Telangana Constable Candidates Protest At TS Secretariat Against GO No.46 - Sakshi
Sakshi News home page

Constable Candidates Protests: తెలంగాణ సచివాలయం వద్ద ఉద్రిక్తత

Published Wed, Jul 26 2023 1:38 PM | Last Updated on Wed, Jul 26 2023 1:58 PM

Constable Candidates Protest At Telangana Secretariat - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ సచివాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. కానిస్టేబుల్‌ అభ్యర్థులు నూతన సెక్రటేరియట్‌ను ముట్టడించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా జీవో నెంబర్‌ 46ను రద్దు చేయాలంటూ కానిస్టేబుల్‌ అభ్యర్థులు డిమాండ్‌ చేశారు. 

కాగా, కానిస్టేబుల్‌ అభ్యర్థులు బుధవారం మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా సచివాలయం గేటు వద్దకు దూసుకొచ్చారు. ఈ క్రమంలో సెక్రటేరియల్‌ గేటు ముందు బైఠాయించి జీవో నెంబర్‌ 46ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. దీంతో, తక్షణమే అలర్ట్‌ అయిన పోలీసులకు, అభ్యర్థులకు మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం.. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  ఈ సందర్భంగా కానిస్టేబుల్‌ అభ్యర్థులు మాట్లాడుతూ.. రిక్రూట్‌మెంట్‌ను పాత పద్దతితోనే చేపట్టాలని, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. జీవో 46 వల్ల తాము తీవ్రంగా నష్టపోతామని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. 

ఇది కూడా చదవండి: కేసీఆర్‌కు అన్ని విషయాలు తెలుసు: జలగం వెంకట్రావ్‌ కీలక వ్యాఖ్యలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement