Mar1st : ఏపీ పొలిటికల్ అప్‌డేట్స్ | AP Elections Today Political News Updates And Headlines On March 1st In Telugu - Sakshi
Sakshi News home page

AP Political Updates Mar 1st: ఏపీ పొలిటికల్ అప్‌డేట్స్

Published Fri, Mar 1 2024 7:21 AM | Last Updated on Fri, Mar 1 2024 9:34 PM

Andhra Pradesh Political News Headlines In Telugu On Mar 1st Updates - Sakshi

9:34 PM, Mar 1st, 2024
వైఎస్సార్‌సీపీ తొమ్మిదో జాబితా విడుదల

  • నెల్లూరు ఎంపీ సమన్వయకర్తగా విజయసాయిరెడ్డి
  • కర్నూలు అసెంబ్లీ సమన్వయ కర్తగా ఎండీ ఇంతియాజ్
  • మంగళగిరి సమన్వయకర్తగా మురుగుడు లావణ్య

07:46 PM, Mar 1st, 2024
ఏపీలో ఒంటరి పోరుకు బీజేపీ రెడీ?

  • 50 అసెంబ్లీ సీట్లు, 11 పార్లమెంట్ సీట్లలో పోటీ చేసేందుకు అభ్యర్థులను సిద్ధం చేసుకున్న బీజేపీ 
  • అభ్యర్థుల జాబితాను అధిష్టానం పెద్దలకు అందజేసిన ఏపీ బీజేపీ
  • టీడీపీ- జనసేన ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించడంపై అసంతృప్తి 
  • తమకు పట్టున్న స్థానాలలోనూ అభ్యర్థులను ప్రకటించడంపై అధిష్టానానికి ఫిర్యాదు చేసిన ఏపీ బీజేపీ నేతలు 
  • రేపు 175 స్థానాలలో అభ్యర్థులు ఎంపికపై చర్చించనున్న బీజేపీ

06:15 PM, Mar 1st, 2024
జనసేనకు భారీ షాక్‌

  • ఆ పార్టీని వీడిన చేగొండి సూర్యప్రకాష్‌.. వైఎస్సార్‌సీపీలో చేరిక
  • ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీ కండువా కప్పుకున్న సూర్యప్రకాష్‌
  •  జనసేనాని తీరును ఎండగట్టిన సూర్య ప్రకాష్‌
  • పార్టీ నేతలతో కూడా మాట్లాడే టైం లేదా?.. కనీసం పార్టీ బూత్‌ కమిటీలను ఏర్పాటు చేయలేరా?
  • ఆరేళ్లలో అరగంట మాత్రమే తనతో పవన్‌ మాట్లాడారు
  • పార్టీని బలోపేతం చేసే ప్రయత్నం ఏమాత్రం చేయకపోగా.. చంద్రబాబును సీఎంను చేయాలనే ఆరాటపడ్డారు
  • సామాజిక న్యాయం గురించి పవన్‌కు ఏమాత్రం తెలియదు
  • జనసేనలో మాట్లాడే స్వేచ్ఛ ఉండదు
  • సలహాలు ఇచ్చేవారిని వైఎస్సార్‌సీపీ కోవర్టులంటూ పవన్‌ బహిరంగంగా అన్నారు
  • ఏం ఆశించి పార్టీ పెట్టారో పవన్‌కే క్లారిటీ లేదు
  • మనసు చంపుకుని ఆ పార్టీలో ఉండలేక.. ఇవాళే పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని.. పదవికి రాజీనామా ఈ  ఉదయమే పంపించా
  • బేషరతుగా వైఎస్సార్‌సీపీలో చేరా
  • క్రమశిక్షణ గల నేతగా వైఎస్సార్‌సీపీ కోసం పని చేస్తా
  • ఇక నుంచి నా ప్రయాణం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెంటే
  • పవన్ కల్యాణ్‌ని నమ్మి గతంలో  జనసేనలో చేరాను
  • పవన్ బడుగు, బలహీన వర్గాలకు దగ్గరగా ఉంటారనుకున్నా
  • ఏ ఆశలతో వెళ్లానో ఆ ఆశలన్నీ నీరు గార్చారు
  • పైకి కనిపించే పవన్ వేరు.. తెర వెనుక వేరే
  • ఆరు సంవత్సరాలు పనిచేస్తే ఇప్పటికి అరగంట మాత్రమే నాతో మాట్లాడారు
  • నేతలకు కూడా పవన్ విలువ ఇవ్వరు
  • చంద్రబాబునో, లోకేష్‌నో సీఎం చేయటానికే పవన్ పనిచేస్తున్నారు
  • అంతేతప్ప పార్టీ అభివృద్ధి కోసం పని చేయలేదు
  • పార్టీని నమ్ముకున్న వారంతా పవన్ని నమ్మి మోసపోయారు
  • ఇంట్లోకి కూడా కనీసం ఆహ్వానించరు
  • సినిమా హాల్లో టికెట్ కొనుక్కున్నట్టు ఇంటి బయట నిలపడాలి
  • పిఏసీ సభ్యులుగా ఉన్నా కూడా స్వేచ్చగా మాట్లాడే అవకాశం ఇవ్వలేదు
  • నాదెండ్ల మనోహర్ చెప్పే మాటలు తప్ప ఎవరి మాటలూ వినరు
  • ఎవరైనా ప్రశ్నిస్తే మీరంతా వైసీపీ కోవర్టులు అంటూ ముద్ర వేస్తున్నారు
  • ఏం ఆశించి జనసేన పెట్టారో అర్థం కావటం లేదు
  • ఆ పార్టీలో ఉండటం మనసొప్పక జనసేన నుండి బయటకు వచ్చాను
  • జగన్ గట్స్ ఉన్న లీడర్అ
  • లాంటి నాయకుని వెనుక నడవాలని అనుకుంటున్నా
  • ఏమీ ఆశించకుండా పార్టీలో జాయిన్ అయ్యాను
  • సలహాలు సూచనలు ఇవ్వొద్దనే నాయకుడ్ని పవన్నే చూశా
  • ఇలాంటి వ్యక్తి పార్టీని నడిపేకంటే క్లోజ్ చేసి ఇంట్లో కూర్చుంటే మంచిది
  • అవసరం ఉన్నంతసేపు హరిరామజోగయ్యని వాడుకున్నారు
  • టీడీపీతో పొత్తు పెట్టుకున్నాక జోగయ్యను ఎందుకు వదిలేశారు?
  • ఏం లబ్ది చేకూరటం వలన చంద్రబాబు పంచన చేరారు?
  • వచ్చే ఎన్నికలలో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు
     

06:09 PM, Mar 1st, 2024
తాడేపల్లి:
వైఎస్సార్‌సీపీలోకి చేరిన పులివెందుల టీడీపీ నేత సతీష్‌రెడ్డి

  • కండువా కప్పి ఆహ్వానించిన సీఎం వైఎస్ జగన్
  • 27 సంవత్సరాలుగా నేను టీడీపీ కోసం పని చేశాను: సతీష్‌రెడ్డి
  • నేను వైఎస్ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టినా నన్ను సీఎం జగన్ ఆహ్వానించారు
  • నాతో వైసీపి నేతలు టచ్ లోకి వచ్చాక చంద్రబాబు రాయబారం పంపారు
  • ఇంతకాలం పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు తన స్వార్ధం కోసం మళ్లీ రాయబారం చేశారు
  • చంద్రబాబు నాయకత్వం రోజురోజుకీ దిగజారిపోయింది
  • ఇప్పుడు టీడీపీలో లోకేష్ పెత్తనమే నడుస్తోంది
  • సీనియర్లకు గౌరవం లేదు
  • టీడీపీ ఒక వ్యాపార సంస్థగా మారింది
  • వైఎస్ ఫ్యామిలీని నేను ఇబ్బంది పెట్టినా జగన్ నామీద ఎంతో ప్రేమ చూపించారు
  • ఈ ప్రేమ, ఆప్యాయతను ఎప్పటికీ మర్చిపోలేను
  • అలాంటి మంచి ఫ్యామిలీపై నేను ఎందుకు పోరాటం చేశానా అనిపించింది
  • జగన్ ఏం చెబితే అదే చేస్తా

04:03 PM, Mar 1st, 2024
సీఎం క్యాంప్ కార్యాలయంలో జనసేన నేత సూర్యప్రకాష్

  • తాడేపల్లి: సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చిన జనసేన నేత సూర్యప్రకాష్
  • కాసేపట్లో‌ సీఎం వైఎస్ జగన్‌ని కలిసే అవకాశం

04:02 PM, Mar 1st, 2024
సీఎం క్యాంప్ కార్యాలయంలో టీడీపీ నేత  సతీష్‌రెడ్డి

  • తాడేపల్లి: సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చిన పులివెందుల టీడీపీ నేత సతీష్ రెడ్డి
  • కాసేపట్లో‌ సీఎం వైఎస్ జగన్‌ని కలిసే అవకాశం

04:00 PM, Mar 1st, 2024
పవన్ కాపు ద్రోహిగా మిగిలిపోతాడు: కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు

  • కాపులకు ధైర్యాన్ని ఇచ్చే వ్యక్తి సీఎం జగన్ 
  • రంగా ఆశయాలను నెరవేరుస్తూ కాపుల మనోభావాలను గౌరవించే వ్యక్తి జగన్ 
  • చంద్రబాబును, టీడీపీని ఓడించేందుకు కాపులు పాటుపడాలి 
  • కాపులు పూర్తిగా జగన్ వెంటే ఉంటారు
  • ఇప్పటికే 70 శాతానికి పైగా కాపులు జగన్ వెంటే ఉన్నారు
  • జగన్‌కు అండగా ఉండాల్సిన బాధ్యత కాపులది
  • పవన్‌కు జగన్ అంటే ఎందుకంత ఉక్రోశం 
  • జన్మభూమి కమిటీలు చేసినట్టు రాష్ట్రంలో ఎక్కడైనా ప్రజలు దోపిడీకి గురవుతున్నారా? 
  • పవన్ కళ్యాణ్ సీఎం జగన్ స్థాయికి వెళ్లడానికి పవన్ జీవితం మొత్తం సరిపోదు 
  • అంబేద్కర్, పూలే భావాలు  వంగవీటి రంగా ఆశయాలను జగన్ ముందుకు తీసుకెళ్తున్నారు 
  • సీఎం జగన్ గురించి పవన్ ఎంత హీనంగా మాట్లాడితే ప్రజలు పవన్‌ను అంత హీనంగా చూస్తున్నారు 
  • పవన్ కళ్యాణ్ నడిచి వెళ్లినా ఎవరూ పట్టించుకోని పరిస్థితికి వెళ్తాడు 
  • దొంగ మాటలు చెప్పి వంగవీటి కుటుంబాన్ని నమ్మించి మోసం చేశాడు
  • చంద్రబాబు ముద్రగడ పద్మనాభంను ఎలా అవమానించాడో చూశాం 
  • కాపులు పవన్‌కు మధ్ధతు ఇవ్వట్లేదు అనడానికి మొన్నటి సభే ఉదాహరణ 
  • పవన్ కాపు ద్రోహిగా మిగిలిపోతాడు 
  • చంద్రబాబుకు కాపులను తాకట్టుపెట్టిన చరిత్ర పవన్‌దే 
  • రాజ్యాధికారం కోసం కలలు కన్న కాపులను పవన్ మోసం చేశాడు 
  • చంద్రబాబు ఎప్పటికీ కాపు ద్రోహే
  • టీడీపీ అంతం వంగవీటి రంగా ఆశయం
  • సీఎం జగన్  కాపులలో 30 మందిని ఎమ్మెల్యేలుగా గెలిపించి, ఐదుగురుకి మంత్రులు ఇచ్చి, 150 మంది కాపులకు రాజకీయంగా పదవులు ఇచ్చారు

01:40PM, Mar 1st, 2024

ఏపీ సచివాలయం
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కామెంట్లు

  • సునీత ఎవరి ప్రతినిధిగా మాట్లాడుతున్నారో అందరికీ అర్థమైంది
  • సునీత మాట్లాడిన వాటిలో​ ఎలాంటి వాస్తవం లేదు
  • సునీత వెనుక ఎవరు ఉన్నారో అందరికీ ఇప్పుడు తెలిసింది
  • వివేకానంద హత్యకు కుట్ర అవసరం మా ప్రత్యర్థులకే ఉంది
  • సునీత మాట్లాడటం వెనుక కుట్ర ఉందని తేలిపోయింది
  • తలా తోకా లేకుండా ఏం మాట్లాడుతున్నారో సునీతకే తెలియాలి
  • సునీత ఎన్నికల్లో పోటీ చేస్తే మంచిదే.. అంతిమంగా ప్రజలే నిర్ణయిస్తారు
  • ఎవరైనా సరే ప్రజలకు ఏం చేస్తామో చెప్పి ఎన్నికలకు వెళ్లాలి
  • సీఎం జగన్‌ ప్రజలకు ఏం చేస్తామో చెప్పి ఎన్నికలకు వెళ్లి గెలిచారు

01:20PM, Mar 1st, 2024

ఏపీలో మారుతున్న పొలిటికల్ ఈక్వేషన్స్

  • టీడీపీ-జనసేన కూటమికి బీజేపీ షాక్
  • కూటమిక దూరంగా ఉండాలని బీజేపీ నిర్ణయం?
  • ఇంకా పూర్తిస్ధాయిలో నిర్ణయం తీసుకోని బీజేపీ
  • ఇతర రాష్ట్రాల వ్యవహారాల్లో బీజీగా బిజేపీ హైకమాండ్

12:50PM, Mar 1st, 2024

విశాఖపట్నం
చంద్రబాబులో ఎటువంటి చలనం లేదు: బ్రాహ్మణులు

  •  తెలుగుదేశం కార్యాలయాన్ని ముట్టడించిన బ్రాహ్మణులు
  • బ్రాహ్మణ మహిళలను మహాసేన రాజేష్ అవమానించాడు
  • బ్రాహ్మణ మహిళల గురించి మహాసేన రాజేష్ తప్పుడుగ వీడియోలు చేశాడు
  • మహాసేన రాజేష్‌కు ఇచ్చిన సీటును వెనక్కి తీసుకోవాలి
  • లేదంటే చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్తాము
  • రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాము
  • బ్రాహ్మణ మహిళలు అంటే రాజేష్‌కు అంత చులకనగా కనిపిస్తున్నారా
  • 24 గంటల్లో రాజేష్పై చర్యలు తీసుకోవాలని కోరిన చంద్రబాబులో ఎటువంటి చలనం లేదు
  • బ్రాహ్మణుల సత్తా చంద్రబాబుకి చూపిస్తాము.. బ్రాహ్మణ సంఘాల నేతలు

12:03PM, Mar 1st, 2024

పెత్తందారుల కుట్రలు గమనించమని కోరుతున్నా: సీఎం జగన్‌

  • వారి పిల్లలు ఇంగ్లీష్‌ మీడియంలోనే చదవాలి.. మన పిల్లలు ఇంగ్లీష్‌ మీడియంలో చదవొద్దా?
  • తెలుగు భాష అంతరించిపోతుందంటూ నానా యాగీ చేస్తున్నారు
  • పెత్తందారుల పిల్లల చేతుల్లో ట్యాబులు ఉండోచ్చు.. మీకు ట్యాబులు ఇస్తే చెడిపోతారంటూ యాగీ చేస్తున్నారు
  • పేదల పిల్లలు ఎప్పటికీ పేదలుగానే మిగిలిపోవాలన్న పెత్తందారుల మనస్తత్వం గమనించండి
  • పెత్తందారులతో మనం క్లాస్‌ వార్‌ చేస్తున్నాం
  • చంద్రబాబు, ఆయన మనుషులు పెత్తందారీ భావజాలాన్ని గమనించండి
  • 57 నెలల కాలంగా జగన్నాథ రథచక్రాలు ముందుకు సాగుతున్నాయి
  • నాడు-నేడు ద్వారా స్కూళ్ల రూపురేఖలు మార్చాం:
  • ప్రభుత్వం ట్యాబ్‌లు ఇస్తే చంద్రబాబు, పవన్‌ విమర్శిస్తున్నారు
  • పిల్లలకు మంచి చేస్తున్న మనపై చంద్రబాబు అండ్‌  కో యుద్ధం చేస్తుంది
  • నారాయణ, చైతన్య విద్యాసంస్థల కోసమే  చంద్రబాబు ఆలోచన: సీఎం జగన్‌
  • పేద పిల్లల భవిష్యత్తు మార్చేందుకు ఎప్పుడైనా చంద్రబాబు ప్రయత్నించారా?
  • చంద్రబాబు పేదవిద్యార్థుల కోసం చేసిన మంచి ఏంటి?
  • చంద్రబాబు పేరు చెబితే ఆయన చేసిన చెడు చాలానే ఉంది
  • చంద్రబాబు ఏ రోజైనా ప్రభుత్వ బడులను పట్టించుకున్నారా?
  • నేను చేసిన పనుల్లో ఒక్క శాతమైనా చంద్రబాబు చేశారా?

11:09AM. Mar1st, 2024

విజయవాడ నగర ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే: ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్

  • పేద ప్రజలు అమరావతిలో నివసించకూడదని సిద్ధాంతంతో చంద్రబాబు కోర్టుకు వెళ్లి అడ్డుకున్నాడు.
  • సీఎం జగన్ అమరావతిలో పేదలకు ఇల్లు కేటాయిస్తే.. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ దుర్మార్గానికి పాల్పడుతున్నారు
  • బోండా ఉమా అమరావతి ఇళ్ల పట్టాల అంశానికి సంబంధించి అబద్ధపు మాటలు మాట్లాడుతున్నాడు.
  • పేదవాళ్లకు ఇల్లు ఇస్తే బోండా ఉమ ఓర్చుకోలేకపోతున్నాడు
  • రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి టిడ్కో ఇల్లు బోండా ఉమా అమ్ముకున్నాడు
  • కోర్టులో స్టే తీసుకొచ్చింది బోండా ఉమా కాదా
  • బోండా ఉమా అడ్డుపడిన అమరావతిలో పేద ప్రజలకు ఇళ్లు కట్టించి ఇస్తాం
  • బోండా ఉమ లాంటి వ్యక్తులు 100 మంది అడ్డుపడినా.. పేద ప్రజలకు ఇళ్లు కట్టించడమే మా అజెండా

11:00AM. Mar1st, 2024

దేవినేని అవినాష్  కామెంట్లు
జనసెన పార్టీ ఎందుకు స్థాపించారో పవన్ ఇప్పటికైనా చెప్పాలి

  • నిరంతరం ప్రజల మధ్య వుంటున్న  వైఎస్సార్‌సీపీ నాయకులు 
  • కష్టం అన్న ప్రతీ ఒక్కరికీ అదుకున్న జగన్ ప్రభుత్వం
  • జగన్ ప్రభుత్వం లో చేయూత రూపంలో మహిళలకు తోడ్పాటు
  • మళ్ళా చంద్రబాబు వొస్తే రాష్ట్ర  భవిష్యత్తు అగమ్య గోచరం
  •  టీడీపీ హయాంలో ప్రజలపై, అధికారులపై దౌర్జన్యం చేశారు
  •  రాజకీయ భవిష్యాత్తు కోల్పోతున్నాం అని జనసైనికులు అవేదన వ్యక్తం చేస్తున్నారు 
  • రాష్ట్ర ప్రభుత్వానికి కట్టవలసిన టాక్స్‌లు ఎగగొడితే అరెస్టులు చేయరా
  • తప్పుచేస్తే చంద్రబాబు అయిన ఒకటే
  • చేయని పనులకు చేసిన్నటు బిల్లు వసూళ్లు చేసిన చరిత్ర టీడీపీ నాయకులది
  • టీడీపీ హయాంలో ఇరిగేషన్, అగ్రికల్చర్, ఐటీ శాఖలు అంతా అవినీతే మయమే

10:49AM. Mar1st, 2024

అనపర్తిలో పెద్ద ఎత్తున పోలీసులు మొహరింపు

తూర్పుగోదావరి జిల్లా: 

  • ఎమ్మెల్యే అవినీతి పరుడంటూ కరపత్రాలు పంచిన మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి
  • బహిరంగ చర్చకు సిద్దమైన ఎమ్మెల్యే, డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి
  • ఇవాళ ముహూర్తం ఖరారు చేసుకున్న ఇద్దరు నేతలు
  • నిజ నిర్ధారణ చర్చకు తన ఇంటి వద్ద వేదిక ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి
  • గత ప్రభుత్వ హయాంలో రామకృష్ణారెడ్డి చేసిన అక్రమాలను స్క్రీన్ ఏర్పాటు చేసి మరీ ప్రజలకు వివరించిన ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి
  • రామవరం నుండి బయలుదేరి అనపర్తిలో ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి ఇంటి వద్ద బహిరంగ చర్చకు వస్తామన్న టిడిపి నేత రామకృష్ణారెడ్డి
  • బహిరంగ చర్చకు అనుమతి లేదన్న పోలీసులు
  • ఇరుపక్షాల వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మొహరింపు

08:40AM. Mar1st, 2024

ఎన్నికల ఫలితాలపై మాజీ మంత్రి కొడాలి నాని జోస్యం

  • సూర్యుడు పడమర ఉదయించిన సరే సీఎంగా జగనే ప్రమాణ స్వీకారం చేస్తారు
  • మే నెలాఖరున సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేయకుండా ఆపగలిగే మగాడు రాష్ట్రంలో లేడు.
  • చంద్రబాబు..పవన్... వదినమ్మ.... చెల్లెమ్మ... మోదీ... సోనియా ఎంతమంది కలిసి వచ్చినా సరే.
  • సీఎం జగన్ ను అధికారం నుండి దింపగలిగే శక్తి సామర్థ్యాలు ఎవరికి లేవు
  • జగన్ సైకో అని ప్రతిపక్షాలు ఎలా అనగలుగుతున్నాయి?
  • జగన్ ముఖంలో నవ్వు తప్ప మరొకటి కనిపించదు
  • మాడు ముఖం, చించుకోవడం, ఫ్రస్టేషన్, గంతులు వేయడం ఇది ప్రతిపక్షాల తీరు
  • ఇలాంటి సైకోలందరూ కలిసి జగన్‌ను వేధిస్తున్నారు
  • 58 నెలల పాలనలో ఆర్థిక సమస్యలు తలెత్తిన.... కరోనా ఇబ్బందులు వచ్చిన....ప్రజలకు ఇచ్చిన మాట తప్పకుండా జగన్ పాలించాడు
  • అదే చంద్రబాబు అయితే ఇంట్లో పడుకొని..... కరోనా కష్టాలతో ప్రజలను పస్తులుంచేవాడు

08:29AM. Mar1st, 2024

వైఎస్సార్‌సీపీని గెలిపించుకుందాం: శాలివాహన, దేవాంగ నాయకుల పిలుపు 

  • వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రి చేసుకుందాం
  • చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ ఎంతమందితో పొత్తు పెట్టుకు న్నా వైఎస్సార్‌సీపీ గెలుపు ఖాయం
  • వైఎస్‌ జగన్‌ను నేరుగా ఎదుర్కోలేక టీడీపీ, జనసేన పొత్తులతో వస్తూ.. ఇంకా బలం సరిపోక బీజేపీ దోస్తీ కోసం అర్రులు

08:10AM. Mar1st, 2024

తూర్పుగోదావరి జిల్లా: 

అనపర్తిలో టెన్షన్ వాతావరణం

  • ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ల మధ్య సాగుతున్న సవాళ్ళ పర్వం
  • ఎమ్మెల్యే అవినీతి పరుడంటూ కరపత్రాలు పంచిన మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి
  • బహిరంగ చర్చకు సిద్దమైన ఎమ్మెల్యే, డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి
  • ఇవాళ ముహూర్తం ఖరారు చేసుకున్న ఇద్దరు నేతలు
  • చర్చలకు వేదికను సిద్ధం చేసిన ఎమ్మెల్యే డా. సత్తి సూర్యనారాయణ రెడ్డి
  • బహిరంగ చర్చకు అనుమతి లేదంటున్న పోలీసులు

07:20AM. Mar1st, 2024

ఆరని మంటలు.. బాబుకు చెమట్లు!

  • రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థిత్వాలపై రగిలిపోతున్న తమ్ముళ్లు
  • అనకాపల్లిలో తాడోపేడో తేల్చుకుంటామంటున్న పీలా వర్గీయులు
  • నారా భువనేశ్వరిని రోడ్డుపైనే అడ్డుకున్న ఆయన అనుయాయులు
  • పి.గన్నవరంలో సరిపెళ్ల రాజేశ్‌కు వ్యతిరేకంగా దళితుల ఆందోళన
  • మడకశిరలో సునీల్‌ వద్దంటూ టీడీపీ నేతల నిరసన
  • డీకే పార్థసారథికే పెనుకొండ టికెట్‌ ఇవ్వాలని నేతల డిమాండ్‌
  • నమ్మినందుకు నట్టేట ముంచారని ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని ఆగ్రహం
     

06:50AM. Mar1st, 2024

పవన్‌ బొమ్మ పెట్టినా కాపుల ఓట్లు రావు 

  • ప్రజారాజ్యంలా జనసేననూ నిర్విర్యం చేసే ప్రయత్నం 
  • నాదెండ్లను అడ్డుపెట్టుకుని జనసేనను దెబ్బతీస్తారన్న అనుమానాలున్నాయి 
  • 24 సీట్ల కోసం యుద్ధం చేయాల్సిన అవసరం మాకేంటి? 
  • చంద్రబాబుకు కాపు ఐక్య వేదిక బహిరంగ లేఖ 
     

06:45AM. Mar1st, 2024

జనం లేక ‘జంట’ షాక్‌

  • జెండా సభకో దండం అంటూ ముఖం చాటేసిన కేడర్‌
  • తొలి అడుగులోనే టీడీపీ–జనసేనకు అసమ్మతి పిడుగు
  • ఊదరగొట్టిన ఉమ్మడి సభకు హాజరైంది 40–50 వేలలోపే
  • జనం లేక ఇరుపక్షాల నేతలపై చంద్రబాబు, పవన్‌ చిర్రుబుర్రులు
  • ప్రజలకు ఏం చేస్తారో చెప్పకుండా సీఎం జగన్‌ను దూషించడంలో పోటాపోటీ
  • తొలి సభే అట్టర్‌ ఫ్లాప్‌ కావడంతో టీడీపీ–జనసేన శ్రేణుల్లో నైరాశ్యం
  • వైఎస్సార్‌సీపీ ‘సిద్ధం’ సభలు ఒకదానికి మించి మరొకటి గ్రాండ్‌ సక్సెస్‌
  • ఉమ్మడి, తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే అతి పెద్ద ప్రజాసభగా నిలిచిన రాప్తాడు సిద్ధం సభ
  • ఎన్నికల్లో మరోసారి ‘ఫ్యాన్‌’ ప్రభంజనానికి సంకేతంగా నిలిచిన మూడో సభ
  • వైఎస్సార్‌సీపీ విజయం ఖాయమని తేల్చిచెప్పిన డజనుకుపైగా జాతీయ మీడియా సంస్థల సర్వేలు
     

06:40AM. Mar1st, 2024

కాపు కాయలేం

  • జనసేనకు దూరమవుతున్న అభిమానులు 
  • బలం లేదు కాబట్టే 24 సీట్లకు ఒప్పుకున్నామనడంపై ఆగ్రహం.. కాపుల్లో వ్యతిరేకత.. అంతర్మధనం 

06:35AM. Mar1st, 2024
24 సీట్లతో కక్కుర్తి పడి.. పవన్‌ అలా.. : గ్రంధి శ్రీనివాస్

  • పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో టీడీపీ-జనసేనలకు షాక్
  • ఇరు పార్టీల నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన 300 మంది కార్యకర్తలు..
  • టీడీపీ జనసేన కార్యకర్త లకు పార్టీ కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్

ప్రభుత్వ విప్ గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ.. 

  • జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలకు  ఆకర్షితులై టీడీపీ , జనసేన పార్టీల నుండి నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు
  • ఐదు సంవత్సరాల కాలంలో యనమదుర్రు డ్రైన్ పై తొమ్మిది  బ్రిడ్జిలను నిర్మించాము
  • కులం మతం ప్రాంతం పార్టీ తేడా లేకుండా అందరికీ సంక్షేమాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి అందిస్తున్నారు
  • గతంలో జన్మభూమి కమిటీలద్వారా టీడీపీ నేతలు పేదలను దోచుకున్నారు
  • 3,50,000 కోట్లు పేదల ఖాతాల అవినీతి లేకుండా చేరువు చేశారు సీఎం జగన్మోహన్ రెడ్డి 
  • మాటిస్తే మడమ తిప్పని నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి
  • 600 హామీలు ఇచ్చి ప్రజలను దగా చేసిన నాయకుడు చంద్రబాబు
  • డ్వాక్రా రుణమాఫీ నిరుద్యోగ భృతి, రైతు రుణమాఫీ అంటూ ప్రజలను మోసం చేశాడు..చంద్రబాబు
  • వెన్నుపోటు కి అబద్ధాలకి అసత్యాలకి, దగాకీ, మోసానికి నిలువుటద్దంచంద్రబాబు
  •  విశ్వసనీయతకు నిలువుటద్దం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి 
  • 600 హామీలలో చంద్రబాబు ఎన్ని హామీలు నెరవేర్చారో ప్రజలకు చెప్పాలి....
  • హైదరాబాద్ నేనే డవలప్ చేశాను అంటూ సొంత డబ్బా కొట్టుకునే వ్యక్తి చంద్రబాబు
  • ఇచ్చిన హామీలను నెరవేర్చాను అని ఓటు అడిగే దమ్ము చంద్రబాబుకు లేదు
  • మీ ఇంట్లో మేలు జరిగితేనే నాకు ఓటేయండి అని ధైర్యంగా అడుగుతున్న దేశం లోనే మొదటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి
  • మెంటల్ ఇన్‌బ్యాలెన్స్‌తో తో పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతున్నాడు
  • 24 సీట్లతో కక్కుర్తి పడి.. చంద్రబాబు కాళ్ల దగ్గర ఇలా పడి ఉన్నాడు.. ఇది ఏంటని జనసేన కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు
  • యువ రక్తం కావాలంటూ  మరో వైపు పవన్‌ కల్యాణ్‌ 75 ఏళ్ల ముసలోడు చంద్రబాబుని కావాలంటున్నాడు
  • ప్రశ్నిస్తానని అన్న పవన్‌ కల్యాణ్‌ చంద్రబాబు ఎన్ని తప్పులు చేసిన ప్రశ్నించలేదు
  • పవన్ కల్యాణ్ కి దృష్టిదోషం ఉంది
  • సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమం ఆయన కళ్ళకు కనపడటం లేదు
  • పవన్‌ కల్యాణ్‌ ఒక మానసిక రోగిలా మారిపోయాడు
  • పవన్‌ కల్యాణ్‌ నాలుగో పెళ్ళాం నాదెండ్ల మనోహర్.. అని ప్రజలు అనుకుంటున్నారు
  • నాదెండ్ల మనోహర్ కి మీకు ఉన్న సంబంధం ఏంటి..
  • పవన్‌ కల్యాణ్‌ వచ్చాక రాజకీయాల్లో తిట్ల పోకడలు వచ్చాయి..
  • చంద్రబాబు పవన్ అధికారం లోకి  వస్తే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉంటాయా...?
  • వీళ్ళకి ఓటు వేయకపోతే వారిని పాతాళానికి తొక్కేస్తారా ...? మక్కెల్లి ఇరగ తీస్తా తొక్కేస్తారా అంటూరా...?
  • పేదల భవిష్యత్తుకు మేము ఇది చేస్తామని చెప్పటం లేదు పవన్‌ కల్యాణ్‌*
  • జగన్మోహన్ రెడ్డి మీద ఈర్ష ద్వేషాలతోటి పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతున్నాడు
  • కాంగ్రెస్ పార్టీ ఎన్ని కేసులు పెట్టినా.. దడవని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి
  • జగన్మోహన్ రెడ్డిని రోజు తలుచుకుంటూ తట్టుకోలేక విషం కక్కుతున్నారు
  • పవన్‌ కల్యాణ్‌ ని సీఎం చేసుకోవాలని... జనసేన కార్యకర్తలు అనుకున్నారు
  • జనసేన కార్యకర్తల ఆశలన్నీ కూడా అడియాసలు చేశాడు 
  • పవన్‌ కల్యాణ్‌ తల తీసుకెళ్లి చంద్రబాబు పాదాల దగ్గర పెట్టి కాపులను అవమానించాడు..
  • పార్టీ కార్యకర్తల అభీష్టాలు కూడా గౌరవం ఇవ్వని వ్యక్తి పవన్‌ కల్యాణ్‌
  • ఆత్మాభిమానం ఉన్నవారు ఎవరూ కూడా పవన్‌ కల్యాణ్‌ వెంట నడవరు...
  • జనసేన నుండి పవన్ వైఖరికి విసిగిపోయిన కార్యకర్తలు,నాయకులు మా పార్టీలోకి వస్తే సాధారణంగా ఆహ్వానిస్తాం

06:30AM. Mar1st, 2024
లోకేష్‌ దుర్మార్గాలను బయటపెడతా: గొల్లపల్లి సూర్యారావు

  • చంద్రబాబు, నారా లొకేష్‌పై గొల్లపల్లి సూర్యారావు కీలక వ్యాఖ్యలు
  • టీడీపీని వీడి తాజాగా వైఎస్సార్‌సీపీలో చేరిన సూర్యారావు
  • తీవ్ర అవమానం జరగడం వల్లే బయటకు వచ్చానంటూ వ్యాఖ్య
  • టీడీపీ పార్టీలో చంద్రబాబు ఒక నియంతలా వ్యవహరిస్తున్నారు
  • టీపీపీలో పనిచేసిన మాకు ఒక జెండాను కూడా ఇవ్వలేదు
  • పార్టీ శ్రేయస్సు కోసం భారీగా ఖర్చుచేసి.. పార్టీ కోసం కష్టపడ్డ నాకు చంద్రబాబు అన్యాయం చేశారు
  • సీనియర్ అని చూడకుండా నిర్లక్ష్యం చేశారు
  • ఆయన కొడుకు లోకేష్ దుర్మార్గమైన ఆలోచనలతో ‘లోకేష్ రాజ్యాంగం’ తేవాలని కలలు కంటున్నారు
  • త్వరలోనే లోకేష్ దుర్మార్గపు ఆలోచనలు బయటపెడతా
  • టీడీపీలో దళితులకు అన్యాయం జరుగుతోంది
  •  కష్టపడి పనిచేసిన నన్ను.. చంద్రబాబు లోకేష్ అవమానకర పరిస్థితిలో మెడ పట్టుకుని బయటికి గెంటేశారు

500 కోట్లా?.. ఈనాడుపై ఎమ్మెల్యే తోపుదుర్తి ఫైర్‌

  • ఈనాడు అసత్య కథనాలపై ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మండిపాటు
  • నేను 500 కోట్లు సంపాదించానట్టు ఈనాడు అసత్య ప్రచారం: ఎమ్మెల్యే ప్రకాష్‌
  • ఖాళీ బాండు పైన సంతకం పెట్టి పంపిస్తా వాటిని మీరే అమ్మండి: ఎమ్మెల్యే ప్రకాష్‌
  • నాకు నిజంగా 500 కోట్లు ఆస్తులు ఉంటే వాటిని అమ్మి నా నియోజకవర్గంలో ప్రతి ఇంటికి 50వేల రూపాయలు చంద్రబాబు చేతులపై పంచాలి: ఎమ్మెల్యే ప్రకాష్‌ 
  • బహిరంగ సవాల్ విసిరిన ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి.

20 శాతం జనాభా ఉన్న కాపులకు 24 సీట్లా?: కొడాలి నాని

  • చంద్రబాబు జెండాను పవన్‌ మోస్తున్నారు
  • 20 శాతం జనాభా ఉన్న కాపులకు 24 సీట్లా?
  • 3 శాతం ఉన్న వర్గానికి 31 సీట్లా?
  • చంద్రబాబును సీఎం చేయడమే పవన్‌ లక్ష్యం
  • చంద్రబాబు-పవన్‌ చేతిలో మోసపోయేందుకు ఎవరూ సిద్ధంగా లేరు
  • జగన్‌ను పవన్‌ కల్యాణ్‌ తొక్కేయడం కాదు.. చంద్రబాబును 80 లక్షల పాదాలు పాతాళానికి తొక్కాయి
  • పవన్‌ ఓటు బ్యాంకుతో గెలవాలనే స్థితికి చం‍ద్రబాబు చేరుకున్నాడు

టీడీపీ+ జనసే=0

  • పవన్‌ కల్యాణ్‌ అంటే వ్యక్తిగతంగా గౌరవం ఉంది, కానీ.. 
  • సినిమా నటుడిగానే ఆయన్ని గౌరవిస్తా
  • పవన్‌ కల్యాణ్‌ రాజకీయాలకు పనికిరాడని గతంలోనే చెప్పాను
  • చంద్రబాబు కోసం పవన్‌ ఇప్పుడు పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు
  • పవన్‌ను నమ్ముకుంటే  కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్టే...
  • పవన్ కల్యాణ్ ఎవరిని బెదిరిస్తున్నాడు?
  • ఎవరినైనా ఎదిరించగలిగే శక్తి జగన్ అని జనసేన కార్యకర్తలే చెబుతారు
  • చంద్రబాబు జైలుకు వెళ్తే పవన్‌ బాధపడ్డాడట
  • ప్రజా నాయకుడు వంగవీటి రంగాను నడిరోడ్డుతో చంపినప్పుడు బాధ అనిపించలేదా?
  • స్నేహం చేస్తే చచ్చేవరకు నాది స్నేహం అన్నాడు.. బీజేపీ, సీపీఐ-సీపీఎంలతో స్నేహం ఏమైంది?
  • పవన్ నాలుగో పెళ్ళాం నాదెండ్ల మనోహర్
  • జనసేన కార్యకర్తలు, కాపు సోదరులు పునరాలోచించుకోండి
  • ఇప్పుడున్న రాజకీయాల్లో పవన్‌ కల్యాణ్‌ ఆటలో అరటిపండు మాత్రమే
  • కొన్నాళ్ళకు  పవన్‌ కల్యాణ్‌ తో పొత్తు పెట్టుకున్నందుకు చంద్రబాబే తల పట్టుకునే పరిస్థితి ఎదురవుతుంది..
  • జనసేన ప్లస్ తెలుగుదేశం ఈక్వల్ టు జీరో
  • పవన్ కల్యాణ్ మాట్లాడే సరికే జనం ఖాళీ అయిపోయారు .. ఇంక మీరు గెలవగలిగేదేముంది?
  • టీడీపీ జనసేనలతో పొత్తు ఉందని ఇప్పటివరకు బిజెపి స్పష్టం చేయలేదు
  • పవన్‌ కల్యాణ్‌ నాలుగో పెళ్ళాం నాదెండ్ల మనోహరే
  • చంద్రబాబుకు పవన్‌ కల్యాణ్‌ కు మొగుడు జగన్మోహన్ రెడ్డి
  • జెండా సభకు నారా లోకేష్ దూరంగా ఉండటంపై అంబటి సంచలన వ్యాఖ్యలు
  • పిల్లిని సంకన పెట్టుకుని వెళ్లకూడదనే లోకేషన్ సభకు రానివ్వలేదు
  • చంద్రబాబు అన్ని తెలిసినవాడు కావడం వల్లే లోకేష్ ను సభకు వద్దన్నారు
  • లోకేష్ టీడీపీకి అపశకునం.. లోకేష్ వచ్చిన తర్వాతే టీడీపీ పరిస్థితి దారుణంగా దిగజారిపోయింది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement