శ్రీనగర్ : గడిచిన 24 గంటల్లో జమ్ముకశ్మీర్లో అత్యధికంగా 106 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో 55 మంది పోలీసు సిబ్బంది, ఐదుగురు వైద్యులు కూడా ఉన్నారు. అయితే సోమవారం ఒక్కరోజే కరోనా కారణంగా ముగ్గురు చనిపోవడం ఇదే తొలిసారి. వీరిలో 75 ఏళ్ల వృద్ధుడు కూడా ఉండగా, ఆయనకు రెండుసార్లు నిర్వహించిన పరీక్షలో నెగిటివ్ అనే వచ్చింది. దీంతో అతనికి వైరస్ ఎలా సోకిందనే విషయాన్ని అధికారులు చేధించే పనిలో ఉన్నారు. జమ్మాకాశ్మీర్‌లో కరోనా కాస్త తగ్గుముఖం పడుతుందనుకున్న సమయంలో ఒక్కరోజులోనే 106 కొత్త కేసులు ప్రబలడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
దక్షిణ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో గరిష్టంగా 59 మంది పోలీసులకు కోవిడ్ నిర్ధారణ అయ్యింది. మొత్తం 77 మంది సాయుధ పోలీసు బలగాలకు నిర్వహించిన పరీక్షల్లో ఏకంగా 59 మందికి వైరస్ సోకింది. వీరిలో ఒక డిప్యూటీ కమాండెంట్ కూడా ఉన్నారని పోలీసు వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం జమ్ముకశ్మీర్ వ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,289కి పెరగగా ప్రస్తుతం 665 యాక్టివ్ కేసులున్నాయని అధికారులు వెల్లడించారు. పర్యటాక కేంద్రం కావడంతో వివిధ రాష్ర్టాల నుంచి పర్యాటకులు రావడంతోనే వైరస్ వ్యాపించిందని పేర్కొన్నారు.
(మహా నగరాలే కరోనా కేంద్రాలు )
Comments
Please login to add a commentAdd a comment