హైదరాబాద్: ‘ఛలో సచివాలయం’కు బెటాలియన్ కానిస్టేబుల్స్ పిలుపునివ్వడంతో సచివాలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. సచివాలయం వద్ద భారీ భద్రత ఏర్పాటు చేసి బెటాలియన్ కానిస్టేబుల్స్ నిరసనను అడ్డుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది.
ఒకే పోలీస్ వ్యవస్థ( ఏక్ పోలీస్ వ్యవస్థ) కోసం బెటాలియన్ కానిస్టేబుల్స్ పట్టుబడుతుండగా గతంలో ఉన్న నిబంధనలే వర్తిస్తాయని పోలీస్ శాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలో బెటాలియన్ కానిస్టేబుల్స్ నిరసన ఉధృతం చేయాలని భావిస్తున్నారు. దీనిలో భాగంగా ఈరోజు(సోమవారం) ఛలో సచివాలయంకు పిలుపునిచ్చారు.
దాంతో ఆందోళన చేపట్టిన వారిపై పోలీస్ శాఖ వేటు వేస్తోంది. ఇప్పటికే పది మందిని సర్వీస్ రిమూవ్ చేయగా, 34 మందిని సస్పెండ్ చేసింది. అయినప్పటికీ బెటాలియన్ కానిస్టేబుల్స్ తమకు కచ్చితమైన హామీ వచ్చే వరకూ వెనక్కు తగ్గేది లేదని స్పష్టం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment