
సాక్షి, తూర్పుగోదావరి: ఏపీ టీడీపీ రాజకీయ కూటమి సీట్ల పంచాయితీపై ఇంకా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబుకు తాజాగా నిరసన సెగ తగిలింది. చంద్రబాబు ఎదుటే పార్టీ కోసం కష్టపడిన వారిని సీటు ఇవ్వాలని టీడీపీ శ్రేణులు నినాదాలు చేశారు.
కాగా, నల్లజర్ల పర్యటనలో భాగంగా చంద్రబాబుకు నిరసన సెగ తగిలింది. కూటమిలో టికెట్ల కేటాయింపుపై టీడీపీ శ్రేణులు భగుమంటున్నాయి. నల్లజర్లలో చంద్రబాబు బస చేసిన ప్రాంతంలో పోలవరం టికెట్ టీడీపీకే కేటాయించాలంటూ పార్టీ నేతలు నిరనస చేపట్టారు. ఈ సందర్బంగా పార్టీలో కష్టపడిన వారికి మాత్రమే టికెట్ కేటాయించాలని నినాదాలు చేశారు. బోరగం శ్రీనివాస్‌కి టికెట్ కేటాయించాలని ఆయన వర్గీయలు ఆందోళనకు దిగారు. తక్షణమే పోలవం అభ్యర్థిని మార్చాలని నినాదాలు చేశారు.