AP Political News Jan 14th: పొలిటికల్‌ అప్‌డేట్స్‌ | AP Elections Political News Updates Headlines 14th Jan 2024 Telugu | Sakshi
Sakshi News home page

AP Political News Jan 14th: పొలిటికల్‌ అప్‌డేట్స్‌

Published Sun, Jan 14 2024 6:52 AM | Last Updated on Sun, Feb 4 2024 3:08 PM

AP Elections Political News Updates Headlines 14th Jan 2024 Telugu - Sakshi

AP Elections Political Latest Updates Telugu..

6:40PM, జనవరి 14, 2024

విశాఖ నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయి : రాయపాటి రంగబాబు
నన్ను చంపేందుకు కిరాయి గూండాలను మాట్లాడారు
బెదిరింపు ఫోన్ కాల్స్ గురించి ఎస్పీకి ఫిర్యాదు చేశా


6:37PM, జనవరి 14, 2024

లోకేష్ వల్ల నాకు ప్రాణహాని ఉంది : రాయపాటి రంగబాబు 

  • నన్ను చంపుతామని బెదిరిస్తున్నారు
  • అన్ని ఆధారాలతో ఎస్పీ కి ఫిర్యాదు చేస్తా
  • ఫైబర్ నెట్ లో అంతా అవినీతి
  • రాజధానిలో మీరు పోగు చేసిన చందాల లెక్కలు చెప్పగలరా ?
  • మీ అవినీతిపై ప్రమాణం చేస్తా
  • అవినీతి చేయలేదని ప్రమాణం చేసే దమ్ముందా లోకేష్ ?
  • టీడీపీలో ఒక్కో ఎమ్మెల్యే సీటు కోసం ఎంత తీసుకుంటున్నారో లోకేష్ చెప్పాలి 

5:20PM, జనవరి 14, 2024
ఊరు మారింది.. చదువులూ మారాయి

  • నాడు ప్రభుత్వ విద్య ప్రైవేట్ యాజమాన్యాల కబంధహస్తాల్లో నశించిపోయింది
  • మనబడి నాడు నేడుతో సుందరంగా ప్రభుత్వ స్కూల్స్ తయారయ్యాయి
  • అంతర్జాతీయ స్థాయి సిలబస్తో పేద పిల్లల చదువుల తీరు మారింది

3:55PM, జనవరి 14, 2024

నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు సీఎం జగన్‌ వెంటే ఉంటాను:  ఎమ్మెల్యే, కైలే అనిల్ కుమార్

  • ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నా మీద నమ్మకంతో 2019లో నాకు పామర్రు టికెట్‌  ఇచ్చారు
  • ఆయన నాయకత్వంలో నేను ఈ ఐదేళ్లలో ఎమ్మెల్యేగా ఉన్నాను
  • రాబోయే ఎన్నికల్లో నాకు సీటు ఇవ్వనని ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ చెప్పలేదు
  • సీఎం జగన్‌ సార్‌ని ఎప్పుడు కలిసిన గతంలో కంటే మంచి మెజారిటీతో గెలిచిరావాలని చెప్పేవారు
  • పామర్రు నియోజకవర్గంలో నామీద గెలవలేక తెలుగుదేశం పార్టీ ఇటువంటి ప్రచారం చేస్తోంది
  • నాకు సీఎం జగన్‌ సార్‌ మీద నమ్మకం ఉంది
  • మళ్లీ ఆయన ఆశీస్సులతో   పామర్రు నియోజకవర్గంలో పోటీ చేస్తాను
  • సీఎం జగన్‌మోహన్‌రెడ్డిసారథ్యంలో పామర్రులో భారీ మెజారిటీతో గెలుస్తా
  • నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు నేను జగన్‌ సార్‌ వెంటే ఉంటాను

02:40 PM, జనవరి 14, 2024
పామర్రు ఎమ్మెల్యే  కైలే అనిల్‌ కుమార్‌ కామెంట్లు..
చంద్రబాబు, పవన్‌కు కడుపు ఉబ్బరం ఎక్కువైంది

  • చంద్రబాబు, పవన్ కలయికే అపవిత్రం
  • భోగి మంటల్లో ప్రభుత్వ జీవోలను వేయడం సిగ్గుచేటు
  • చంద్రబాబుకి, పవన్‌కు ప్రజలే బుద్ధి చెబుతారు
  • ప్రజలను మభ్యపెట్టేందుకు మరోసారి ఇద్దరూ కలిసి వస్తున్నారు
  • కులాల వారీగా ప్రజలను విడదీసి లబ్ధి పొందాలని చూస్తున్నారు
  • జగన్‌మోహన్‌రెడ్డిని గద్దె దించడం చంద్రబాబు, పవన్ వల్ల కాదు
  • నిజం నిలకడ మీద నిరూపితమవుతుంది
  • మళ్లీ వచ్చేది జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వమే
  • జగన్‌మోహన్‌రెడ్డి మరో 30 ఏళ్లు సీఎంగా ఉంటారు

02:20 PM, జనవరి 14, 2024
ఆదాయ పన్ను చెల్లించే మహిళల్లో నాలుగో స్ధానంలో ఆంధ్రప్రదేశ్ 

  • ఇదీ అసలైన మహిళా సాధికారత అంటే..
  • ఇదీ మహిళా అభ్యున్నతి అంటే..

01:57 PM, జనవరి 14, 2024
బలం సరిపోవట్లేదు.. బీజేపీ కావాలి

  • చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీలో ప్రధానంగా బీజేపీని ఒప్పించడంపై చర్చ
  • ప్రస్తుతం తమకున్న బలం పూర్తిస్థాయిలో ఓట్లు కురిపించలేదని ఒక నిర్ణయానికి వచ్చిన చంద్రబాబు పవన్
  • ఢిల్లీకి వెళ్లి బీజేపీని ఒప్పించే బాధ్యతను పవన్ కళ్యాణ్‌కు అప్పగించిన చంద్రబాబు
  • అడిగినని ఎంపీ సీట్లు ఇచ్చేందుకు తాము సుముఖంగా ఉన్నట్టు చెప్పాలని సూచించిన చంద్రబాబు
  • ఈసారి పొత్తు తర్వాత నమ్మకంగా ఉంటామని ఢిల్లీ పెద్దలకు హామీ ఇవ్వాలని సూచన
  • ఉమ్మడి మేనిఫెస్టో కు సిద్ధమని అలాగే బిజెపి సూచించే అంశాలను కూడా అందులో పెట్టేందుకు రెడీ అని అంగీకారానికి వచ్చిన చంద్రబాబు
  • పొత్తుకు బీజేపీ ఓకే అంటే మొదటి జాబితాలోనే బీజేపీ నేతల పేర్లు ప్రకటించేందుకు సిద్ధమంటున్న చంద్రబాబు
  • ఢిల్లీ నుంచి బీజేపీ పెద్దలు వస్తే.. ఉమ్మడి సభలు ఎక్కడెక్కడ నిర్వహించాలనే దానిపై చర్చ 
  • ఎన్నికల సమీపిస్తున్నాయి ఇక మ్యానిఫెస్టో తొందరగా విడుదల చేయాలని చర్చ
  • ఈ నెలలోనే కనీసం మినీ మేనిఫెస్టో విడుదల చేయాలని లక్ష్యం
  • వచ్చే ఎన్నికల్లో సీట్ల సర్ధుబాటుపై తెలుగుదేశం జనసేన మధ్య కొలిక్కిరాని చర్చలు
  • నిన్న మూడుగంటలకు పైగా ఇరువురు భేటీ

01:37 PM, జనవరి 14, 2024
ఈ నెల 16న స్కిల్‌ స్కాంలో చంద్రబాబు పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు

  • స్కిల్ స్కాం కేసులో తనకు సెక్షన్ 17A వర్తిస్తుందని పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు
  • సుదీర్ఘంగా విచారణ జరిపిన జస్టిస్ అనిరుద్బోస్, జస్టిస్ బేలాత్రివేది ధర్మాసనం 
  • ఎల్లుండి మధ్యాహ్నం తీర్పు వెలువరించనున్న ధర్మాసనం

01:01 PM, జనవరి 14, 2024
భోగి మంటల్లో పచ్చ పత్రికల దహనం..

  • అబద్ధాలతో ఏపీ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి
  • చంద్రబాబు కోసం జర్నలిజం విలువలు వదిలేసిన ఎల్లో మీడియా
  • భోగి మంటల్లో ఈనాడు, ఆంధ్రజ్యోతి న్యూస్‌ పేపర్లను తగులబెట్టిన వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం నాయకులు
  • కనీసం ఇకనైనా బుద్ధి తెచ్చుకుని.. ప్రభుత్వంపై బురద చల్లే రాతలు మానుకోవాలని హితవు
     

12:25 PM, జనవరి 14, 2024
‘కదలి..రా’వట్లేదు

  • 19న కమలాపురంలో టీడీపీ కార్యక్రమం
  • విజయవంతం కోసం నేతల సమన్వయ సమావేశం
  • జ్వరం సాకుతో డుమ్మా కొట్టిన టీడీపీ ఇన్‌చార్జిలు
  • పుత్తా నరసింహారెడ్డి అసహనం
  • తెలుగుదేశం పార్టీలో లుకలుకలు బహిర్గతం
  • నియోజకవర్గ బాధ్యులకు శిరోభారంగా మారిన అధినేత చంద్రబాబు పర్యటన
  • ఈనెల 19న కమలాపురంలో రా...కదలిరా కార్యక్రమం
  • ఏర్పాట్ల కోసం టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం 
  • ఈ సమావేశానికి ఎమ్మెల్సీ, పొలిట్‌బ్యూరో సభ్యుడితో సహా నలుగురు ఇన్‌చార్జిలు డుమ్మా
  • పొరుగు జిల్లాలకు చెందిన సమన్వయ నేతల ఎదుట కమలాపురం ఇన్‌చార్జి పుత్తా నరసింహారెడ్డి అసహనం
  •  కార్యక్రమాన్ని ఇక్కడ రద్దు చేసి కడపలో పెట్టుకోండంటూ నేతల మధ్య ఉన్న అనైక్యతను బాహాటపర్చారు.

11:14 AM, జనవరి 14, 2024
వలస పక్షులు గాలికే

  • సత్యసాయి జిల్లా టీడీపీలో అసమ్మతి గళం 
  • టీడీపీలోకి వచ్చే వరకూ మొత్తం తానే చూసుకుంటానని చెప్పిన ఆ పార్టీ అధినేత చంద్రబాబు
  • ఇప్పుడు వలస పక్షులను గాలికొదిలేశారు
  • దీంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
  • పదవులు, డబ్బు ఆశజూపి పచ్చ కుండువా కప్పి ఇప్పుడు వారితో అంటీముట్టనట్లుగా ఉంటున్న బాబు
  • కనీసం సీటు విషయంలో హామీలు రాకపోవడంతో వారంతా మరోసారి జంప్‌ చేసేందుకు సిద్ధం
  • సత్యసాయి జిల్లాలో కాంగ్రెస్, వైఎస్సార్‌సీపీ నుంచి కొనసాగిన కొందరు గత 2014–19 మధ్య ప్రలోభాలకు లొంగి టీడీపీ పంచన చేరారు
  • టీడీపీ ఓటమి అనంతరం ముందుగా ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు వారికి న్యాయం చేయలేదు.
  • వచ్చే ఎన్నికల్లో తప్పక న్యాయం చేస్తామని కాలయాపన
  • ఇప్పుడు తమ పరిస్థితి ఏంటని నిలదీస్తున్నా.. ఒక్కరికీ భరోసా ఇవ్వలేదు.

10:40 AM, జనవరి 14, 2024
పాలకొల్లు: నోరు పారేసుకున్న టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు

  • ఏకవచనంతో దళిత నాయకుడిపై ఆగ్రహం
  • ప్రొటోకాల్‌ పాటించలేదంటూ డ్రామాలు
  • నువ్వు కమిషనర్‌వా చేతకానివాడివా? అంటూ పరుష పదజాలం
  • నేను జీతం ఇస్తాను రా.. అంటూ కమిషనర్‌పై ఫోన్‌లో అనుచిత వ్యాఖ్యలు
  • టిడ్కో గృహాల పంపిణీపై ఎమ్మెల్యే అక్కసు  కార్యక్రమం కవరేజీ చేస్తున్న ‘సాక్షి’ విలేకరిపై ఆగ్రహం 

9:38 AM, జనవరి 14, 2024
నేను సంక్రాంతి వేడుకలు చేస్తుంటే సంబరాల రాంబాబు అంటున్నారు: మంత్రి రాంబాబు

  • సంక్రాంతికి నేను సంబరాల రాంబాబునే
  • సంక్రాంతి దాటితే నేను పొలిటికల్ రాంబాబుని
  • సంబరాలు ఎంత సంబరంగా చేస్తానో, రాజకీయాలు అంత సీరియస్ గా చేస్తాను
  • సత్తెనపల్లిలో ప్రతి కుటుంబం  సంతోషంగా సంక్రాంతి జరుపుకోవాలనేదే నా ఆలోచన

9:35 AM, జనవరి 14, 2024
ఎంపీ జీవీఎల్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

  • విశాఖ : ఆంధ్రా యూనివర్సిటీ గ్రౌండ్ లో భోగి మంటలు
  • జీవీఎల్ ఫర్ వైజాగ్ పేరుతో గ్రామీణ వాతావరణాన్ని తలపించేలా భారీ సెట్టింగ్
  • కార్యక్రమానికి హాజరైన నటుడు సాయికుమార్

9:34 AM, జనవరి 14, 2024
బాపట్ల : కారంచేడులో భోగి వేడుకలు

  • భోగి వేడుకల్లో పాల్గొన్న బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి
  • భోగి వేడుకల్లో పాల్గొన్న సినీ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు

9:33 AM, జనవరి 14, 2024
భోగి మంటలు వేసిన చంద్రబాబు, పవన్ కల్యాణ్

  • పొత్తుల పితలాటకంలో కొట్టుమిట్టాడుతున్న పార్టనర్స్
  • ఎన్ని సీట్లు ఎవరికి కావాలన్న దానిపై ఎడతెగని చర్చలు
  • పవన్ కళ్యాణ్ అడుగుతున్నది 40, చంద్రబాబు ఇస్తానంటున్నది 20
  • నియోజకవర్గాల ఎంపిక విషయంలోనూ తర్జనభర్జనలు
  • పవన్ అడిగే నియోజవర్గాలు జనసేనకు ఇవ్వలేమంటున్న చంద్రబాబు

9:03 AM, జనవరి 14, 2024
తేలని సీట్ల పంచాయితీ..

  • మూడు గంటలు భేటీ అయినా అస్పష్టతే..
  • పవన్‌తో బాబు విందు సమావేశం 
  • 50 సీట్లు కావాలని కోరిన పవన్‌.. ఎటూ తేల్చని బాబు
  • టీడీపీ నుంచి కొందరిని జనసేనకు పంపి అక్కడి సీట్లు ఇచ్చే ప్రతిపాదనలపైనా సమాలోచనలు  

8:42 AM, జనవరి 14, 2024
ఇంటర్నేషనల్‌ స్మగ్లర్‌ చంద్రబాబు: రాయపాటి రంగారావు 

  • చంద్రబాబు చేసిన అవినీతి, దారుణాలు, మోసాలు లక్కలేనన్ని ఉన్నాయి
  • కుటుంబాల్లో చిచ్చు పెట్టడం చంద్రబాబుకు కొత్తేమీ కాదు
  • విజయవాడలో కేశినేని కుటుంబంలో తగాదాలు పెట్టిన చంద్రబాబు ఇప్పుడు తమ కుటుంబంలోనూ మొదలు పెట్టారు
  • తనపై విమర్శలు చేసిన తన సోదరి శైలజ ఇంటి పేరు రాయపాటి ఎలా అవుతుంది?
  • చిన్న­నాటి నుంచి కలిసి పెరిగిన విష­యాన్ని శైలజ మరిచిపోకూడదు
  • కుటుంబంలో చిచ్చుపెట్టేందుకు శైలజను ముం­దుకు తెచ్చారు
  • ఆ తర్వాత ఆమెను పట్టించుకోరు
  • అసలు టీడీపీలో కనీస సభ్యత్వం లేని శైలజ ఏ విధంగా విమర్శలు చేస్తుంది
     

8:30 AM, జనవరి 14, 2024
సంక్రాంతి అందరి జీవితాల్లో వెలుగులు నింపాలి: మంత్రి రోజా

  • టీడీపీ, జనసేన మేనిఫెస్టోను ప్రజలు భోగి మంటల్లో వేసి తగులబెడుతున్నారు
  • సంక్రాంతి హైదరాబాదు నుండి ఊర్లకు వచ్చినట్లు చంద్రబాబు, పవన్ వచ్చారు
  • హైదరాబాదు నుండి వచ్చి ఇద్దరు నాన్ లోకల్ నేతలు భోగి వేస్తున్నారు
  • భోగి, ఎన్నికలు అయిపోగానే మళ్లీ హైదరాబాదుకు వెళ్లిపోతారు
  • ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబు, పవన్ ను తరిమేయండి : మంత్రి రోజా

8:12 AM, జనవరి 14, 2024
సీనియర్ల మౌనం.. సందేహం! 

  • టీడీపీని వీడుతారని ప్రచారం
  • స్తబ్దుగా ప్రత్తిపాటి, యరపతినేని 
  • అసంతృప్తిలో అయ్యన్నపాత్రుడు
  • దేవినేని ఉమ, అచ్చెన్నాయుడిదీ అదే తీరు
  • టీడీపీ సీనియర్‌ నేతలు కొందరు ఎన్నికల సమయంలో స్తబ్దుగా ఉండడం చర్చనీయాంశంగా మారింది.
  • కీలకంగా పని చేయాల్సిన తరుణంలో ముఖం చాటేయడం, పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొనకపోవడంతో టీడీపీ క్యాడర్‌లో ఆందోళన
  • ప్రత్తిపాటి పుల్లారావు, యరపతినేని శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు తదితరులు అధిష్టానం తీరుతో తీవ్ర అసంతృప్తి.
  • ఇదే పరిస్థితి కొనసాగితే వారు పార్టీ వీడే ఆస్కారమూ ఉందనే వాదన 
  •  సీనియర్లంతా పార్టీపై అసంతృప్తితో మౌనంగా ఉండడానికి చినబాబు లోకేశ్‌ తీరే కారణంగా తెలుస్తోంది
  • ఆయన సీనియర్లను దూరం పెట్టడంతోపాటు వారికి వ్యతిరేకంగా జూనియర్లను ఎగదోయడం అసంతృప్తి జ్వాలలను పెంచిందని సమాచారం.
  • ఈ నేపథ్యంలో ప్రత్తిపాటి, యరపతినేని తదితర సీనియర్‌ నేతలు పార్టీని వీడే ఆస్కారం ఉందనే ప్రచారం
  • మరింత మంది సీనియర్లు లోకేశ్‌ తీరు కారణంగా లోలోన రగిలిపోతున్నట్టు సమాచారం.

7:50 AM, జనవరి 14, 2024
లోకేష్‌కే హామీ ఇవ్వని బాబు ప్రజలకేమిస్తాడు.. దేవినేని అవినాష్ 

  • టీడీపీ మేనిఫెస్టో అబద్ధపు హామీలతో నిండిపోయింది
  • భవిష్యత్తు గ్యారంటీ హామీ పత్రాలు భోగి మంట వెలిగించటానికి కూడా పనికిరావు
  • రానున్న ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగురవేసి సీఎం జగన్‌కు గిఫ్ట్ ఇస్తాం
  • జగన్ పాలనలో రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉన్నారు.. 

7:46 AM, జనవరి 14, 2024
పండుగలను సైతం రాజకీయం చేయడం సిగ్గుచేటు: వెల్లంపల్లి శ్రీనివాస్‌

  • పండుగలను రాజకీయం చేయొద్దని చంద్రబాబు, లోకేష్, పవన్‌కు హితవు పలుకుతున్నా
  • జగన్‌ని సీఎం కుర్చీలోంచి దించేసి..తాను సీఎం అయిపోవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడు
  • కుప్పంలో ఓడిపోతాడని చంద్రబాబుకి అర్ధమైపోయింది
  • అందుకే ఈసారి కుప్పం వెళ్లకుండా అమరావతిలోనే ఉండిపోయాడు
  • చంద్రబాబు, పవన్, లోకేష్ ఎక్కడ పోటీచేయాలో తెలియక భయపడుతున్నారు
  • అమరావతిలో కూర్చుని చంద్రబాబు, పవన్ నీచ రాజకీయాలు చేస్తున్నారు
  • రాబోయే ఎన్నికల్లో గెలవడం ఖాయం.. వైఎస్‌ జగన్‌ మళ్లీ సీఎం కావడం ఖాయం
  • ఎన్టీఆర్ జిల్లాలో ఏడు స్థానాలు గెలిచి సీఎం జగన్‌కు కానుకగా ఇస్తా

7:15 AM, జనవరి 14, 2024
చంద్రబాబు దొడ్డిదారి రాజకీయం

  • జనసేన నుంచీ టీడీపీ అభ్యర్థులే
  • పవన్ దగ్గరకు టీడీపీ నేతల్ని పంపిస్తున్న చంద్రబాబు
  • జనసేన పార్టీ నుంచి తన అభ్యర్థులే ఉండేలా బాబు ప్లాన్!
  • పవన్ ను కలిసిన మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్
  • విజయవాడ వెస్ట్ సీటు కోసం జలీల్ ఖాన్‌ను పంపిన చంద్రబాబు
  • మొన్న పవన్ కల్యాణ్‌ను కలిసిన మాజీ ఎమ్మెల్యే వేదవ్యాస్
  • పెడన సీటు కోసం వేదవ్యాస్‌ను పంపిన చంద్రబాబు
  • కొద్ది రోజుల క్రితం పవన్‌ను కలసిన మాజీ ఎంపీ మాగంటి బాబు
  • ఎంపీ సీటు జనసేన నుంచి కోరిన మాగంటి బాబు
  • తిరుపతి సీటు కోసం పవన్‌ను కలిసిన సుగుణమ్మ
  • జనసేనకు అభ్యర్థులు లేక టీడీపీ నేతల్ని పంపుతున్న చంద్రబాబు
  • చంద్రబాబు తీరు పట్ల జనసేన నాయకుల్లో అనుమానాలు
  • అభ్యర్థులు లేక తామే పవన్ కు పంపుతున్నామని చెప్తున్న టీడీపీ నేతలు
  • పార్టీని నమ్ముకుని ఉన్న వారికి పవన్ మొండిచేయి చూపుతారని జనసేనలో చర్చ

7:09 AM, జనవరి 14, 2024
పవన్‌కు 40 సీట్లే చాలట!

  • హరిరామ జోగయ్య మరో బహిరంగ లేఖ
  • టీడీపీ జనసేన పొత్తులపై కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు హరిరామ జోగయ్య  లేఖ విడుదల
  • బీజేపీతో కలిసి వెళ్లే ఆవశ్యకతపై పవన్‌ను కలిసినట్లు(రెండు రోజుల కిందట) వెల్లడి
  • పొత్తులో 60 సీట్లు అడగాలని పవన్‌కు సూచించిన హరిరామ జోగయ్య
  • 40 సీట్లతో సరిపెట్టుకోవాలనుకుంటున్న పవన్‌
  • ఇదే విషయాన్ని లేఖలో బహిర్గతం చేసిన హరిరామ జోగయ్య
  • పవన్‌ రెండున్నరేళ్లు సీఎంగా ఉండాలని హరిరామ జోగయ్య ఆకాంక్ష
  • జనసైనికులు అదే కోరుకుంటున్నారని లేఖలో వెల్లడించిన కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు

7:05 AM, జనవరి 14, 2024
గుంటూరు సీఐడీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

  • గుంటూరు సీఐడీ కార్యాలయం వద్ద తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ఓవరాక్షన్
  • లిక్కర్ కుంభకోణంలో హైకోర్టు షరతులు భాగంగా విచారణ అధికారి వద్ద లొంగిపోయి పూచికత్తు సమర్పించడానికి వచ్చిన చంద్రబాబు నాయుడు
  • చంద్రబాబు రాక సందర్భంగా తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు ఓవరాక్షన్
  • పోలీసులతో వాగ్వివాదం
  • బారికేడ్లను నెట్టేసి పోలీసు పైన దౌర్జన్యం
  • పోలీసులకు తెలుగుదేశం నాయకులకు మధ్య తోపులాట

6:50 AM, జనవరి 14, 2024
సీఐడీ అధికారుల ఎదుట లొంగిపోయిన చంద్రబాబు 

  • ముందస్తు బెయిల్‌ కోసం పూచీకత్తుల సమర్పణ 
  • పూచీకత్తులు సమ ర్పించిన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర
  • సీఐడీ కార్యాలయం వద్ద తెలుగు తమ్ముళ్ల హల్‌చల్‌
  • ఇన్నర్‌రింగ్‌ రోడ్‌ అలైన్‌మెంట్‌లో అక్రమాలు, మద్యం కొనుగోళ్లలో అక్రమాలు, ఉచిత ఇసుక దోపిడీ కేసుల్లో ప్రధాన నిందితుడిగా  చంద్రబాబు
  • ఆ కేసుల్లో ముం­దస్తు బెయిల్‌ మంజూరు చేస్తూ హైకోర్టు ఆదేశాల మేరకు పూచీ కత్తులు సమర్పించిన బాబు
  • ఈ మూడు కేసుల్లో హైకోర్టు చంద్రబాబుకు షరతులతో కూడిన ముందస్తు బెయిల్‌ మంజూరు
  • ఈ కేసుల్లో దర్యాప్తు అధికారుల ఎదుట లొంగిపోయి ఒక్కో కేసులో ఇద్దరు పూచీకత్తుతో పాటు రూ.లక్ష చొప్పున ష్యూరిటీ బాండ్లు సమర్పించాలని కోర్టు ఆదేశం
  • విచారణ కోసం దర్యాప్తు అధికారి పిలిచినప్పుడు హాజరుకావాలని కూడా పేర్కొన్న కోర్టు
  • పార్టీ నేతలతో కలసి ముం­దుగా విజయవాడ తులసీనగర్‌లోని సీఐడీ ప్రాం­తీయ కార్యాలయానికి వెళ్లిన బాబు
  • ఇసుక కుంభకోణం కేసులో ముందస్తు బెయిల్‌ కోసం పూచీకత్తులు సమర్పించిన బాబు.
  • అనంతరం తాడేç­³ల్లిలోని సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) కార్యాలయానికి వెళ్లిన చంద్రబాబు
  • ఇన్నర్‌రింగ్‌ రోడ్‌ అలైన్‌మెంట్‌లో అక్రమాల కేసులో ముందస్తు బెయిల్‌కు అవసరమైన పూచీకత్తులు సమర్పించారు
  • చివరిగా గుంటూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి చేరుకున్న బాబు
  • మద్యం కుంభకోణం కేసులో పూచీకత్తులు సమర్పించారు
  • ఇదే కేసులో నిందితుడిగా ఉన్న టీడీపీ నేత కొల్లు రవీంద్ర, అప్పటి ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌ శ్రీనరేష్‌ కూడా ముందస్తు బెయిల్‌కోసం పూచీకత్తులు సమర్పించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement