turist hub
-
అయోధ్యకు ‘రామాయణ క్రూయిజ్ టూర్’
న్యూఢిల్లీ: శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యను సందర్శించే భక్తుల కోసం పర్యాటక శాఖ సరయూ నదిలో ‘రామాయణ క్రూయిజ్’ టూర్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో దీనిపై డిసెంబర్ 1 న కేంద్ర షిప్పింగ్, జల మార్గాల శాఖామంత్రి మన్సుఖ్ మాండవియా అధ్యక్షతన క్రూయిజ్ సేల అమలు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇది సరయూ నదిలో మొట్టమొదటి లగ్జరీ క్రూయిజ్ సేవ. ఈ సేవలతో పవిత్ర సరయు నదిలోన ప్రసిద్ధ ఘాట్ల గుండా సాగే ఈ ప్రయాణ ప్రధాన లక్ష్యం భక్తులకు ఆధ్యాత్మికతతో కూడిన అద్భుతమైన అనుభవానలు అందించడమే. ఈ క్రూయిజ్‌లో అన్ని లగ్జరీ సౌకర్యాలతో, భద్రతా ప్రమాణాలు గ్లోబల్ స్టాండర్డ్ తో సమానంగా ఉంటాయని.. క్రూయిజ్ లోపల, బోర్డింగ్ పాయింట్‌ని రామ్‌చరితమానస్ థీమ్ ఆధారంగా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పూర్తిగా ఎయిర్ కండిషన్డ్ 80 సీట్ల క్రూయిజ్ ఫుల్లీ ఎయిర్ కండిషన్డ్ అని.. సుందరమైన ఘాట్ల సౌందర్యాన్ని చూడటానికి పెద్ద గాజు కిటికీలు ఉంటాయన్నారు. ఇక పర్యాటకుల సౌకర్యార్థం వంట గది, చిన్నగదితో కూడిన సౌకర్యాలు ఏర్పాటు చేశామని తెలిపారు. రామాయణాన్ని తలపించేలా కొన్ని సంఘటనా చిత్రాలు, సెల్ఫీ పాయింట్లు ఉంటాయన్నారు. (చదవండి: 1992 డిసెంబర్ 6న ఏం జరిగింది ?) అయోధ్య హిందువులు ఆరాధించే ఏడు ముఖ్యమైన పుణ్యక్షేత్రాలలో మొదటిదని, యుపీ టూరిజం గణాంకాల ప్రకారం 2019 సంవత్సరంలో సుమారు రెండు కోట్ల మంది పర్యాటకులు అయోధ్యను సందర్శించారని, రామ్ మందిరం పూర్తయిన తర్వాత పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తారని మన్సుఖ్ మాండవియా తెలిపారు. ‘రామాయణ క్రూయిజ్ టూర్’ పెద్ద సంఖ్యలో పర్యాటకులను ఆకర్షించడమే కాక, ఈ ప్రాంతం ప్రత్యక్ష మరియు పరోక్ష ఉపాధి అవకాశాలను కూడా సృష్టిస్తుందని, ఓడరేవులు, షిప్పింగ్ జలమార్గాల మంత్రిత్వ శాఖ క్రూయిజ్ సేవ సజావుగా సాగడానికి అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను అందిస్తుందని తెలిపారు.. -
పర్యాటకుల వల్లే కశ్మీర్లో కరోనా!
శ్రీనగర్ : గడిచిన 24 గంటల్లో జమ్ముకశ్మీర్‌లో అత్యధికంగా 106 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో 55 మంది పోలీసు సిబ్బంది, ఐదుగురు వైద్యులు కూడా ఉన్నారు. అయితే సోమవారం ఒక్కరోజే కరోనా కారణంగా ముగ్గురు చనిపోవడం ఇదే తొలిసారి. వీరిలో 75 ఏళ్ల వృద్ధుడు కూడా ఉండగా, ఆయనకు రెండుసార్లు నిర్వహించిన పరీక్షలో నెగిటివ్ అనే వచ్చింది. దీంతో అతనికి వైరస్ ఎలా సోకిందనే విషయాన్ని అధికారులు చేధించే పనిలో ఉన్నారు. జమ్మాకాశ్మీర్లో కరోనా కాస్త తగ్గుముఖం పడుతుందనుకున్న సమయంలో ఒక్కరోజులోనే 106 కొత్త కేసులు ప్రబలడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దక్షిణ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో గరిష్టంగా 59 మంది పోలీసులకు కోవిడ్ నిర్ధారణ అయ్యింది. మొత్తం 77 మంది సాయుధ పోలీసు బలగాలకు నిర్వహించిన పరీక్షల్లో ఏకంగా 59 మందికి వైరస్ సోకింది. వీరిలో ఒక డిప్యూటీ కమాండెంట్ కూడా ఉన్నారని పోలీసు వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం జమ్ముకశ్మీర్ వ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,289కి పెరగగా ప్రస్తుతం 665 యాక్టివ్ కేసులున్నాయని అధికారులు వెల్లడించారు. పర్యటాక కేంద్రం కావడంతో వివిధ రాష్ర్టాల నుంచి పర్యాటకులు రావడంతోనే వైరస్ వ్యాపించిందని పేర్కొన్నారు. (మహా నగరాలే కరోనా కేంద్రాలు ) -
ఏపీని టూరిజం హబ్ గా మారుస్తాం:మంత్రి అవంతి శ్రీనివాస్
-
పర్యాటక కేంద్రంగా శామీర్‌పేట
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్–కరీంనగర్ రాజీవ్ రహదారిని ఆనుకుని ఉన్న శామీర్‌పేట చెరువు, దాని పరిసర ప్రాంతాలను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని సోమవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. షామీర్పేట చెరువు ఏడాది పొడవునా నీటితో నిండి ఉండేలా చర్యలు తీసుకోవాలని.. పర్యాటకుల ఆహ్లాదం, ఆనందం కోసం అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పారు. నెలరోజుల్లోగా దీనిపై ప్రణాళికను రూపొందించి, పూర్తి నివేదిక అందజేయాలన్నారు.సీఎం కేసీఆర్ షామీర్పేట చెరువు ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా మార్చే అంశంపై ప్రగతిభవన్‌లో టూరిజం డెవలప్మెంట్ ఎండీ మనోహర్, సీఎంవో ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి తదితరులతో చర్చించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించే కొండ పోచమ్మ రిజర్వాయర్ ద్వారా షామీర్పేట చెరువుకు.. అక్కడి నుంచి కాలువ ద్వారా బస్వాపూర్ రిజర్వాయర్‌కు నీళ్లు అందుతాయని చెప్పారు. అటు షామీర్పేట చెరువు, ఇటు కాలువలు నిత్యం నీటితో నిండి ఉంటాయని, దీన్ని పర్యాటకశాఖ మంచి అవకాశంగా మలుచుకోవాలని సూచించారు. హైదరాబాద్‌కు అతి సమీపంలో ఈ ప్రాంతం ఉన్నందున పర్యాటకులు ఎక్కువగా వస్తారన్నారు. పర్యాటకుల కోసం కాటేజీలు, పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా, చెరువు, కాలువల వెంట పూల చెట్లు పెంచాలని తెలిపారు. ప్రధాన రహదారి, చెరువు కట్ట మధ్యనున్న ప్రాంతాన్ని కూడా సుందరంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. -
కొల్చారం.. రండి చూసొద్దాం
కొల్చారం(నర్సాపూర్) : కొల్చారం మండల పరిసర ప్రాంతాలు పురాతన కట్టడాలకు, ప్రకృతి రమణీయతకు పేరుగాంచాయి. ఇక్కడ భూమిలో ఎక్కడ తవ్వినా.. కట్టడాలు, విగ్రహాలే దర్శనమిస్తాయి.ప్రస్తుతం కొల్చారంలో దర్శనీయ స్థలాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కొల్చారం పూర్వపు నామం కోలాచలం. కోలాచలం కాస్త కొలిచెలిమగా మారి రానురాను అది కొల్చారంగా రూపుదిద్దుకుంది. ఇక్కడి చరిత్రను తెలుసుకోవాలంటే తప్పనిసరిగా కొల్చారంను దర్శించాల్సిందే. కాకతీయుల ఆనవాళ్లు.. మండల కేంద్రానికి పురాతనమైన చరిత్ర ఉంది. ఎన్నో రాజవంశాలు ఈ నేలను పరిపాలించాయి. కొ ల్చారం గ్రామం చుట్టూ భవన నిర్మాణాల కోసం ఎక్క డ తవ్వినా ఏదో ఒక దేవత విగ్రహం, కట్టడాలకు సం బంధించిన ఆనవాళ్లు దర్శనమిస్తున్నాయి. కాకతీయు ల కాలం మొదలుకుని నిజాం కాలం వరకు ఇక్కడి విగ్రహాలు, శాసనాలు నాటి చరిత్రను తెలియజేస్తున్నాయి. ప్రకృతి రమణీయతకు నిలయం.. చూడదగ్గ మరో ప్రదేశం తిరుమలయ్యగుట్ట. కొల్చారం నుంచి వరిగుంతానికి వెళ్లే ఎడమవైపు ఈ గుట్ట దర్శనమిస్తుంది. పచ్చని ప్రకృతి రమణీయతను చాటుతూ గుట్టపైకి వెళ్తే తిరుమలేశుని దర్శించుకోవచ్చు. ఈ గుట్టకూ ఓ ప్రత్యేకత ఉంది. క్లిష్టమైన వ్యాఖ్యాన ప్రక్రియకు ప్రాణం పోసి కాళిదాసు రచించిన పంచకావ్యాలకు వ్యాఖ్యానం చేసిన సాహితీ వేత్త కోలిచాల మల్లినాథసూరి జ్ఞానసముపార్జన పొందిన స్థలం ఈ గుట్ట. ఇంతటి చరిత్రను తనలో ఉంచుకున్న కొల్చారంను దర్శించడం తప్పనిసరి. మరి ఆలస్యం ఎందుకు నేడే దర్శించుకునేందుకు బయలుదేరండి మరీ. మతసామరస్యానికి ప్రతీక.. ఇక్కడ పురాతనమైన దర్గా మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. ఇక్కడ ముస్లింల పరిపాలన కొనసాగిందనడానికి షేక్షాబొద్దిన్ దర్గా నిదర్శనం. ఇక్కడ వారంలో ఆరు రోజులు పెద్ద ఎత్తున భక్తులు మతాలకు అతీతంగా వచ్చి దర్శించుకుంటారు. తొమ్మిదిన్నర అడుగుల ఏకశిలా విగ్రహం.. 1984లో వీరభద్రస్వామి ఆలయం పక్కన ఇంటి నిర్మాణం కోసం తవ్వకాలు చేపట్టగా శెల్యరాతితో చెక్కిన ఏకశిలతో దిగంబరంగా తలపై ఏడు సర్పాలు పడగకప్పి ఉన్న విగ్రహం బయటపడింది. తొమ్మిదిన్నర అడుగులున్న ఈ విగ్రహం 11వ శతాబ్దానికి చెందిన కళ్యాణి చాళుక్యుల కాలం నాటిదిగా గుర్తించారు. ఆనాటి రాజైన త్రిభువన ఈ శిలావిగ్రహాన్ని చెక్కించినట్లుగా, ఇది జైన గురువైన 23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడి విగ్రహంగా చరిత్రకారులు గుర్తించారు. ప్రస్తుతం ఈ విగ్రహాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన జైన ఆలయంలో ప్రతిష్ఠించారు. దేశంలో శ్రావణబెలగొళలోని గోమటేశ్వరుని విగ్రహం తర్వాతి స్థానాన్ని ఈ ఏకశిలా విగ్రహం దక్కించుకుంది. పూర్తి ప్రకృతి రమణీయత ప్రతిబింబించేలా ప్రశాంత వాతావరణంలో దేవాలయం నిర్మించడంతో చాలామంది పర్యాటకులు ఈ దేవాలయాన్ని దర్శించేందుకు పెద్ద ఎత్తున తరలివస్తుంటారు. -
గిరిజన వృద్ధురాలి కాళ్లు కడిగిన కలెక్టర్
వైరామవరం (రంపచోడవరం) : వై.రామవరం మండలం శేషరాయి గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని కలెక్టర్ కార్తికేయ మిశ్రా అన్నారు. మండలంలోని యార్లగడ్డ పంచాయతీ పరిధిలోని మరుమూల ప్రాంతమైన శేషరాయిని గురువారం ఆయన సందర్శించారు. ఆ గ్రామస్తులు ఆయనకు గిరిజన సంప్రదాయం ప్రకారం కాళ్లు కడిగి, పూలమాల వేసి స్వాగతం పలికారు. రంపచోడవరం సబ్ కలెక్టర్ వినోద్‌కుమార్ అధ్యక్షతన ఆ గ్రామంలో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు. అర్హులైన వారందరికీ కులధ్రువీకరణ పత్రాలు అందించాలనే లక్ష్యంతో ఈ గ్రామసభలు నిర్వహిస్తున్నామన్నారు. శేషరాయి గ్రామంలో రచ్చబండ, అంగన్వాడీ కేంద్రం, అందరికీ పక్కాగృహాలు నిర్మిస్తామన్నారు. వీధివీధికీ సీసీ రోడ్లు నిర్మిస్తున్నామన్నారు. వై.రామవరం నుంచి శేషరాయికి, వై.రామవరం నుంచి మఠం భీమవరం మీదుగా గుర్తేడు రోడ్డుకు అటవీశాఖ లేవనెత్తిన అభ్యంతరాలను తొలగించి, త్వరలో రోడ్డు నిర్మాణం చేపడతామన్నారు. అనంతరం సుమారు 40 మందికి కుల ధ్రువీకరణ పత్రాలు అందించారు. మహిళా సంఘాలకు ట్యాబ్‌లు అందించారు. రైతులకు పురుగుమందుల స్ప్రేయర్స్, బరకాలు అందించారు. చవిటిదిబ్బలు పీహెచ్సీ వైద్యాధికారి రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో గ్రామస్తులకు అందిస్తున్న దోమతెరలను పరిశీలించారు. ఆ గ్రామానికి రోడ్డు నిర్మాణం ప్రారంభం కాగానే గ్రామంలోని ఇద్దరు యువకులకు జీపులు కొనిస్తామని చెప్పారు. ఆ గ్రామంలోని పిల్లలను యార్లగడ్డ గ్రామంలోని పాఠశాలకు తరలించడానికి వాహనాన్ని సమకూరుస్తామన్నారు. అనంతరం అక్కడ నుంచి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో, దారలోవ గ్రామ సమీపంలో ఉన్న దుమ్ముకొండ జలపాతాన్ని సందర్శించారు. 10 కిలోమీటర్ల దూరం నిటారుగా ఉన్న పెద్దకొండపైకి కాలినడకన వెళ్లారు. ఆ జలపాతంతోపాటు, అటవీ ప్రాంతంలోని ప్రకృతి అందాలను తిలకించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడంలో భాగంగా జలపాతం వద్దకు రోడ్లు నిర్మించి అభివృద్ధి చేస్తామన్నారు. పర్యాటక కేంద్రం వల్ల శేషరాయి గ్రామానికి ఆదాయం చేకూరుతుందన్నారు. అనంతరం మార్గమధ్యలోని గురమంద విశ్వనాథుని దర్శించుకున్నారు. వృద్ధురాలి కాళ్లు కడిగిన కలెక్టర్ శేషరాయిలోని పల్లాల లక్ష్మమ్మ అనే 90 ఏళ్ల వృద్ధురాలికి కలెక్టర్ కార్తికేయమిశ్రా పసుపునీళ్ళతో కాళ్ళు కడిగారు. ఆమెను తనను దీవించమని కోరారు. నూరేళ్లూ సుఖసంతోషాలతో జీవించాలని ఆ వృద్ధురాలు కలెక్టర్‌ను దీవించింది. కార్యక్రమంలో రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ విజయరామరాజు, వెలుగు ఏపీడీ సత్యంనాయుడు, మండల ప్రత్యేకాధికారి, గిరిజన సంక్షేమశాఖ ఈఈ పీకే నాగేశ్వరరావు, అడ్డతీగల సీఐ ఎ.మురళీకృష్ణ, తహసీల్దార్ ఎండీ యూసఫ్ జిలానీ, ఎంపీడీఓ కె.బాపన్నదొర, ఎం ఈఓ కె.ప్రసాదబాబు, సర్పంచ్‌లు దాగేరి పొట్టమ, గుడ్ల సత్యవతి, మాజీ సర్పంచ్ పల్లాల కాశీ విశ్వనాథరెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పల్లాల వెంకట రమణారెడ్డి, మాజీ ఎంపీపీ గొర్లె శ్రీకాంత్, గ్రామపెద్దలు దాగేరి గంగరాజు తదితరులు పాల్గొన్నారు. -
రోప్‌వే కోసం సర్వే
► గండికోట వద్ద పరిశీలనలు ► రెండు çపద్ధ్దతుల్లో కోట అభివృద్ధికి సన్నాహాలు ► పర్యాటకశాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష జమ్మలమడుగు: గండికోటను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. గురువారం ఏపీ టూరిజంశాఖకు చెందిన రీజినల్ డైరెక్టర్ గోపాల్, ఈఈ ఈశ్వరయ్య, డివిజనల్ మేనేజర్ ప్రసాద్‌రెడ్డి, ఏఈ పెంచలయ్య ముంబయికి చెందిన అమితుల్మిత అనే ప్రైవేట్ కన్సల్టెన్సీ సభ్యులతో కలిసి గండికోటను సందర్శించారు. ఇక్కడ రోప్‌వే ఏర్పాటు చేయటానికి అనువైన స్థలాలను గుర్తించడం కోసం ప్రాథమిక సర్వే నిర్వహించారు. గండికోటలోని జూమ్మామసీదు, మాధవరాయస్వామి ఆలయం, గండికోట పైతట్టు ప్రాంతంలో ఉన్న జలాశయం, పెన్నానది లోయ అటువైపు ఉన్న ఆగస్తీశ్వరకోన ప్రాంతాల్లోని ప్రదేశాలను పరిశీలించారు. వీటి గురించి కలెక్టర్‌కు నివేదిస్తామని తెలిపారు. గండికోటను పబ్లిక్ ,ప్రవేట్ భాగస్వామ్యం, బిల్ట్ పద్ధతుల్లో అభివృద్ధిచేయాలని అధికారులు నిర్ణయించారు. గురువారం గండికోటలో పర్యటించిన రోప్‌వే పరిశీలన బృందం నేరుగా కలెక్టర్ బాబారావునాయకుడుతో సమీక్షించారు. ఈసందర్భంగా కలెక్టర్ రోప్ వే నిర్మాణానికి సంబంధించి పరిశీలన చేయాలన్నారు. విశాఖపట్నంలోని కైలాసగిరిలో ఉన్న రోప్‌వేను ఎలా ఏర్పాటు చేశారనే విషయాన్ని ఆధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. అన్ని శాఖలకు చెందిన అధికారుల సహకారంతో గండికోట అభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు. ఇక్కడి జూమ్మామసీదు, మాధవరాయ స్వామి ఆలయం, బందీఖానా, ఎర్రకోనేరుల మరమ్మతులకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.