మహారాష్ట్ర: వివాదాస్పద సోషల్ మీడియా పోస్టు కారణంగా మహారాష్ట్రలోని కొల్లాపూర్‌లో ఆందోళనలు మిన్నంటాయి. మొఘల్ రాజు ఔరంగజేబును కీర్తిస్తు, మహారాష్ట్ర చిహ్నాన్ని కించపరిచేలా ఆ పోస్టు ఉందనే ఆరోపణలతో ఆందోళనకారులు కొల్లాపూర్‌లో బంద్‌కు పిలుపునిచ్చారు.
ఉదయం 10 గంటల ప్రాంతంలో శివాజీ మహారాజ్ చౌక్ వద్ద ఆందోళనకారులు గుమిగూడారు. వివాదాస్పద పోస్టు చేసిన వ్యక్తులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో కొంతమంది ఆందోళనకారులు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. కొన్ని వాహనాలు కూడా ధ్వంసం అయ్యాయి. పోలీసులు లాఠీ ఛార్జీ చేశారని, టియర్ గ్యాస్ కూడా ప్రయోగించారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
దీనిపై స్పందించిన సీఎం ఎక్‌నాథ్ షిండే.. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడటం ప్రభుత్వ విధి. ప్రజలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. పోలీసు దర్యాప్తు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: వీడియో: ఆయన మంచి మనిషి.. తల్చుకుని మరీ కంటతడి పెట్టిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
Comments
Please login to add a commentAdd a comment