shoot at sight orders
-
Pakistan: ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారుల నిరసనలు.. కనిపిస్తే కాల్చివేతకు ప్రభుత్వ ఆదేశం
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు షాబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి తలనొప్పిగా తయారయ్యారు. ఖాన్‌ను జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ‘పాకిస్థాన్ తెహ్రీక్-ఈ-ఇన్సాఫ్’ (పీటీఐ) కార్యకర్తలు పెద్ద ఎత్తున ఉద్యమం ప్రారంభించారు.దేశం నలుమూలలకు చెందిన పీటీఐ కార్యకర్తలు నిరసనలు చేపడుతూ రాజధాని ఇస్లామాబాద్‌కు చేరుకుంటున్నారు. దీంతో అక్కడ పరిస్థితి అదుపు తప్పుతోంది. చాలా చోట్ల హింసాత్మక ఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి. ఇమ్రాన్ ఖాన్ ఆదేశాలతో అతని పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ ‘డూ ఆర్ డై’ నిరసనను నిర్వహించడానికి రాజధానికి తరలి వెళుతున్నారు.ఇప్పటికే పలువురు పీటీఐ నేతలు, కార్యకర్తలు ఇస్లామాబాద్ నగరంలోనికి ప్రవేశించారు. ఈ నేపధ్యంలో ప్రభుత్వం ఇస్లామాబాద్‌ను రెడ్ జోన్‌గా ప్రకటించింది. ఇక్కడ పాక్ సైన్యాన్ని భారీ ఎత్తున మోహరించారు. ఈ రెడ్ జోన్ లోపల ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధానమంత్రి నివాసం, పార్లమెంట్, రాయబార కార్యాలయం ఉన్నాయి. ఈ రెడ్‌జోన్‌లో ఎవరైనా నిరసనకారులు కనిపిస్తే, వెంటనే వారిని కాల్చివేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు పెద్ద సంఖ్యలో ఇస్లామాబాద్‌లోకి ప్రవేశించడంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు పాకిస్తాన్ తెహ్రీక్-ఈ-ఇన్సాఫ్ నేతలు అడియాలా జైలులో ఇమ్రాన్ ఖాన్‌ను కలుసుకున్నారు. ఖాన్ గత సంవత్సరం నుండి రావల్పిండిలోని అడియాలా జైలులో ఉన్నారు. అతనిపై 200కు పైగా కేసులు నమోదయ్యాయి. వాటిలో కొన్నింటిలో ఖాన్‌కు బెయిల్ లభించగా, కొన్నింటిలో ఆయన దోషిగా తేలాడు. మరికొన్నింటిపై విచారణ జరుగుతోంది.ఇది కూడా చదవండి: మహారాష్ట్ర సీఎం పదవికి ఏక్నాథ్ షిండే రాజీనామా -
బంగ్లాదేశ్: కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు జారీ
ఢాకా: బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో ప్రభుత్వం కఠిన చర్యలు మొదలు పెట్టింది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ఇప్పటికే దేశవ్యాప్త కర్ఫ్యూ విధించిన ప్రభుత్వం తాజాగా కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగాల రిజర్వేషన్ల విధానంలో మార్పులు తీసుకురావాలని దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారి ఇప్పటికే 133 మంది ప్రాణాలు కోల్పోయారు. 1000 మందిదాకా పౌరులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సరిహద్దుదాటి భారత్‌లో ప్రవేశించినట్లు సమాచారం. దేశంలో ఉద్రిక్త పరిస్థితుల మధ్య ప్రధాని షేక్‌హసీనా తన విదేశీ పర్యటనను రద్దు చేసుకున్నారు. శాంతిభద్రతలను అదుపులోకి తీసుకురావడానికి అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆమె ఆదేశించారు. -
ఉత్తరాఖండ్‌లో ఉద్రిక్తత
హల్ద్వానీ: ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీ పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రభుత్వ స్థలంలో అనుమతి లేకుండా నిర్మించిన మదరసా కూల్చివేతకు స్థానిక యంత్రాంగం ప్రయత్నించడం ఇందుకు కారణం. ఈ సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. పలు వురు తీవ్రంగా గాయపడ్డారు. పరిస్థితు లను అదుపులోకి తెచ్చేందుకు అధికారులు పట్టణంలో కర్ఫ్యూ విధించడంతోపాటు కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేశారు. పట్టణంలోని బన్భూల్పూర్ ప్రాంతంలో మదరసా, ప్రార్థనలకు వినియోగించే ఒక నిర్మాణం ఉన్నాయి. ప్రభుత్వ స్థలంలో అనుమతి లేకుండా కట్టిన ఆ నిర్మాణాలను కూల్చివేసేందుకు గురువారం సాయంత్రం మున్సిపల్ సిబ్బంది ప్రయత్నించారు. పోలీసు బందోబస్తు నడుమ కూల్చివేత ప్రక్రియ మొదలైంది. అరగంటలోపే భారీ సంఖ్యలో జనం అక్కడికి చేరుకున్నారు. కొందరు చుట్టుపక్కల భవనాలపైకెక్కి మున్సిపల్ సిబ్బంది, పోలీసులపైకి రాళ్లు రువ్వడం ప్రారంభించారు. సంఘటన స్థలంలో గుమికూడిన వారు రాళ్లు, కర్రలు, పెట్రోలు బాంబులు, దేశవాళీ తుపాకులతో అధికారులు, సిబ్బందిని ఆగ్రహంతో ప్రశ్నిస్తూ దాడికి యత్నించారు. వారిని పోలీసులు చెదరగొట్టారు. ఆందోళనకారుల ఒక గుంపు వెంటబడగా పోలీసులు సమీపంలోని పోలీస్‌స్టేషన్ లోపలికి వెళ్లారు. అక్కడికి చేరుకున్న గుంపు పెద్ద సంఖ్యలో ద్విచక్ర వాహనాలకు నిప్పుపెట్టింది. పోలీస్ స్టేషన్‌కు సైతం నిప్పుపెట్టేందుకు ప్రయత్నించగా లోపలున్న పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరపాల్సి వచ్చిందని నైనిటాల్ జిల్లా మేజిస్ట్రేట్ వందనా సింగ్ చెప్పారు. పోలీస్ స్టేషన్‌తోపాటు సిబ్బందిపై దాడికి యత్నించినట్లు గుర్తించిన సుమారు 20 మందిలో నలుగురిని అరెస్ట్ చేసి, మూడు ఎఫ్ఐఆర్లు నమోదు చేశామన్నారు. మృతి చెందిన ఆరుగురిలో ముగ్గురికి బుల్లెట్ గాయాలు, మరో ముగ్గురికి ఇతర గాయాల య్యాయని చెప్పారు. క్షతగాత్రులైన 60 మందిలో చాలా మంది ప్రాథమిక చికిత్స అనంతరం ఇళ్లకు వెళ్లిపోయారని ఎస్పీ(సిటీ) హర్బన్స్ సింగ్ చెప్పారు. ఒక జర్నలిస్ట్ సహా గాయపడిన ఏడుగురు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారన్నారు. -
మణిపూర్‌లో భీకర హింస
ఇంఫాల్: మణిపూర్‌లో హింస ప్రజ్వరిల్లింది. తమకు షెడ్యూల్డ్ కులాల(ఎస్టీ) హోదా కల్పించాలని రాష్ట్ర జనాభాలో 53 శాతం ఉన్న మైతీ వర్గం డిమాండ్ చేయడం అగ్గి రాజేసింది. గిరిజనులు భగ్గుమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఇళ్లు, దుకాణాలు, వాహనాలకు నిప్పుపెట్టారు. ప్రార్థనా మందిరాలపై దాడి చేశారు. గిరిజనేతరులతో ఘర్షణకు దిగారు. ఈ హింసాకాండలో పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి 55 పటాలాల సైన్యంతోపాటు అస్సాం రైఫిల్స్ జవాన్లను ప్రభుత్వం గురువారం రంగంలోకి దించింది. మరో 14 పటాలాల సైన్యాన్ని సిద్ధంగా ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. మైతీ వర్గం అధికంగా ఉన్న దక్షిణ ఇంఫాల్, కాక్చింగ్, థౌబాల్, జిరిబామ్, బిష్ణుపూర్ జిల్లాలతోపాటు గిరిజన ప్రాబల్యం కలిగిన చురాచాంద్‌పూర్, కాంగ్పోక్పీ, తెంగౌన్పాల్ జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. రాష్ట్రవ్యాప్తంగా మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. చురాచాంద్‌పూర్, మంత్రిపుఖ్రీ, లాంఫెల్, కొయిరంగీ, సుగ్ను తదితర ప్రాంతాల్లో అస్సాం రైఫిల్స్ జవాన్లు ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించారు. సమస్మాత్మక ప్రాంతాల్లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్(ఆర్ఏఎఫ్) సిబ్బంది మోహరించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్.బీరెన్ సింగ్‌తో ఫోన్లో మాట్లాడారు. తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రమంతటా పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఎప్పుడేం జరుగుతుందో తెలియక అందోళన చెందుతున్నారు. అధికారులు ఇప్పటిదాకా 9,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బాధితులకు ఆశ్రయం కల్పిస్తున్నారు. ఘర్షణలను నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం ‘కనిపిస్తే కాల్చివేత’ ఉత్తర్వులు జారీ చేసింది. అక్రమ వలసల వల్లే.. మైతీలు ప్రధానంగా మణిపూర్ లోయలో నివసిస్తున్నారు. మయన్మార్, బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసల కారణంగా తాము ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నామని, తమకు ఎస్టీ హోదా కల్పించాలని వారు కోరుతున్నారు. వలసదారుల నుంచి గిరిజనులకు చట్టప్రకారం కొన్ని రక్షణలు ఉన్నాయి. మైతీలకు ఎస్టీ హోదాపై రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సును నాలుగు వారాల్లోగా కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని గత నెలలో మణిపూర్ హైకోర్టు సూచించింది. దీనిపై గిరిజనులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అపార్థం వల్లే అనర్థం: సీఎం రాష్ట్రంలో శాంతి భద్రతలకు ప్రజలంతా సహకరించాలని ముఖ్యమంత్రి ఎన్.బీరెన్ సింగ్ విజ్ఞప్తి చేశారు. అమాయకులు మృతి చెందడం, ఆస్తులు ధ్వంసం కావడం బాధాకరమని పేర్కొన్నారు. కేవలం అపార్థం వల్లే ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగిందని చెప్పారు. రాష్ట్రంలో శాంతిని నెలకొల్పేందుకు అన్ని చర్యలూ చేపట్టామని తెలిపారు. మణిపూర్‌లో హింసాకాండపై పొరుగు రాష్ట్రం మిజోరాం ముఖ్యమంత్రి జోరాంథాంగా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో త్వరగా శాంతి నెలకొనాలని ఆకాంక్షించారు. గిరిజన సంఘీభావ యాత్ర గిరిజనేతరులైన మైతీ వర్గానికి ఎస్టీ హోదా కల్పించాలన్న డిమాండ్‌ను వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా 10 జిల్లాల్లో ఆల్ ట్రైబల్ స్టూడెంట్ యూనియన్ మణిపూర్(ఏటీఎస్యూఎం) ఆధ్వర్యంలో గిరిజనులు బుధవారం ‘గిరిజన సంఘీభావ యాత్ర’ నిర్వహించారు. ఈ సందర్భంగా మైతీలకు, గిరిజనులకు నడుమ ఘర్షణ మొదలయ్యింది. రాత్రికల్లా తీవ్రస్థాయికి చేరింది. హింస చోటుచేసుకుంది. తొలుత చురాచాంద్‌పూర్ జిల్లాలో మొదలైన ఘర్షణ, హింసాకాండ క్రమంగా రాష్ట్రమంతటికీ విస్తరించింది. -
లంకలో సంచలన ఆదేశాలు: కనిపిస్తే కాల్చివేతే
కొలంబో: రాజకీయ సంక్షోభంతో శ్రీలంకలో మరోసారి అలజడి చెలరేగింది. నిరసనకారులు ప్రభుత్వంపై వ్యతిరేక గళాన్ని బలంగా వినిపిస్తున్నారు. పరిస్థితి అదుపు తప్పడంతో బుధవారం(జులై 13న) ఎమర్జెన్సీ విధించింది అక్కడి ప్రభుత్వం. మరోవైపు లంకలో టీవీ ప్రసారాలు సైతం నిలిచిపోయాయి. బుధవారం(జులై 13) అధ్యక్ష పదవికి రాజీనామా సమర్పిస్తానని చెప్పిన గోటబయ రాజపక్స.. దొంగతనంగా మాల్దీవులకు పారిపోయాడన్న కథనాలు పౌర ఆగ్రహానికి కారణం అయ్యాయి. ఈ క్రమంలో.. ఈసారి ప్రధాని కార్యాలయం మీద విరుచుకుపడ్డారు నిరసనకారులు. ప్రధాని కార్యాలయాన్ని వాళ్లు తమ అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో పరిస్థితిని అదుపు చేయడానికి శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడు, ప్రధాని రణిల్ విక్రమసింఘే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై మిలిటరీ, పోలీసులతో చర్చలు జరుపుతున్నారు. నిరసనకారులపై కనిపిస్తే కాల్చివేయాలనే సంచలన నిర్ణయానికి వచ్చారు. మే 10వ తేదీన కూడా దాదాపు ఇలాంటి ఆదేశాలే జారీ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చింది అక్కడి ప్రభుత్వం. ఇప్పటికే తన ఒక్కగానొక్క ఇంటికి నాశనం చేశారని బాధలో ఉన్న ప్రధాని రణిల్ విక్రమసింఘేకు.. తాజా పరిణామాలు మరింత అసహనానికి గురి చేస్తున్నాయి. దీంతో షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్‌కే మొగ్గు చూపారు. ఈ సాయంత్రంలోగా అధికారాలపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సుమారు 22 మిలియన్ల(2 కోట్ల 10 లక్షల దాకా) జనాభా ఉన్న శ్రీలంక నెలల తరబడి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కుటుంబ పాలనతోనే సర్వనాశనం అయ్యిందన్న వైఖరితో ఉన్న అక్కడి ప్రజలు.. రాజపక్స కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని పోరాడుతున్నారు. -
లేదు.. అలాంటి ఆదేశాలు ఇవ్వలేదు: శ్రీలంక ప్రధాని
కొలంబో: హిందూ మహాసముద్ర ద్వీప దేశంలో తీవ్ర సంక్షోభం ఇప్పుడప్పుడే కొలిక్కి వచ్చే అవకాశం కనిపించడం లేదు. శాంతియుతంగా సాగిన నిరసనలను.. దిగిపోయే ముందర తీవ్ర ఉద్రిక్తంగా మార్చేశాడు గత ప్రధాని మహింద రాజపక్స. అయితే నిరసనకారుల మీద మానవ హక్కుల ఉల్లంఘన ఆదేశాలు జారీ అయ్యాయంటూ ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ క్రమంలో.. కొత్త ప్రధాని రణిల్ విక్రమసింఘే స్పందించారు. నిరసనకారుల మీద కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేసిందన్న వాదనను ఆయన తోసిపుచ్చారు. మే 10వ తేదీన శ్రీలంక రక్షణ శాఖ తన త్రివిధ దళాలకు.. దోపిడీలకు, దాడులకు, విధ్వంసాలకు పాల్పడే నిరసనకారుల మీద కనిపిస్తే కాల్చి వేత ఉత్తర్వులు జారీ చేసింది. మహింద రాజపక్స అనుచరణ గణం మీద, వాళ్ల ఆస్తుల మీద దాడుల నేపథ్యంలోనే ఈ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై అంతర్జాతీయ స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. అయితే అలాంటి లిఖితపూర్వక ఆదేశాలు ఏం జారీ కాలేదని, సాధారణంగా పోలీసులకు తప్పనిసరి పద్ధతుల్లో.. అదీ పద్ధతి ప్రకారం కాల్పులకు దిగే అవకాశం ఉంటుందని, అంతేగానీ, నిరసనకారులపై కాల్పులు జరపమని ఎలాంటి ఆదేశాలు ప్రభుత్వం తరపున వెలువడలేదని ప్రధాని విక్రమసింఘే గురువారం పార్లమెంట్లో స్పష్టం చేశారు. అయితే రక్షణ మంత్రిత్వ శాఖ మాత్రం మరోలా చెబుతోంది. హింసాత్మక ఘటనలు మరింతగా పెరగకుండా ఉండేందుకే అలాంటి ఆదేశాలు ఇచ్చినట్లు చెప్తుండడం గమనార్హం. దీంతో ప్రభుత్వం, సైన్యం మధ్య సమన్వయ లోపం బయటపడినట్లయ్యింది. -
లంకలో షూట్ ఎట్ సైట్ ఆదేశాలు
Sri Lanka's Secretary to the Defence Ministry clarified: శ్రీలంకలోని తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఘోరమైన హింసాకాండకు దారితీసింది. నెలలు తరబడి సాగుతున్న అల్లర్లు కాస్తా హింసాత్మకంగా మారిపోతున్నాయి. తొలుత శాంతియుతంగా నిరసనలు చేస్తున్నవారిపై రాజపక్స కుటుంబ సభ్యులు దాడి చేయడంతోనే పరిస్థితి మరింత తీవ్రతరంగా మారింది. దీంతో శ్రీలంక అధికారులు మంగళవారం పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు షూట్ఎట్సైట్ ఆర్డర్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు శ్రీలంక రక్షణ మంత్రిత్వశాఖ సెక్రటరీ జనరల్ జీడీహెచ్ కమల్ గుణరత్నే అసలు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకోవల్సి వచ్చిందో వివరించారు. ఆయన మాట్లాడుతూ..."తొలుత పరిస్థితిని అదుపులో ఉంచేందుకు కట్టుదిట్టమైన కర్ఫ్యూను విధించినప్పటికీ వాటన్నింటిని ఉల్లంఘించి మరీ హింసకు పాల్పడటంతో ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు. ఘోరమైన హింసకు పాల్పడినవారందరూ లంకేయులే. మా సొంత వ్యక్తుల పై కాల్పులు జరపడం ఇష్టం లేదు. అయితే తాము మొదటగా నిరసనకారులను చెదరగొట్టేందుకు గాలిలో కాల్పులు జరుపుతాం. అయినప్పటికీ వినకపోతే పోలీసులు వారి మోకాళ్ల పై కాల్పులు జరుపుతారు. ఇక అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోతే సైన్యం రంగంలోకి దిగుతుంది. అయినా శ్రీలంక అధ్యక్షుడు మహిందా రాజపక్స మంచి నాయకుడు. ఇప్పుడు ఆయనపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయని రక్షణ కల్పించకూడదని అర్థం కాదు. శ్రీలంక రాజ్యాంగం ప్రకారం ఏ మాజీ ప్రెసిడెంట్కైనా అతని మరణం వరకు భద్రతా బలగాలు రక్షణ కల్పిస్తాయి. మా రక్షణ బృందం అమాయకులపై ఎప్పటికీ కాల్పులు జరపదు. అని అన్నారు. (చదవండి: లంక కల్లోలం: కొంప ముంచిన మహీంద రాజపక్స మీటింగ్! ఆ గంటలో జరిగింది ఇదే..) -
దొంగలు కనిపిస్తే కాల్చివేత
నెల్లూరు(క్రైమ్): ప్రయాణికుల భద్రతే లక్ష్యం.. రైళ్లలో దొంగలు కనిపిస్తే కాల్చివేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలందాయని నెల్లూరు రైల్వే డీఎస్పీ ఆంజనేయులు పేర్కొన్నారు. గురువారం రైల్వే డీఎస్పీ నూతన కార్యాలయ భవనంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వేసవి దృష్ట్యా రైళ్లలో దొంగతనాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రధానంగా ఉత్తరప్రదేశ్, బిహార్, మహారాష్ట్రకు చెందిన ముఠాలు దోపిడీలు, దొంగతనాలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. ఈ ముఠాలు కనిపిస్తే కాల్చివేస్తామన్నారు. ఇందుకోసం రెండు ప్రత్యేక బృందాలను సైతం డివిజన్‌కు కేటాయించారన్నారు. బృందాలు నెల్లూరు, ఒంగోలులోని జీఆర్పీఎఫ్, ఆర్పీఎఫ్ సిబ్బందితో కలిసి రైళ్లల్లో గస్తీలు నిర్వహిస్తారని తెలిపారు. నెల్లూరు మీదుగా ప్రయాణించే ప్రతి రైల్లో రాత్రి వేళల్లో ఈ బృందాలు ఎక్కి బోగీలన్ని పరిశీలిస్తూ అనుమానితులను అదుపులోకి తీసుకుంటాయన్నారు. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని చెప్పారు. జిల్లాలో తలమంచి, మనుబోలు, వెందోడు, ప్రకాశం జిల్లాలో సూరారెడ్డిపాళెం, ఉప్పగుంటూరు, సింగరాయకొండ, తెట్టు ప్రాంతాల్లో దొంగలు చేతివాటం ప్రదర్శించేందుకు వీలుగా ఉంటుందన్నారు. అందుకు రైలుమార్గం ప్రధాన రహదారులకు దగ్గరగా ఉండటమేకారణమన్నారు. దొంగలు దొంగతనాలకు పాల్పడి రహదారులపైకి చేరుకుని పరారవుతున్నారన్నారు. దీనికోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిఘా ఉంచామన్నారు. ప్రయాణికుల రక్షణ బాధ్యత రైల్వే పోలీసులపై అధికంగా ఉన్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ప్రయాణికులకు పూరిస్థాయి భరోసా కల్పిస్తామని స్పష్టం చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఇప్పటికే రైళ్లలో జరుగుతున్న నేరాలను కట్డడి చేశామన్నారు. పలు కేసుల్లో నిందితులను అరెస్ట్ చేశామన్నారు. వేసవి దృష్ట్యా ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలనీ ఎవరైనా అనుమానాస్పద వ్యక్తలు సంచరిస్తే డయల్ 100కు లేదా రైల్వే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. సమావేశంలో జీఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ జి.దశరథరామారావు పాల్గొన్నారు. -
కనిపిస్తే కాల్చివేత.. రూమర్లు నమ్మొద్దు
రోహ్టక్:రేప్ కేసులో గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు నేడు శిక్షలు ఖరారు కానున్న నేపథ్యంలో పంచకుల, సిస్రా తరహా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని హర్యానా ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేసినట్లు రోహ్టక్ జిల్లా కలెక్టర్ అతుల్ కుమార్ ప్రకటించారు. ఆదివారం సాయంత్రం ఉన్నత స్థాయి భేటీ అనంతరం ఈ నిర్ణయం వెల్లడించారు. ‘రోహ్టక్లో ఎవరైనా సరే శాంతి భద్రతలకు భంగం కలిగించాలని ప్రయత్నిస్తే ముందు హెచ్చరిక జారీ చేస్తాం. అయినా కవ్వింపు చర్యలకు పాల్పడినా, ఎవరికైనా హని తలపెట్టినా, ఆత్మహత్యాయత్నం లాంటివి చేసినా కాల్చివేయటం జరుగుతుంది. ఈ విషయంలో చాలా కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నాం’ అని అతుల్ తెలిపారు. హైకోర్టు సూచనల మేరకే తాము నడుచుకుంటామని ఆయన అన్నారు. ఇక గుర్మీత్ ఉన్న సునారియ జైలు చుట్టుపక్కల మొత్తం 23 పారామిలటరీ భద్రత దళాలను మోహరించి పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు అతుల్ తెలిపారు. అత్యవసరం అయితే తప్ప ప్రజలు కూడా బయటికి రావొద్దని, మీడియాకు కూడా పలు సూచనలు చేశామని ఆయన చెప్పారు. హెలికాఫ్టర్ ద్వారా న్యాయమూర్తి జగ్దీప్ సింగ్ జైలుకు చేరుకోనున్నారు. మధ్యాహ్నాం 2 గంటల 30 నిమిషాల సమయంలో తీర్పు వెలువడే అవకాశం ఉందని సమాచారం. ఆ వార్త నిజం కాదు: ఢిల్లీ పోలీసు శాఖ న్యూఢిల్లీ: రామ్ రహీమ్ సింగ్ శిక్ష ఖరారు నేపథ్యంలో ఢిల్లీలో అలర్ట్ ప్రకటించిన విషయాన్ని ఢిల్లీ పోలీస్ శాఖ ఖండించింది. విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారని, ట్రాఫిక్‌ను దారి మళ్లీంచారని వాట్సాప్ లో రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీస్ పీఆర్వో మధుర్ వర్మ సోమవారం ఉదయం మీడియాతో మాట్లాడారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలంతా ఉత్తవేనని మధుర్ తేల్చేశారు. అయితే అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం మాత్రం చేసినట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఇక మీడియాపై దాడుల నేపథ్యంలో వారికి పోలీసులతో రక్షణ కల్పించినట్లు మధుర్ తెలిపారు. -
'ఆ గ్యాంగ్‌లు కనిపిస్తే కాల్చిపారేయండి'
కర్నూలు: పొరుగున ఉన్న కర్ణాటకతోపాటు అనంపురం జిల్లా గుంతకల్లులో నివాసముంటున్న ఇరానీ బందిపోటు గ్యాంగ్‌లు హల్చల్ చేస్తున్నాయి. దోపిడీలు, దొంగతనాలతో రెచ్చిపోతున్న ఈ గ్యాంగులు కర్నూలు జిల్లాలోకి ప్రవేశించడంతోనే కాల్చిపారేయాలని జిల్లా పోలీసులు గురువారం ఆదేశాలు ఇచ్చారు. ఇరానీ బందిపోటు గ్యాంగులకు సంబంధించి కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీచేసినట్టు కర్నూలు జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ తెలిపారు. ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ.. సుమారు ఐదు గ్యాంగ్‌లు జిల్లాలోని ముఖ్య పట్టణాల్లో సంచరిస్తున్నట్లు తమకు సమాచారం వచ్చిందన్నారు. ఏఆర్ అడిషనల్ ఎస్పీ రాధాకృష్ణ నేతృత్వంలో ఐదుగురు పోలీసులకు ప్రత్యేక తర్ఫీదునిచ్చి ఆయుధాలతో గస్తీ విధులకు నియమించామని తెలిపారు. సీసీఎస్ పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి అనంతపురం, బళ్లారి ప్రాంతాల్లో దొంగల కోసం గాలిస్తున్నారన్నారు. నేర నివారణ కోసం సుమారు 70 మంది పోలీసులతో గస్తీ పెంచామని చెప్పారు.