Police Battalion
-
తెలంగాణ సచివాలయం వద్ద భారీ భద్రత
-
తెలంగాణ సచివాలయం వద్ద భారీ భద్రత
హైదరాబాద్: ‘ఛలో సచివాలయం’కు బెటాలియన్ కానిస్టేబుల్స్ పిలుపునివ్వడంతో సచివాలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. సచివాలయం వద్ద భారీ భద్రత ఏర్పాటు చేసి బెటాలియన్ కానిస్టేబుల్స్ నిరసనను అడ్డుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది.ఒకే పోలీస్ వ్యవస్థ( ఏక్ పోలీస్ వ్యవస్థ) కోసం బెటాలియన్ కానిస్టేబుల్స్ పట్టుబడుతుండగా గతంలో ఉన్న నిబంధనలే వర్తిస్తాయని పోలీస్ శాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలో బెటాలియన్ కానిస్టేబుల్స్ నిరసన ఉధృతం చేయాలని భావిస్తున్నారు. దీనిలో భాగంగా ఈరోజు(సోమవారం) ఛలో సచివాలయంకు పిలుపునిచ్చారు. దాంతో ఆందోళన చేపట్టిన వారిపై పోలీస్ శాఖ వేటు వేస్తోంది. ఇప్పటికే పది మందిని సర్వీస్ రిమూవ్ చేయగా, 34 మందిని సస్పెండ్ చేసింది. అయినప్పటికీ బెటాలియన్ కానిస్టేబుల్స్ తమకు కచ్చితమైన హామీ వచ్చే వరకూ వెనక్కు తగ్గేది లేదని స్పష్టం చేస్తున్నారు. -
39 మంది సస్పెండ్.. పోలీసు శాఖ ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: పోలీస్ ఉద్యోగంలో ఉండి ధర్నాలు, ఆందోళనలకు నాయకత్వం వహించారని.. నిరసనలను ప్రేరేపించి క్రమశిక్షణను ఉల్లంఘించారని 39 మంది మంది తెలంగాణ స్పెషల్ పోలీస్ (టీజీఎస్పీ) సిబ్బందిపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. అందులో వివిధ బెటాలియన్లకు సంబంధించి హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ హోదాల్లో పనిచేస్తున్న సిబ్బంది ఉన్నారు. టీజీఎస్పీ బెటాలియన్లలో ఆందోళనలకు నేతృత్వం వహించిన, ఇంటర్వ్యూలు ఇచ్చినవారిని గుర్తించి.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 311 ప్రకారం ఈ చర్యలు తీసుకున్నట్టు తెలిసింది. అంతకుముందు టీజీఎస్పీ సిబ్బంది ఆందోళనలపై డీజీపీ జితేందర్ ప్రకటన విడుదల చేశారు. వారి సమస్యలను సానుభూతితో పరిశీలిస్తామని, సిబ్బంది యథావిధిగా విధుల్లో చేరాలని హామీ ఇస్తూనే.. క్రమశిక్షణ ఉల్లంఘనను తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు. టీజీఎస్పీ సిబ్బంది పోలీసు శాఖ ప్రతిష్టకు మచ్చ తెచ్చేలా వ్యవహరించరాదని.. నిబంధనలు ఉల్లంఘించే సిబ్బందిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చిచెప్పారు. ఈ క్రమంలో శనివారం రాత్రి 39 మంది టీజీఎస్పీ సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ నిరసనలు, ఆందోళనలపై పూర్తిస్థాయి విచారణ నిర్వహించి, తదనుగుణంగా చర్యలు చేపడతామని అందులో పేర్కొన్నారు. ఉమ్మడి ఏపీ విధానాలే.. ఉమ్మడి ఏపీలో టీజీఎస్పీ పోలీసు సిబ్బంది విధులకు అనుసరించిన విధివిధానాలే తెలంగాణ రాష్ట్రంలోనూ కొనసాగుతున్నాయని డీజీపీ జితేందర్ స్పష్టం చేశారు. సివిల్, ఆర్మ్డ్ రిజర్వ్, స్పెషల్ పోలీస్ ఎంపిక రాత పరీక్షలో మెరిట్ ఆధారంగానే అభ్యర్థులు కోరుకున్న విధంగా జరిగాయన్నారు. దాదాపుగా అన్ని రాష్ట్రాలు ఈ రకమైన విధానాలనే అమలు చేస్తున్నాయన్నారు. ఇతర ప్రభుత్వ విభాగాల ఉద్యోగులకు లేనివిధంగా టీజీఎస్పీ సిబ్బందికి సరెండర్ లీవులు, అదనపు సరెండర్ లీవులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. పండుగలు, సెలవుల్లో సిబ్బంది విధులను దృష్టిలో ఉంచుకొని వారికి ఈ సౌకర్యం కల్పిస్తున్నామని ఆ ప్రకటనలో డీజీపీ వివరించారు. టీజీఎస్పీ సిబ్బందికి ఉన్నతాధికారుల కౌన్సెలింగ్.. టీజీఎస్పీ సిబ్బంది ఆందోళనబాట పట్టడంతో పోలీస్ ఉన్నతాధికారులు వారికి పలు అంశాలపై కౌన్సెలింగ్ చేపట్టారు. నిబంధనలు ఏం చెబుతున్నాయి? వారి సమస్యల పరిష్కారానికి ఉన్న మార్గాలేమిటనే అంశాలను వివరిస్తున్నారు. ఈ మేరకు మొదటి, ఎనిమిదో బెటాలియన్ల సిబ్బందికి శాంతిభద్రతల అదనపు డీజీ మహేశ్ భగవత్, టీజీఎస్పీ అదనపు డీజీ సంజయ్‌కుమార్ జైన్లు శనివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. వరంగల్‌లో సీపీ వరంగల్, 12వ బెటాలియన్‌లో నల్లగొండ జిల్లా ఎస్పీ, సిరిసిల్లలో స్థానిక ఎస్పీ, డిచ్‌పల్లిలో కామారెడ్డి ఎస్పీలు సిబ్బందితో మాట్లాడారు. -
ఆరని ఇథనాల్ చిచ్చు.. పోలీసుల లాఠీచార్జ్‌పై సీబీఐ విచారణ చేయాలి
నారాయణ్‌పేట్: కుటుంబ సభ్యులతో కలిసి దసరా పండుగను సంతోషంగా జరుపుకోవాల్సి ఉండగా.. ఇథనాల్ కంపెనీ ఆయా గ్రామాల్లో చిచ్చు పెట్టింది. ఆదివారం జరిగిన ఘటనతో చిత్తనూర్, ఎక్లాస్పూర్, జిన్నారం గ్రామాల్లో సోమవారం దసరా పండుగ వాతావరణం ఎక్కడా కనిపించలేదు. ఆయా గ్రామస్తులు ఇళ్లకు తాళాలు వేసి అడవులు, బంధువుల ఇళ్లకు తరలివెళ్లారు. ఎక్లాస్పూర్ లక్ష్మీనర్సింహస్వామి ఆలయం దగ్గర కంపెనీ నుంచి వ్యర్థాలతో వచ్చిన ఓ ట్యాంకర్‌ను అడ్డుకొని ధర్నా చేస్తున్న మూడు గ్రామాల ప్రజలు, పోలీసులకు నడుమ జరిగిన ఘర్షణలో 10 మంది గ్రామస్తులు, ఏడుగురు మంది పోలీసులు గాయపడ్డారు. సెల్ఫోన్లలో తీసిన వీడియోలు, ఫొటోల ఆధారంగా పోలీసులపై దాడి చేసిన వారిని గుర్తించి ఘటన జరిగిన రోజు అర్ధరాత్రి నుంచి గాలింపు ప్రారంభించారు. ఇళ్లల్లో ఉన్న వారిని పోలీసు వాహనాల్లో ఇతర మండలాల పోలీస్స్టేషన్లకు తరలించి విచారిస్తున్నారు. మరింత మంది కోసం ప్రత్యేక పోలీసులు గాలింపు ప్రారంభించారు. చిత్తనూర్, ఎక్లాస్పూర్ సర్పంచులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఆయా గ్రామాల్లో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. భయాందోళనలో గ్రామస్తులు.. రాత్రిళ్లు స్పెషల్ బెటాలియన్ పోలీసులు గస్తీ నిర్వహిస్తుండటంతో చిత్తనూరు, జిన్నారం, ఎక్లాస్పూర్ గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. యువకులు గ్రామాలు వదిలి వెళ్లడంతో ఇళ్ల దగ్గర ఉన్న వృద్ధులు, చిన్నారులు బిక్కుబిక్కుమంటు కాలం వెళ్లదీస్తున్నారు. జన సంచారం లేక ఆయా గ్రామస్తులు నిర్మానుష్యంగా మారాయి. ఇళ్లకు తాళాలు.. పోలీసులపై రాళ్లు, కర్రలతో దాడి చేసిన వారి కోసం పోలీసులు రెండ్రోజులుగా ఇల్లిల్లూ జల్లెడ పడుతుండటంతో మూడు గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురై ఇళ్లకు తాళాలు వేసి ఇతర గ్రామాలకు కొందరు, వ్యవసాయ పొలాలకు మరికొందరు తరలివెళ్లారు. ఇళ్ల వద్ద కేవలం వృద్ధులు, చిన్నారులు మాత్రమే ఉన్నారు. పండుగ కోసం గ్రామాలకు వచ్చిన బంధువులను సైతం రాత్రిళ్లు పోలీసులు చితకబాదినట్లు వివరించారు. ఐజీ, డీఐజీ ఆరా.. ఘర్షణ వివరాలు తెలుసుకునేందుకు సోమవారం ఐజీ షానవాజ్ ఖాసీం, డీఐజీ ఎల్ఎస్ చౌహన్, ఎస్పీ యోగేష్ గౌతమ్ మరికల్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. సీఐ కార్యాలయంలో సుమారు మూడు గంటల పాటు చర్చించారు. ఎన్నికల్ కోడ్ అమలులో ఉన్నందుకు బాధ్యులపై తీసుకోవాల్సిన చర్యలు, చట్టపరమైన అంశాలను చర్చించినట్లు తెలిసింది. పోలీసుల లాఠీచార్జ్‌పై సీబీఐ విచారణ చేయాలి చిత్తనూర్ ఇథనాల్ కంపెనీని మూసివేయాలని శాంతియుతంగా ఆందోళన చేపట్టిన గ్రామస్తులపై పోలీసుల లాఠీచార్జ్ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు నాగురావు నామాజీ అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కంపెనీ నుంచి వ్యర్థాలను తరలిస్తున్న ట్యాంకర్‌ను అడ్డుకున్న గ్రామస్తులపై పోలీసులు లాఠీచార్జ్ వెనుక ఎవరి ప్రమేయం ఉందో తేల్చాలన్నారు. ఇథనాల్ కంపెనీపై ఎన్నో అనుమానాలు ఉన్నాయని, వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. కంపెనీ వ్యర్థాలను సమీపంలోని మన్నె వాగులో వేయడం వల్ల నీళ్లు కలుషితమవుతున్నాయని.. మూగజీవాలు, మానవళికి ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సీబీఐ విచారణ చేయించి బాధిత గ్రామాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నర్సన్‌గౌడ్, తిరుపతిరెడ్డి, వేణు ఉన్నారు. గ్రామస్తులపై దాడిని ఖండిస్తున్నాం.. రెండేళ్ల నుంచి కంపెనీ రద్దు కోసం ఉద్యమిస్తున్న గ్రామస్తులపై పోలీసుల లాఠీచార్జ్‌ను ఖండిస్తున్నామని పీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు. ఈ విషయంపై ఇద్దరు ఎమ్మెల్యేలు స్పందించకపోవడం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందన్నారు. వీరన్న, కృష్ణయ్య పాల్గొన్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి.. మూడు గ్రామాల ప్రజలపై పోలీసుల లాఠీచార్జ్ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని సీపీఎం రాష్ట్ర నాయకుడు వెంకట్రాములు డిమాండ్ చేశారు. ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా శాంతియుతంగా పోరాటం చేస్తున్న గ్రామస్తులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం దారుణమన్నారు. బాల్‌రాం, గోపాల్, సుదర్శన్, మల్లయ్య ఉన్నారు. కేసులు ఎత్తి వేయాలి.. గ్రామస్తులపై పోలీసుల లాఠీచార్జ్ హేయమైన చర్యగా భావిస్తున్నామని పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ లక్ష్మణ్ అన్నారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. వృద్ధులు, పిల్లలు, మహిళలను కూడా చూడకుండా పోలీసులు దాడి చేసి ఆ ప్రాంతాన్ని హింసాత్మకంగా మార్చారని, ఇందుకు వారే బాధ్యత వహించాలన్నారు. గ్రామస్తులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. నారాయణ, కాళేశ్వర్ ఉన్నారు. 20 మందిపై కేసులు నమోదు.. పోలీసులపై దాడి ఘటనలో మూడు గ్రామాల్లోని 20 మందిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ హరిప్రసాద్‌రెడ్డి తెలిపారు. వీరిని నారాయణపేట కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించినట్లు వివరించారు. మిగిలిన వారి కోసం గాలింపు చేపడుతున్నట్లు తెలిపారు. అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలి.. చిత్తనూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ ఘర్షణలో అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని మంగళవారం టీపీసీసీ అధికార ప్రతినిధి గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ యోగేష్ గౌతమ్‌ను కలిసి విన్నవించారు. జూరాల ఆగ్రో ఇథనాల్ కంపెనీతో నీటి, వాయు కాలుష్యం ఏర్పడి సుమారు 26 గ్రామాలకు నష్టం వాటిల్లుతోందన్నారు. రెండేళ్లుగా ఆయా గ్రామాల ప్రజలు కంపెనీని తరలించాలంటూ పోరాడుతున్నా యాజమాన్యం పట్టించుకోవడం లేదని వివరించారు. ప్రజల విజ్ఞప్తులను వినిపించుకోకుండా వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో పారబోస్తున్నారని.. వ్యతిరేకిస్తున్న ప్రజలను కాపాడాలని కోరారు. నిజమైన దోషులను గుర్తించి మిగతా వారిని విడుదల చేయాలని కాంగ్రెస్‌పార్టీ తరఫున కోరారు. -
AP: కొత్తగా నాలుగు పోలీసు బెటాలియన్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా నాలుగు ఏపీఎస్పీ పోలీసు బెటాలియన్లు ఏర్పాటు చేయాలని పోలీసు శాఖ నిర్ణయించింది. ఎచ్చెర్ల (శ్రీకాకుళం జిల్లా), రాజమహేంద్రవరం (తూర్పుగోదావరి జిల్లా), మద్దిపాడు (ప్రకాశం జిల్లా), చిత్తూరులో కొత్త బెటాలియన్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు పోలీసు శాఖ ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 8 పోలీస్ బెటాలియన్లు ఉన్నాయి. కాగా, రాష్ట్ర విభజన అనంతరం అవసరాలకు తగినట్లుగా కొత్తగా నాలుగు బెటాలియన్ల ఏర్పాటుకు అవకాశం ఉంది. కానీ అప్పటి టీడీపీ ప్రభుత్వం కొత్త బెటాలియన్ల ఏర్పాటు అంశాన్ని పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే కొత్తగా నాలుగు పోలీసు బెటాలియన్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. భూములను కూడా గుర్తించింది. ఎచ్చెర్లలో 80 ఎకరాలు, రాజమహేంద్రవరంలో దాదాపు 30 ఎకరాలు, మద్దిపాడులో 95 ఎకరాలు, చిత్తూరులో దాదాపు 50 ఎకరాలను ఎంపిక చేసింది. మద్దిపాడులోని భూమిని ఇప్పటికే ఏపీఎస్పీ విభాగానికి అప్పగించారు. ఎచ్చెర్ల, రాజమహేంద్రవరం, చిత్తూరులోని భూములు పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఉన్నాయి. వాటిని త్వరలోనే ఏపీఎస్పీ విభాగానికి అప్పగించాలని డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశించారు. అనంతరం ఆ నాలుగు కేంద్రాల్లో బెటాలియన్ల ఏర్పాటు కోసం భవనాల నిర్మాణం, ఇతర మౌలిక సదుపాయాల ఏర్పాటు పనులను ఏపీఎస్పీ చేపడుతుంది. ఏడాదిలోగా నాలుగు బెటాలియన్ల ఏర్పాటు పూర్తి చేయాలని ఏపీఎస్పీ భావిస్తోంది. పోలీసు వ్యవస్థ మరింత బలోపేతం ఏపీఎస్పీ అధికారులు, జవాన్లతోపాటు కలిపి 1,007 మందితో ఒక్కో బెటాలియన్‌ను ఏర్పాటు చేస్తారు. ఒక్కో బెటాలియన్‌లో ఒక కమాండెంట్, ఒక అదనపు కమాండెంట్, నలుగురు అసిస్టెంట్ కమాండెంట్లు, 10మంది రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, 24మంది రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్లు, 70మంది అసిస్టెంట్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్లు, 177మంది హెడ్ కానిస్టేబుళ్లు, 630మంది కానిస్టేబుళ్లు ఉంటారు. వారితోపాటు మినిస్టీరియల్ స్టాఫ్ 26మంది, ఒక మెడికల్ యూనిట్ (8మంది వైద్య సిబ్బంది), 56 మంది ఇతర సిబ్బందిని నియమిస్తారు. ఆ విధంగా మొత్తం 4,028మందితో నాలుగు బెటాలియన్లను ఏర్పాటు చేస్తారు. ‘కొత్తగా నాలుగు పోలీసు బెటాలియన్ల ఏర్పాటుతో రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ మరింత బలోపేతమవుతుంది. ప్రత్యేక పరిస్థితుల్లో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రకృతి విపత్తుల నిర్వహణ తదితర సేవలను మరింత సమర్థంగా అందించేందుకు అవకాశం కలుగుతుంది’ అని డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. -
ఇది పోలీసుల హత్యే!
సాక్షి, న్యూఢిల్లీ: హరియాణాలోని కర్నాల్ జిల్లా రాయ్‌పూర్ జట్టన్ గ్రామానికి చెందిన రైతు సుశీల్ కాజల్ మృతికి పోలీసులే కారణమని ఆయన కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసుల లాఠీఛార్జ్ వల్లనే రైతు సుశీల్ మరణించాడని ఆయన భార్య సుదేష్ దేవీ, తల్లి విమర్శించారు. ఆయన పోలీసులు చెబుతున్న విధంగా గుండెపోటుతో మరణించలేదని వారు వాదిస్తున్నారు. పోలీసులు, హరియాణా ప్రభుత్వం కావాలనే సుశీల్ గుండెపోటుతో మరణించినట్లు చిత్రీకరించారని కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లాఠీచార్జ్ సందర్భంగా తగిలిన తీవ్రమైన గాయాలు, నొప్పులతో ఇంటికి చేరుకున్న సుశీల్, తల్లి తీసుకొచ్చిన పసుపు కలిపిన పాలను తాగి... తనకు ఏమీ తినాలని అనిపించట్లేదని చెప్పి పెయిన్ కిల్లర్ మాత్రలను వేసుకొని పడుకున్నాడని కుటుంబసభ్యులు తెలిపారు. అయితే రాత్రి నొప్పులతో బాధపడుతూ ప్రాణాలు విడిచారని ఆయన భార్య, తల్లి వివరించారు. గాయాలకు, మరణానికి సంబంధం లేదు: కర్నాల్ ఎస్పీ పునియా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు, రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌కు వ్యతిరేకంగా ఆగస్టు 28న కర్నాల్‌లో జరిగిన నిరసన కార్యక్రమంలోలో సుశీల్ కాజల్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా రైతులు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణ సమయంలో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. ఆ ఘటనలో గాయపడ్డ రైతుల్లో సుశీల్ కాజల్ ఒకరు. అదే రోజు రాత్రి లాఠీచార్జ్‌లో తగిలిన దెబ్బలతో ఇంటికి వచ్చిన సుశీల్ తెల్లారేసరికి విగతజీవిగా మిగిలిపోయాడు. కాగా కర్నాల్ ఎస్పీ గంగారామ్ పునియా మాత్రం పోలీసులతో జరిగిన ఘర్షణలో తగిలిన గాయాలకు, అతని మరణానికి సంబంధం లేదని ప్రకటించారు. కాగా సుశీల్ స్నేహితులు, కుటుంబం, రైతు సంఘాల నాయకులు మాత్రం ఇది పోలీసుల హత్యేనని అంటున్నారు. రైతు ఉద్యమంలో చురుగ్గా: రైతు ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి రైతు సుశీల్ కాజల్‌తో పాటు ఆయన తల్లి, భార్య సుదేష్ దేవి, కుమారుడు సాహిల్, కుమార్తె అన్నూ నిరసన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు. అయితే రైతు ఉద్యమంలో పాల్గొన్న సమయంలో సుశీల్ ఆకస్మిక మరణంతో ఆ కుటుంబం దిగ్భ్రాంతిలో ఉంది. కాగా ఇప్పటి వరకు ఏ ప్రభుత్వ అధికారి కాని, పోలీసులు కాని తమ ఇంటికి రాలేదని, కానీ సుశీల్ మరణాన్ని గుండెపోటులా చిత్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. సుశీల్‌కు 1.5 ఎకరాల భూమితో పాటు ఉన్న కొద్దిపాటి పాడి వారి జీవనాధారం అని, కుటుంబం వాటిపైనే ఆధారపడి జీవిస్తోందని గ్రామస్తులు తెలిపారు. రూ.లక్ష సాయం అందించిన ఆలిండియా కిసాన్ సంఘం రాయ్‌పూర్ జట్టన్ గ్రామంలో చనిపోయిన రైతు సుశీల్ కాజల్æ కుటుంబాన్ని ఎఐకెఎస్ ప్రతినిధి బృందం మంగళవారం పరామర్శించి రూ.లక్ష సాయం అందించింది. చెక్కును సుశీల్ భార్య సుధేష్ దేవికి ఎఐకెఎస్ కోశాధికారి పి.కృష్ణప్రసాద్ తదితరులు అందించారు. వీలైనంత త్వరగా వారికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కర్నాల్‌లోని బస్తారా టోల్‌ప్లాజా వద్ద ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావం తెలిపారు. -
ఎవరీ మడవి హిడ్మా?
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం/చర్ల: మావోయిస్టు అగ్రనేత మడావి హిడ్మా.. భారీ సంఖ్యలో పోలీసు బలగాలు వెళ్లింది ఆయనను పట్టుకునేందుకే.. కానీ పక్కాగా ప్లాన్ చేసి ఇంతమంది పోలీసులను రప్పించి, దాడి చేసిందీ ఆయనే.. ఇంతకుముందు జరిగిన భారీ ఎన్కౌంటర్లు, దాడుల ఘటనల్లో కీలకమూ ఆయనే.. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన తాజా ఘటనతో ఎక్కడ చూసినా హిడ్మా పేరే వినిపిస్తోంది. మరి ఇంతకీ ఎవరీ హిడ్మా? ఎక్కడివాడు, ఏం చేశాడనేది చర్చనీయాంశంగా మారింది. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా జేగురుగొండ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పువ్వర్తికి చెందిన ఆదివాసీ మడావి హిడ్మా. ఆయన తల్లిదండ్రులు అదే గ్రామంలో ఉంటున్నారు. 5 వరకే చదువుకున్న హిడ్మా.. 25 ఏళ్ల వయసులోనే మావోయిస్టు పార్టీలో చేరాడు. ప్రస్తుతం ఆయన వయసు 40 ఏళ్లు. మావోయిస్టు పార్టీ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్జీఏ)–1వ బెటాలియన్‌కు కమాండర్‌గా.. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో సభ్యుడిగా పనిచేస్తున్నాడు. మావోయిస్టుల టాక్టికల్ కౌంటర్ అఫెన్సివ్ క్యాంపెయిన్ కూడా హిడ్మా నేతృత్వంలోనే దాడులు చేస్తుంది. హిడ్మా భార్య కూడా మావోయిస్టు పారీ్టలోనే పనిచేస్తోంది. పీఎల్జీఏ సభ్యులకు శిక్షణ ఇచ్చేది హిడ్మానే. ఒక్కో బెటాలియన్ 200 మంది మావోయిస్టులుంటారు. కొత్తగా ఏ బెటాలియన్ పెట్టినా హిడ్మా ఆధ్వర్యంలోనే పూర్తి స్థాయి ట్రైనింగ్ ఉంటుంది. పీఎల్‌జీఏతోపాటు మిలీíÙయా సభ్యులకు కూడా ఫైరింగ్‌లో శిక్షణ ఇస్తాడు. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన 25కుపైగా ఘటనలకు హిడ్మానే సూత్రధారి అని చెబుతారు. రామన్న తర్వాత హిడ్మా.. ఛత్తీస్‌గఢ్‌లో గెరిల్లా దాడుల బాధ్యతలను ఇంతకుముందు మవోయిస్టు నేత రామన్న చూసేవారు. ఆ తర్వాత హిడ్మా ఆ బాధ్యతలు చేపట్టాడు. కూంబింగ్ ఆపరేషన్లు చేసే పోలీస్ బలగాలపై, సీఆర్పీఎఫ్ క్యాంపులపై మెరుపు వేగంతో దాడులు నిర్వహించడంలో కీలకంగా వ్యవహరిస్తుంటాడు. మావోయిస్టు పార్టీలో పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్డీ) విభాగం హిడ్మా కనుసన్నల్లోనే పనిచేస్తుంది. దండకారణ్యంపై ఆయనకు పూర్తి పట్టు ఉంది. హిడ్మా తలపై రూ.40లక్షల రివార్డు కూడా ఉంది. గతంలో బీజేపీ ఎమ్మెల్యే భీమా మాండవి హత్య కేసులో హిడ్మాపై ఎన్ఐఏ చార్జీషీట్ కూడా వేసింది. హిడ్మా నేతృత్వంలో జరిగిన కొన్ని ఘటనలు ఇవీ.. 2010 ఏప్రిల్ 6న సుక్మా జిల్లా తాడిమెట్ల అటవీ ప్రాంతంలో మైన్ ప్రొటెక్షన్ వాహనాన్ని మందుపాతరలతో పేల్చివేసి, కాల్పులు జరిపిన ఘటన హిడ్మా ఆధ్వర్యంలోనే జరిగింది. ఇందులో 74 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు, ఒక సాధారణ పౌరుడు మృతి చెందాడు. 2017 మార్చి 12న సుక్మా జిల్లా బెజ్జి పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొత్తచెరువు దగ్గర రోడ్డు నిర్మా ణ పనులకు భద్రతగా వెళ్తున్న జవాన్లపై మందుపాతరతో దాడి జరిగింది. ఆ ఘటనలో 12మంది సీఆర్పీఎఫ్ జవాన్లుమృతి చెందారు. 2017 ఏప్రిల్ 24న ఇదే జిల్లా చింతగుఫా పోలీస్‌స్టేషన్ పరిధిలోని బుర్కాపాల్ సమీపంలో రోడ్డు పనులకు భద్రతగా వెళ్తున్న సీఆర్పీఎఫ్ జవాన్లను చుట్టుముట్టి చేసిన దాడిలో.. 24 మంది జవాన్లు చనిపోయారు. 2018 మార్చి 13న సుక్మా జిల్లా కాసారం అటవీ ప్రాంతంలో మావోయిస్టులు మందుపాతర పేల్చడంతో 12 మంది జవాన్లు మృతి చెందారు. 2020 ఫిబ్రవరిలో ఇదే జిల్లా పిడిమెట అటవీ ప్రాంతంలో మందుపాతర పేల్చి, కాల్పులు జరపడంతో 12 మంది డీఆర్జీ జవాన్లు మృతి చెందారు. తాజాగా శనివారం జొన్నగూడెం దాడిలో 22 మంది జవాన్లు మృతి చెందారు. -
పర్యాటకుల వల్లే కశ్మీర్లో కరోనా!
శ్రీనగర్ : గడిచిన 24 గంటల్లో జమ్ముకశ్మీర్‌లో అత్యధికంగా 106 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో 55 మంది పోలీసు సిబ్బంది, ఐదుగురు వైద్యులు కూడా ఉన్నారు. అయితే సోమవారం ఒక్కరోజే కరోనా కారణంగా ముగ్గురు చనిపోవడం ఇదే తొలిసారి. వీరిలో 75 ఏళ్ల వృద్ధుడు కూడా ఉండగా, ఆయనకు రెండుసార్లు నిర్వహించిన పరీక్షలో నెగిటివ్ అనే వచ్చింది. దీంతో అతనికి వైరస్ ఎలా సోకిందనే విషయాన్ని అధికారులు చేధించే పనిలో ఉన్నారు. జమ్మాకాశ్మీర్లో కరోనా కాస్త తగ్గుముఖం పడుతుందనుకున్న సమయంలో ఒక్కరోజులోనే 106 కొత్త కేసులు ప్రబలడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దక్షిణ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో గరిష్టంగా 59 మంది పోలీసులకు కోవిడ్ నిర్ధారణ అయ్యింది. మొత్తం 77 మంది సాయుధ పోలీసు బలగాలకు నిర్వహించిన పరీక్షల్లో ఏకంగా 59 మందికి వైరస్ సోకింది. వీరిలో ఒక డిప్యూటీ కమాండెంట్ కూడా ఉన్నారని పోలీసు వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం జమ్ముకశ్మీర్ వ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,289కి పెరగగా ప్రస్తుతం 665 యాక్టివ్ కేసులున్నాయని అధికారులు వెల్లడించారు. పర్యటాక కేంద్రం కావడంతో వివిధ రాష్ర్టాల నుంచి పర్యాటకులు రావడంతోనే వైరస్ వ్యాపించిందని పేర్కొన్నారు. (మహా నగరాలే కరోనా కేంద్రాలు ) -
రాష్ట్రంలో మహిళ, గిరిజన పోలీస్ బెటాలియన్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా మహిళ, గిరిజన పోలీసు బెటాలియన్లు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖల మంత్రి మేకతోటి సుచరిత వెల్లడించారు. సచివాలయంలోని రెండో బ్లాక్‌లోని తన చాంబర్లో ఆదివారం ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీస్ కానిస్టేబుల్స్ మెడికల్ రీయింబర్స్మెంట్ ఫైల్‌పై తొలి సంతకం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో నాలుగు ఏపీఎస్పీ బెటాలియన్లు ఏర్పాటు చేసే అవకాశం వచ్చినప్పటికీ గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. తమ ప్రభుత్వం మొదటగా మహిళా బెటాలియన్, గిరిజన బెటాలియన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. దళిత మహిళనైన తనకు కీలక బాధ్యత గల హోం మంత్రి పదవి ఇచ్చినందుకు సీఎం వైఎస్ జగన్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ రూపొందిస్తాం రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు అరికట్టడానికి పటిష్టమైన చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. పోలీస్ వ్యవస్థలో మార్పులు తీసుకువచ్చి విధి నిర్వహణలో ప్రజల మన్ననలు పొందేలా చేస్తామన్నారు. మహిళలు గానీ, ఇతర బాధితులు గానీ భయపడకుండా పోలీసులకు ఫిర్యాదు చేయడానికి టోల్ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థను రూపొందిస్తామని వివరించారు. పోలీసులు కూడా వారానికి ఒక రోజు తమ కుటుంబాలతో ఆనందంగా గడపడానికి వీక్లీఆఫ్‌ని తప్పనిసరిగా అమలు చేయడానికి ఆదేశాలు ఇచ్చామన్నారు. 2018 పోలీస్ రిక్రూట్మెంట్కు సంబంధించిన ఫలితాలు త్వరలో ప్రకటిస్తామని, ఇతర ఖాళీల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు. చాంబర్లో ప్రత్యేక పూజలు.. తొలుత మంత్రి సుచరిత, ఆమె భర్త దయాసాగర్‌తో కలసి చాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండితులు వేద మంత్రాలు, మేళతాళాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రికి పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు, శాంతిభద్రతల ఏడీజీ రవిశంకర్ అయ్యన్నార్, ఎస్పీ గజరావు భూపాల్, ఇతర అధికారులు, నాయకులు పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు. ఫోన్‌కాల్ ఫిర్యాదుతో పాస్టర్ అరెస్టు తాను మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే ఒక బాధితురాలి తల్లి అనంతపురం నుంచి ఫోన్ చేసి నాలుగు నెలల కిందట జరిగిన ఒక సంఘటనపై ఫిర్యాదు చేసినట్లు మంత్రి సుచరిత వివరించారు. ఓ చిన్నారి పట్ల ఫాస్టర్ అసభ్యంగా ప్రవర్తించిన విషయాన్ని ఆమె తెలిపిందన్నారు. ఆ ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించినట్టు చెప్పారు. పోలీసులు వెళ్లేసరికి ఫాస్టర్ పారిపోయారని, అయితే ఓ వర్గం మీడియా మాత్రం.. ‘‘వెంటనే చర్యలు తీసుకోలేకపోయారు. అసమర్థులు’’ అన్నట్లు రాసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తరువాత రెండు రోజులకు ఆ పాస్టర్ని పట్టుకొని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారని మంత్రి తెలిపారు. ఫిర్యాదు అందిన తరువాత చర్యలు తీసుకోవడానికి కొంత సమయం ఇవ్వాలని, తొందరపడి వార్తలు రాయడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. -
సరిహద్దుపై డేగ కన్ను
వేమనపల్లి: దేశవ్యాప్తంగా ఎన్నికల కోలాహలం. ఒకవైపు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో బీజేపీ ఎమ్మెల్యేపై మావోలు దాడి చేసి పొట్టన పెట్టుకున్నారు. దీం తో తెలంగాణ మహారాష్ట్ర, ఛతీస్‌గఢ్ సరిహద్దు ప్రాణహిత, గోదావరి నదీ తీరం వెంటా డేగకళ్లతో పోలీసులు పహారా కాస్తున్నారు. ఇరు రాష్ట్రాల్లో నేడు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతుండగా గ్రా మాలు అప్పటికే పోలీసుల రక్షణ వలయంలోకి వెళ్లి పోయాయి. ప్రాణహితానది అవతలి వైపున్న గడిచిరోలి జిల్లా అభయారణ్యం మావోయిస్టులకు షెల్టర్‌జోన్. ఎతైనా.. గుట్టలు, దట్టమైన అడవులు ఈ ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి. ఎన్నికల స మయంలో మావోలు తమ ఉనికి చాటుకునేందుకు అవకాశాలున్నాయి. దీంతో ముందు జాగ్రత్తగా పోలీస్ బలగాలు నిఘా తీవ్రతరం చేశాయి. ఎన్నికల ప్రక్రియకు మాత్రం ఆటంకం కలగకుండా అన్ని పీఎస్‌లపై దృష్టిసారించారు. రెండు రాష్ట్రాల సరిహద్దు వెంట రామగుండం పోలీస్‌కమిషనర్ సత్యనారాయణ, మంచిర్యాల డీసీపీ రక్షితా కే. మూర్తి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు చో టులేకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి గ్రామాల్లో ఓటింగ్ సరళి పెంచేందుకు గ్రామసభలు ఏర్పాటుచేసి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. మా ర్చి 26న తీరం వెంట భారీ కూబింగ్ నిర్వహించారు. అదే రోజు ముక్కిడిగూడెం, కల్లంపల్లి గ్రా మస్థులతో సమావేశం ఏర్పాటు చేసి ఓటుహక్కు ప్రాధాన్యత, మావోల ప్రజావ్యతిరేక విధానాలపై వివరించారు. ప్రాణహిత ఫెర్రీపాయింట్‌ల వద్దకు డ్రోన్ కెమెరాల సహాయంతో తీరం వెంట గస్తీ నిర్వహిస్తున్నారు. జైపూర్ ఏసీపీ వెంకటరెడ్డి, రూరల్ సీఐ జగదీష్, ఎస్సై భూమేష్‌లు ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేసి భద్రత పరమైన చర్యలు తీసుకుంటున్నారు. నిరంతర నిఘా.. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ప్రాణాహిత తీరం వెంట నిరంతర నిఘా కొనసాగుతోంది. జిల్లాలో 53 ఒకప్పటి మావోయిస్ట్ ప్రభావిత గ్రామాల్లో 98 పోలింగ్‌స్టేషన్లున్నాయి. సుమారు 88 మంది మావోయిస్ట్ మాజీ సానుభూతిపరులు, మాజీ మిలిటెంట్లు ఉన్నారు. వీరందరితో సమావేశాలు నిర్వహించి, అసాంఘిక శక్తులకు సహకరించొద్దని వారిని బైండోవర్ చేశారు. నది వెంట 16 ఫెర్రీ పాయింట్లుండగా వచ్చి పోయే ప్రయాణికుల మీద దృష్టి సారించారు. పడవలు నడిపే బోట్‌రైడర్లు, జాలరులకు కౌన్సిలింగ్ ఇచ్చి, ఇరు రాష్ట్రాల సరిహద్దు పోలీస్స్టేషన్ల సిబ్బంది సమన్వయంతో ఎప్పటికప్పుడు అనుమానిత వ్య క్తుల సమాచారం తెలుసుకుంటున్నారు. యాక్షన్‌టీంలాంటి వాటి సంచారాన్ని తిప్పికొట్టేందుకు కౌంటర్ యాక్షన్ టీం, క్యూఆర్టీ, టాస్క్‌ఫోర్స్ టీం లను ఏర్పాటు చేశారు. యాక్షన్‌టీం సభ్యుల ఫొటోలను గ్రామాల్లో గోడలపై అంటించి వారు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని ప్రచారం చేయిస్తున్నారు. సరిహద్దు వెంట ఉన్న సుమారు 284 కల్వర్టులను ప్రత్యేకపోలీస్, బాంబ్ స్క్వాడ్లతో తనిఖీలను నిర్వహించారు. -
పోలీసులకు దీటుగా ఎన్సీసీ విద్యార్థులు
సాక్షి,వనపర్తి క్రైం: ఇటీవల జరిగిన అసెంబ్లీ, గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల వద్ద క్రమశిక్షణతో పోలీసులకు దీటుగా ఎన్సీసీ విద్యార్థులు విధులు నిర్వహించారని ఎస్పీ అపూర్వరావు అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కో–ఎడ్యుకేషన్ కళాశాల సమావేశ మందిరంలో ఎన్నికల్లో విధులు నిర్వహించిన ఎన్సీసీ విద్యార్థులకు నగదు రివార్డులు అందజేశారు. అనంతరం ఎన్సీసీ విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. ముందుగా భవిత, హైమావతి, రాజేశ్వరి, రవి, ఖాజ ఎన్సీసీ విద్యార్థులు మాట్లాడుతూ ఎన్నికల్లో విధులు నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. విధులు నిర్వహిస్తూ ఉంటే ప్రజలకు సేవలందించే అనుభూతి కలిగిందని తెలిపారు. ఎన్నికల విధులు నిర్వహించడానికి అవకాశం ఇచ్చిన ఎస్పీకి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈసందర్భంగా ఎస్పీ అపూర్వరావు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పిన విద్యార్థులకు రూ.వెయ్యి చొప్పున రూ.4వేలు అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల్లో ఎన్సీసీ విద్యార్థులు చక్కగా విధులు నిర్వహించి, ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు సహకరించారన్నారు. ఎన్సీసీ క్రమశిక్షణతో భావిభారత పౌరులను తయారుచేయడంలో ప్రధానపాత్ర పోషిస్తుందన్నారు. ఇదే క్రమశిక్షణతో చదువుకుని జీవితంలోనూ ఉన్నతంగా రాణించాలన్నారు. అనంతరం ఎన్నికల విధులు నిర్వహించిన ఎన్సీసీ విద్యార్థులకు నగదు రివార్డులు అందజేశారు. కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ నరసింహారావు, పీఆర్ఓ రాజగౌడ్, సీసీ మధు తదితరులు ఉన్నారు. -
పోలీసుల చిత్రహింసలు తప్పించుకునేందుకే...
న్యూఢిల్లీ: దర్యాప్తులో భాగంగా ఢిల్లీ పోలీసుల చిత్రహింసల నుంచి తప్పించుకునేందుకే స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఒప్పుకున్నానని... తాను మాత్రం ఏ తప్పూ చేయలేదని భారత మాజీ క్రికెటర్ శ్రీశాంత్ సుప్రీం కోర్టుకు తెలిపాడు. 2013 ఐపీఎల్లో ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు తేలడంతో అతనిపై క్రికెట్ బోర్డు జీవితకాల నిషేధం విధించింది. దీనిపై కేరళకు చెందిన ఈ మాజీ పేసర్ న్యాయపోరాటం చేస్తున్నాడు. బుధవారం జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ కె.ఎం.జోసెఫ్‌లతో కూడిన ద్విసభ్య బెంచ్ ఈ కేసును విచారించింది. పోలీస్ టార్చర్ నుంచి తప్పించుకోవడానికే శ్రీశాంత్ నిందను మోశాడని అతని లాయర్ కోర్టుకు వివరించారు. శ్రీశాంత్‌ను బుకీలు సంప్రదించిన మాట నిజమేనని అయితే తను మాత్రం బుకీల బుట్టలో పడలేదని దీనికి సంబంధించి మలయాళంలో బుకీ–శ్రీశాంత్‌ల మధ్య జరిగిన సంభాషణను లాయర్ కోర్టుకు అందజేశాడు. మైదానంలో టవల్‌తో తుడుచుకోవడం, ఆడించడమనేది సహజమని, ఇలా అందరు క్రికెటర్లు చేస్తారని దీన్ని ఫిక్సింగ్‌కు సంజ్ఞగా భావించడం తగదని శ్రీశాంత్ తరఫు న్యాయవాది సల్మాన్ ఖుర్షీద్ వాదించారు. దీనిపై న్యాయమూర్తులు స్పందిస్తూ... బుకీలు ఫిక్సింగ్‌కు పాల్పడమని సంప్రదించినపుడు క్రికెటర్ ఆ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి ఎందుకు తెలపలేదని లాయర్ ఖుర్షీద్‌ను ప్రశ్నించారు. దీన్నిబట్టి శ్రీశాంత్ ప్రవర్తన ఎలాంటిదనే విషయం తేటతెల్లమవుతోందని బెంచ్ స్పష్టం చేసింది. -
చావబాదారు.. లేదు లేదు కౌన్సెలింగ్ ఇచ్చాం
హైదరాబాద్: పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన మైనర్ విద్యార్థులను గొడవ చేస్తున్నారంటూ పోలీసులు విచక్షణారహితంగా లాఠీలతో చితకబాదారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని న్యూబోయిన్‌పల్లిలో చోటుచేసుకుంది. వివరాలు.. న్యూ బోయిన్పల్లి చిన్నతోకట్ట సేవన్ టెంపుల్స్ సమీపంలో ఉండే పసుపుల సాయి పుట్టినరోజును పురస్కరించుకుని 18వ తేదీ రాత్రి అతడి ఇంటికి పలువురు విద్యార్థులు వెళ్లారు. అయితే వారు అల్లరి చేస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు విద్యార్థులను అక్కడి నుంచి పంపించివేశారు. తిరిగి మరుసటిరోజు మధ్యాహ్నం 2 గంటలకు 40 మంది విద్యార్థులు సాయి ఇంటికి చేరుకుని పుట్టినరోజు కేక్ కట్ చేయించి వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సమయంలో పెట్రోలింగ్ వాహనంలో వచ్చిన కానిస్టేబుళ్లు.. అభిషేక్, పుష్పరాజ్, కళ్యాణ్, భానుప్రకాశ్, భరత్, మనీశ్, శుభం(విద్యార్థులు)లను, పి.సందీప్‌కుమార్, అభిషేక్ యాదవ్(స్నేహితులు)లను డీసీపీ తీసుకురమ్మన్నారని చెప్పి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అనంతరం వారిని సీఐ ఆనంద్‌కిశోర్, ఎస్ఐలు శ్రీనివాస్, గురుస్వామిలు కౌన్సెలింగ్ నిర్వహిస్తూ.. ఒక్కసారిగా వారిపై లాఠీలతో చితకబాదారు. అనంతరం రాత్రి 9 గంటల సమయంలో వారి తల్లిదండ్రులను పిలిపించి వారికి అప్పగించారు. కొట్టలేదు.. కౌన్సిలింగ్ ఇచ్చాం: సీఐ ఆనంద్ పుట్టినరోజు పేరుతో కాలనీలో గొడవ చేస్తున్నారంటూ కంట్రోల్ రూంకు ఫోన్ వచ్చిందని, దీంతో ఘటనా స్థలానికి వెళ్లి రోడ్డుపై గుమిగూడిన విద్యార్థులను వెళ్లిపోవాలని సూచించినట్లు సీఐ ఆనంద్‌కిశోర్ తెలిపారు. అయితే కొందరు వెళ్లిపోగా.. పోలీసులను రెచ్చగొట్టేలా మాట్లాడటంతో 9 మందిని స్టేషన్‌కు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చామని చెప్పారు. అనంతరం వారి తల్లిదండ్రులను స్టేషన్‌కు రప్పించి అప్పగించామని, విద్యార్థులను తాము కొట్టలేదని తెలిపారు. ఇటీవల ఎన్నికల సందర్భంగా సాయిని బైండోవర్ చేశామని, అతడిపై పలు కేసులున్నాయని చెప్పారు. ఈ విషయం బయటికి పొక్కడంతో పోలీసు ఉన్నతాధికారులు ఘటనా స్థలంలో ఉన్న సీసీ కెమేరాల ఫుటేజీలను పరిశీలిస్తునట్లు సమాచారం. -
మోకాళ్లపై కూర్చుని మంత్రికి వినతి
గోవిందరావుపేట (ములుగు): భూపాలపల్లి జిల్లాలో ఐదో పోలీసు బెటాలియన్ ఏర్పాటుచేసేందుకు ఏర్పాట్లు జరుగుతుండగా గోవిందరావుపేట మండలం చల్వాయి శివారులోని భూమిని తాజాగా డీజీపీ అనురాగ్‌శర్మ పరిశీలించారు. అయితే, అది ప్రభుత్వ భూమే అయినా దశాబ్దాలుగా నిరుపేద రైతులు ఖాస్తులో ఉన్నారు. ప్రస్తుతం ఆ భూమిని బెటాలియన్‌కు కేటాయిస్తే తాము అన్యాయానికి గురవుతున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈక్రమంలో మండలంలోని నేతాజీనగర్‌కు మంత్రి చందూలాల్ రాగా ఆయనకు వినూత్న రీతిలో తమ సమస్యను రైతులు తెలియజేశారు. మంత్రి కాన్వాయ్ వెళ్తుండగా రైతులు మోకాళ్లపై కూర్చుని వినతిప త్రాలు చూపించారు. దీంతో మంత్రి కాన్వాయ్ ఆపి రైతుల వద్దకు వెళ్లి వారి సమస్యను తెలుసుకున్నారు. తాను అధికారులతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తానని ఆయన రైతులకు హామీ ఇచ్చారు. -
తెలంగాణలో మరో ఆరు బెటాలియన్లు
ప్రతిపాదనలు పంపామన్న అడిషనల్ డీజీపీ రాజీవ్ త్రివేది హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వరకు సైకిల్‌యాత్ర డిచ్పల్లి/నిజామాబాద్: తెలంగాణలో ప్రస్తుతమున్న తొమ్మిది ప్రత్యేక పోలీస్ బెటాలియన్లకు తోడుగా మరో ఆరు కొత్త బెటాలియన్ల ఏర్పాటు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని టీఎస్ఎస్పీ అడిషనల్ డీజీపీ రాజీవ్ త్రివేది తెలిపారు. బెటాలియన్లలో రెండువేల పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామన్నారు. ఆదివారం హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వరకు ఆయన తన ఇద్దరు కుమారులతో కలిసి సైకిల్‌యాత్రగా వచ్చారు. ఉదయం 4.30 గంటలకు జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచి బయలుదేరి మధ్యాహ్నం నిజామాబాద్‌కు చేరుకున్నారు. వారికి నిజామాబాద్‌లో ఎస్పీ ఎస్. చంద్రశేఖర్‌రెడ్డి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాజీవ్‌త్రివేది విలేకరులతో మాట్లాడుతూ ఐపీఎస్‌ల విభజనలో తనను తెలంగాణకు కేటాయించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. రాష్ట్రంలోని తొమ్మిది బెటాలియన్లకు ఇలాగే సైకిల్‌యాత్ర చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.