ఢాకా: బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో ప్రభుత్వం కఠిన చర్యలు మొదలు పెట్టింది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ఇప్పటికే దేశవ్యాప్త కర్ఫ్యూ విధించిన ప్రభుత్వం తాజాగా కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు జారీ చేసింది.
ప్రభుత్వ ఉద్యోగాల రిజర్వేషన్ల విధానంలో మార్పులు తీసుకురావాలని దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారి ఇప్పటికే 133 మంది ప్రాణాలు కోల్పోయారు.
1000 మందిదాకా పౌరులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సరిహద్దుదాటి భారత్‌లో ప్రవేశించినట్లు సమాచారం. దేశంలో ఉద్రిక్త పరిస్థితుల మధ్య ప్రధాని షేక్‌హసీనా తన విదేశీ పర్యటనను రద్దు చేసుకున్నారు. శాంతిభద్రతలను అదుపులోకి తీసుకురావడానికి అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆమె ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment