఆగ్రహ జ్వాలలు

Published Wed, Jul 12 2023 4:52 AM | Last Updated on Wed, Jul 12 2023 7:50 AM

Volunteers angry over Janasena Chief Pawan Kalyan comments - Sakshi

కర్నూలులోని కల్లూరు చెన్నమ్మ సర్కిల్‌ వద్ద పవన్‌ దిష్టి బొమ్మను దహనం చేసి నిరసన తెలుపుతున్న వలంటీర్లు

సాక్షి నెట్‌వర్క్‌: వలంటీర్లపై పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యలను నిరసిస్తూ సచివాలయ సేవా సైన్యం రాష్ట్ర వ్యాప్తంగా భగ్గుమంటోంది. పవన్‌ తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుని బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేస్తూ రెండో రోజైన మంగళవారం కూడా వలంటీర్లు నిరసనలు చేపట్టారు. పవన్‌ దిష్టి బొమ్మలతో శవయాత్రలు, ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించారు. పవన్‌పై క్రిమినల్‌ చర్యలు తీసుకో వాలంటూ పోలీసులకు ఫిర్యాదులు చేశారు. 

గోదావరి జిల్లాల్లో తీవ్ర నిరసన
పవన్‌ వ్యాఖ్యలపై ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా ల్లో మంగళవారం నిరసనలు కొనసాగాయి. ఏలూరు ఫైర్‌స్టేషన్, 12 పంపుల సెంటర్లలో పవన్‌ దిష్టిబొ మ్మను దహనం చేశారు. టి.నరసాపురం, కొయ్యల గూడెం, ధర్మాజీగూడెం, జంగారెడ్డిగూడెం, ఉంగు టూరు, భీమడోలులో నిరసనలు చేపట్టారు. కైకలూరు, మండవల్లి, నర్సాపురం, ఉండి, కాళ్ల, ఆకివీడు, పాల కోడేరు మండలాల్లో నిరసన చేపట్టారు. తణుకులో పవన్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. కాకినాడ జిల్లా శంఖవరం, కత్తిపూడి, జి. కొత్తపల్లిలో పవన్‌ దిష్టి బొమ్మలను దహనం చేశారు. రౌతులపూడిలో వలంటీర్లు ర్యాలీ చేశారు.

కొత్తపల్లి మండలం ఉప్పాడ బీచ్‌ రోడ్డు సెంటర్‌లో దిష్టి బొమ్మను దహ­నం చేశారు. సామర్లకోట, పెద్దాపురంలో మాన­వహారం నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ, రాజానగరంలో ర్యాలీ చేశారు. వేమ­గిరి, నల్లజర్ల మండలం తూర్పు చోడవరం, దేవర­పల్లిలో దిష్టిబొమ్మను దగ్ధపరిచారు. కోనసీమ జిల్లా అమలాపురం, అల్లవరం, తాళ్లరేవు, కాట్రేనికోన, ఐ.పోలవరం, మండపేట, రాయవరం, రాజోలు, మామిడికు దు రు, ఆల­మూరు, కొత్తపేట, పి.గన్నవరం, అంబాజీ పేట, అయి­నవిల్లి మండలాల్లో నిరసనలు చేశారు. 

ఉత్తరాంధ్రలో నిరసన సెగలు
ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా నిరసనలు వెల్లు వె త్తాయి. సీతమ్మధారలోని నక్కవానిపాలెం వద్ద వలంటీర్లు నిరసన ప్రదర్శన చేశారు. తగరపువలసలో పవన్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. మధురవాడ వాంబే కాలనీలో పవన్‌ ఫొటోలను తగులబెట్టారు. ఆరిలోవ, ఎంవీపీ, త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో పవన్‌పై కేసులు నమోదు చేశారు. చినవాల్తేరు 20 వార్డు, అగనంపూడి, 69వ వార్డులో మానవహారం ఏర్పాటు చేశారు. అక్కయ్యపాలెం ఎన్‌జీవో కాలనీ, కంచరపాలెం నేతాజీ జంక్షన్‌లో నిరసన తెలిపారు. అనకాపల్లి జిల్లా మాడుగులలో ర్యాలీ నిర్వహించారు.

చోడవరం కొత్తూరు జంక్షన్, రావికమతం మండలం కొత్తకోటలో ఆందోళన చేశారు. మునగపాక మండల వలంటీర్లు ర్యాలీగా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అల్లూరి జిల్లా పాడేరు, అరకు, చింతపల్లి, రంపచోడవరం, రాజవొమ్మంగి వలంటీర్లు నిరసనలు చేశారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం, ఇ చ్ఛాపురం, ఆమదాలవలసలో పవన్‌ పై పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. విజయనగరం జిల్లా లోని నెల్లిమర్ల, గజపతి నగరం, రాజాం, ఎస్‌.కోట, బొబ్బిలి, కురుపాం, పార్వతీపురం, సాలూరు, పాల కొండ, వీరఘట్టం, భామిని మండల కేంద్రాల్లో నిరసన చేపట్టారు. పవన్‌ను అరెస్ట్‌ చేయాలంటూ సంతకవిటి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ప్రధాన రహదారిపై ర్యాలీ చేస్తున్న వలంటీర్లు   

కృష్ణా, గుంటూరు జిల్లాల్లో చెప్పు దెబ్బలు
కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని వలంటీర్లు కోనేరు సెంటర్‌లో పవన్‌ దిష్టి బొమ్మతో శవయాత్ర చేశారు. పవన్‌ దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టి దహనం చేశారు. ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడలోనూ ఆందోళనలు జరిగాయి. బాపట్ల జిల్లాలో పలుచోట్ల పవన్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. పిట్టలవానిపాలెం, కర్లపాలెం, వేమూరు, నిజాంపట్నం, బాపట్లలో ఆందోళనలు చేశారు.

నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో..
నెల్లూరు జిల్లా ఉదయగిరి, మనుబోలు మండలంలోని జట్లకొండూరు, చేజర్ల మండలం మాముడూరు, అనంసాగరం, మాముడూరు, అనంతసాగరం మండలం బొమ్మవరంలో పవన్‌ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ప్రకాశం జిల్లా దర్శి, యర్రగొండపాలెం, కనిగిరి, త్రిపురాంతకం, పెద్దారవీడు, పుల్లల చెరువు, బేస్తవారిపేట, తర్లుపాడు, కంభం, తాళ్లూరు, ముండ్లమూరు, వెలిగండ్ల, పీసీపల్లి, పామూరుల్లో నిరసన ప్రదర్శనలు చేశారు.

రాయలసీమలోనూ నిరసనల వెల్లువ
ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా వలంటీర్లు  నిరసనలు తెలిపారు. తాడిపత్రి, పెద్దవడుగూరు, బుక్కరాయసముద్రం, శింగనమల, గుంతకల్లు, రాప్తాడు, హిందూపురం, లేపాక్షి, మడకశిర, గోరంట్ల, పరిగి, చిలమత్తూరు, పెనుకొండ, కంబ దూరు, బొమ్మన హాళ్, కణేకల్లు, విడపనకల్లు, ధర్మవరం, ముదిగుబ్బ, బత్తలపల్లి, కదిరి, తనక ల్లు, ఓడీచెరువు, నల్లమాడ, అమడగూరు తదితర ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహించి పవన్‌ దిష్టిబొమ్మ లను దహనం చేశారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వలంటీర్ల నిరసనలు కొనసాగాయి.
శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో మానవహారంతో నిరసన తెలుపుతున్న వలంటీర్లు  

పలుచోట్ల పోలీస్‌ స్టేషన్‌లో పవన్‌పై ఫిర్యాదు చేశారు. ఉమ్మడి కర్నూలు జిల్లా పరిధిలోని వలంటీర్లు పవన్‌పై పోలీసులకు ఫిర్యాదులు చేశారు. కర్నూలులోని కల్లూరు చెన్నమ్మ సర్కిల్‌లో పవన్‌ దిష్టిబొమ్మకు చెప్పుల దండ వేసి తగులబెట్టారు. తుగ్గలి, ఆత్మకూరు, పాణ్యం, పోలూరులో పవన్‌ దిష్టి బొమ్మలు దగ్ధం చేశారు. పెద్దకడుబూరు, కౌతాళం, పత్తికొండ, రామాపురంల్లో నిరసనలు వెల్లువెత్తాయి. వైఎస్సార్‌ జిల్లా పులివెందుల, కమలాపురం, బద్వేలు, బ్రహ్మంగారి మఠం, ఎర్రగుంట్ల, చాపాడు తదితర ప్రాంతాల్లో వలంటీర్లు నిరసన తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement